మార్గశిర మాసం - Significance of Margasira Masam


రేపటి నుండి మార్గశిర మాసం ప్రారంభం - మార్గశిర మాస విశిష్టత!

ప్రతి సంవత్సరం కార్తీక మాసం తర్వాత మార్గశిర మాసం ప్రారంభమవుతుందని అందరికీ తెలిసిన విషయమే. సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్మే భగవద్గీతలో 'మాసానాం మార్గశీర్షోహం' అని చెప్పారంటే, హిందువులకు ఈ మాసం ఎంత పవిత్రమైనదో తెలుస్తుంది. మోక్ష గ్రంధమైన భగవద్గీత అవతరించినది కూడా, ఈ మాసంలోనే అని చెబుతారు. హిందువులు నెల రోజుల పాటు తిరుప్పావై చదువుతూ, పరమ భక్తితో చేసుకునే ధనుర్మాస వ్రతం కూడా, ఈ మాసంలోనే మొదలవుతుంది. ఈ మాసంలో విష్ణు ప్రీతిగా చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా, మంచి ఫలితాన్ని ఇస్తుంది.

[ శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన మార్గశిరమాస విశిష్టత: https://youtu.be/0IsB-um3hno ]


శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం ఇదని అందరూ చెబుతుంటారు..

పెద్ధలు ఈ మాసాన్ని మోక్ష మాసంగా, లేదా మోక్ష సాధనా మాసంగా కూడా చెబుతారు. భక్తితో ఉపవాసం, జాగరణ ఉండి చేసే మోక్షద ఏకాదశి కూడా, ఈ మాసంలోనే వస్తుంది.

నిజానికి ఈ మాసానికి ఎందుకంత ప్రాముఖ్యత అనే విషయం గురించి తెలుసుకుందాం..

మార్గశిరం తరువాత వచ్చే పుష్యమాసం నుండి, ఉత్తరాయణం మొదలవుతుంది. ఉత్తరాయణం దేవతలకు పగటి కాలం.

అలా చూసుకుంటే, దక్షిణాయనం చివరిభాగం, ఉత్తరాయణం ముందు వచ్చే భాగం అయిన మార్గశిరం, పగలుకు ముందు వచ్చే బ్రాహ్మీముహూర్తం లాంటిదని తెలుస్తుంది. రోజులో బ్రాహ్మీ ముహూర్తం ఎంత ప్రాధాన్యత కలిగినదో, సంవత్సరానికి స్వయం విష్ణు స్వరూపమైన మార్గశిరం కూడా అంతే ప్రాధాన్యత కలిగినది. ఎలాగైతే బ్రాహ్మీ మహూర్తంలో మనం నిత్య పూజ చేసుకుంటామో, అదే విధంగా, దేవతలకు బ్రాహ్మీ ముహూర్తమైన ఈ మాసమంతా, దేవతలూ, ఋషులూ, యోగులూ, శ్రీమహావిష్ణువును భక్తితో పూజిస్తారు. ఈ మాసం లక్ష్మీనారాయణ స్వరూపం. శ్రావణ శుక్రవారం, కార్తీక సోమవారం లాగా, మార్గశిర లక్ష్మివారం (గురువారం), మార్గశిర శనివారం, చాలా ప్రాముఖ్యతగలవి.

Link: https://www.youtube.com/post/Ugkx5CgqUoRUPmDvVi9k7HNxYJyriK7GCvOA

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home