The Legendary Encounter of RAVANA and Bali Chakravarthy - రావణుడికి బలి చక్రవర్తి హెచ్చరిక!

రావణుడికి బలి చక్రవర్తి హెచ్చరిక! వామనుడి చేత తొక్కబడిన బలి చక్రవర్తి కాలానికీ రావణుడి కాలానికీ సంబంధముందా? ఉత్తమోత్తమ పుత్రుడు.. ఆదర్శ సోదరుడు.. ప్రతి స్త్రీ కోరుకునే సర్వోత్తమ పతి.. గురువులందరూ కోరుకునే ఉత్తమ శిష్యుడు.. మర్యాద పురుషోత్తముడు.. ప్రపంచ మానవాళి పాటించాల్సిన జీవివన విధానాన్ని తానాచరించి, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన యుగపురుషుడు, రామచంద్ర ప్రభువు. అటువంటి స్వామి చరితం ఎన్ని సార్లు విన్నా, ఎంత మంది ఎన్ని విధాలుగా సినిమాలు తీసినా, ఎన్ని చూసినా తనివి తీరదు. వాల్మీకి మహర్షి కొన్ని యుగాల పూర్వమే ఎంతో చక్కగా, మరెంతో అద్భుతంగా, ఆ స్వామి చరిత్రను రామాయణంగా భావి తరాలకు అందించిన విషయం తెలిసిందే. ఇంత కాలంగా చాలా మంది కవులు, కళాకారులు, వాల్మీకి రామాయణాన్ని తమ తమ భాషలలో మళ్ళీ మళ్ళీ అనువదించారు. ఎన్నో నాటకాలు రచించి, రంగస్థలంపై కళ్ళకు కట్టినట్లు చూపించారు. బుర్ర కథలతో ప్రచారం చేశారు, పొడుపు కథలలో పొందు పరిచారు, పుస్తకాలలో ప్రచురించారు. ఈ ఆధునిక యుగంలో నాటకాలుగా, సినిమాలుగా, ప్రజల ముందుకు తీసుకువచ్చారు. అయినా ఈ నాడు అందరికీ రామాయణం సంపూర్ణంగా తెలుసా అని ప్రశ్నిస్తే.. తెలియదనే సమాధానమే వస...