తరతరాల సనాతన సాంప్రదాయాలు! Ancient Hindu Traditions

 

మనం మరచి పోతున్న కొన్ని,
తరతరాల సనాతన సాంప్రదాయాలు!

సోమవారం తలకు నూనె రాయరాదు.

ఒంటి కాలిపై నిలబడ రాదు.

మంగళ వారం పుట్టినింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్లరాదు.

శుక్రవారం నాడు కోడలిని పుట్టినింటికి పంపరాదు.

గుమ్మడికాయ ముక్కలనే ఇంటికి తేవాలి.

ఇంటిలోపల గోళ్ళు కత్తిరించరాదు.

మధ్యాహ్నం తులసి ఆకులను కోయరాదు.

సూర్యాస్తమయం తరువాత కసవు వూడ్చరాదు, తల దువ్వరాదు.

పెరుగును, ఉప్పును అప్పు ఈయరాదు.

వేడి వేడి అన్నంలో పెరుగు వేసుకోరాదు.

భోజనం మధ్యలో లేచిపోరాదు.

తల వెంట్రుకలు ఇంట్లో వేయరాదు.

గడపపై పాదం పెట్టి వెళ్లరాదు.

ఇంటినుండి బయటకు వెళ్ళేటప్పుడు కసవూడ్చరాదు

గోడలకు పాదం ఆనించి పడుకోరాదు.

రాత్రి  వేళలో బట్టలుతకరాదు.

విరిగిన గాజులు వేసుకోరాదు.

నిద్ర లేచిన తరువాత పడుకున్న చాపను మడిచి పెట్టాలి.

చేతి గోళ్ళను కొరకరాదు.

అన్న తమ్ముడు,తండ్రి కొడుకు ఒకే సారి క్షవరం చేయించుకోరాదు.

ఒంటి (సింగిల్) అరిటాకును తేరాదు.

సూర్యాస్తమయం వేళలో నిద్ర పోరాదు.

కాళ్ళు కడిగేటప్పుడు మడమలను మరచిపోరాదు.

ఇంటి గడపపై కూర్చోరాదు.

తిన్న తక్షణమే పడుకోరాదు.

పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకుని, కాళ్ళు చాపుకుని కూర్చోరాదు.

చేతులు కడిగిన పిమ్మట విదిలించరాదు.

రాత్రి భోజనం తరువాత పళ్ళెం కడుక్కోవాలి.

ఎంగిలి చేతితో వడ్డించరాదు.

అన్నం, కూర, చారు వండిన పాత్రలలో తినరాదు.

సింకులో పాత్రలపై ఎంగిలి చేతులు కడగరాదు.

ఇంటికి వచ్చిన ఆడ పిల్లలకు, ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా  పంపరాదు.

చిరిగిన అంగీలు, బనియన్లు తదితర లో దుస్తులను ధరించరాదు.

ఇంటి లోపలికి చెప్పులు / Shoes ధరించి రారాదు.

దేవాలయాలలో చెప్పులు పోతే మరచిపొండి. వేరే వాళ్ళవి వేసుకొస్తే దారిన పోయే దరిద్రాన్ని ఇంటికి  తెచ్చుకున్నట్లే.

జంతువులకు  (కుక్కలు, దూడలు లాంటివి) పాచిపోయిన పదార్థాలు పెట్టకండి.

ఒకరు వేసుకున్న బట్టలు, ఆభరణాలు మరొకరు ధరించరాదు.

శనివారం ఉప్పు, నూనె కొని తేరాదు.

అనవసరంగా కొత్త చెప్పులను కొనరాదు.

ఇంటిలో వాడకుండా పడివున్న గోడ గడియారాలు, వాచీలు, సైకిళ్ళ,
కుట్టు మెషిన్లు లాంటివి వదిలించుకోవాలి.

భగవంతుణ్ణి అది కావాలి, ఇది కావాలి అని అడుక్కుని భిక్షగాళ్ళు కాకండి.
మీకు రావలసివుంటే ఆయనే ఇస్తాడు.

అర్హులకు మాత్రమే గుప్త దానం చేయండి.

మఠాలు దేవాలయాకు చెందిన వస్తువులు దురుపయోగం చేస్తే 
మీ తరువాతి తరం వాళ్ళకు శిక్ష పడుతుంది.

ఇతరులను అనవసరంగా విమర్శించడం,
మిమ్మల్ని మీరు పొగడుకోవడం మానండి.

మీరు, మీ అధికారం ఏవీ శాశ్వతం కావు. ఇతరులను ఎదగనివ్వండి. 
మీరు వారికి గురువులాగా ప్రవర్తించండి.

మన పూర్వీకులు చెప్పిన పై వాటిని ఆలోచించి మార్పు సహజమని గుర్తించి,
ప్రశాంత జీవన విధానం అలవరచుకోండి.

కారు మేఘాలు కమ్ముతున్నాయి.. ఏక్షణంలో అయినా వర్షం విపరీతంగా కురుస్తుంది..!
వేసే ముగ్గు..ఆవర్షంలో కలుస్తుంది! అయినా.. ఆమె ముగ్గువేస్తోంది..!
అదీ.. సంప్రదాయం అంటే..! 

అంతర్జాతీయ ఖ్యాతినార్జించి అమెరికాలో ఉంటున్న వైద్యుడు..
సొంతూరు వచ్చినప్పుడల్లా పాఠాలు చెప్పిన పంతులు గారికి పాదాభివందనం చేస్తాడు…! 
అదీ.. సంస్కారం! 

ఖగోళ శాస్త్రాన్ని నమిలి మింగిన నిష్ణాతుడు..
నిష్టగా ఉంటూ గ్రహణం విడిస్తేగానీ ఆహారం తీసుకోడు..!
అదీ.. నమ్మకం!

పరమాణు శాస్త్రాన్ని పిండి పిప్పిచేసిన పండితుడు.. 
మనవడి పుట్టు వెంట్రుకలు పుణ్యక్షేత్రంలో తీయాలని,
పరదేశం నుండి పయనమై వస్తాడు..!
అదీ.. ఆచారం!

అంతరిక్ష విజ్ఞానాన్ని అరచేతబట్టిన  అతిరధుడు..
అకుంఠిత నిష్ఠతో పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తాడు..!
అదీ.. సనాతన ధర్మం!

అత్తింటికి వెళ్లేముందు ఇంటి ఆడబడుచు పెద్దలందరికీ 
పాదాభివందనం చేసి పయనమవుతుంది..!
అదీ.. పద్ధతి!

పెద్ద చదువులు చదివినా, పెద్ద కొలువు చేస్తున్నా, పేరు ప్రఖ్యాతులున్నా,
పెళ్లి పీటలమీద.. వధువు పొందికగా ఉంటుంది..!
అదీ.. సంస్కృతి!

భార్య పక్షవాతానికి లోనయ్యింది.. మంచం దిగలేని పరిస్థితి.. తనంతట తానుగా నడవలేని స్థితి..
భర్త భరోసాగా నిలచి, భారమంతా మోస్తాడు.. అన్నీ తానై ఆలిని సాకుతాడు..!
అదీ.. దాంపత్యం!

బ్రతికే అవకాశం తక్కువ, వెంటిలేటర్ పై వేచిచూస్తే బ్రతికితే బ్రతకొచ్చు!
లక్షల ఖర్చు భరిస్తూ వెంటిలేటర్ పై పెడతారు..!
అదీ.. అనుబంధం!

ఇవి భారతీయుల తరతరాల ఆచారాలు, సంప్రదాయలు, విలువల్లో కొన్ని మాత్రమే..

మన హిందూ సాంప్రదాయాలను ఆచరించండి, అందరితో ఆచరింపచేయండి..

ధర్మో రక్షతి రక్షితః!

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home