యువక్రీతుడి కథ! Sustainable Attainment 'Story of Yuvakrita'
రోమశ మహర్షి చెప్పిన యువక్రీతుడి కథ!
గురుముఖతః నేర్చుకోని విద్య ఎందుకు పనికిరాదు?
గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురు స్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/P1cMnPseiNU ]
మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా, ప్రతి అడుగులోనూ, ప్రతిక్షణంలోనూ, ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుకా గురువు వుంటాడు. గురువు యొక్క విశిష్ఠత మన పురాణ గ్రంథాలలో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎంత కఠోర దీక్ష చేసినా, ఎన్ని వరాలను పొందినా, గురుముఖతా నేర్చుకున్న విద్యకు సమానం కాదు. అందుకు ఉపమానంగా, పాండవులు అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు, వారి వెంట ఉన్న రోమశ మహర్షి, సంగమ నదీ తీరం వద్ద, యువక్రీతుని గురించి వివరించాడు. యువక్రీతుడు ఎందుకు ఘోర తపస్సుకు పూనుకున్నాడు? ఇంద్రుడిని అడిగిన వరం ఏంటి? ఒక మహర్షి చేతిలో అతని మరణం ఎందుకు సంభవించింది? అనేటటువంటి ఉత్సుకతను రేకేత్తించే అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసకుందాము..
రైభ్యుడూ, భరద్వాజుడూ అనే మహా ఋషులిరువురూ మిత్రులు. వారిద్దరూ అడవిలో తపస్సులో నిమగ్నమయ్యారు. రైభ్యునికి అర్ధావసుడు, పరావసుడనే కుమారులున్నారు. వారిద్దరూ మంచి విద్యావంతులే అయినా, అర్ధావసుడు సంస్కారవంతుడు కూడా. భరద్వాజుని కుమారుడి పేరు యువక్రీతుడు. అతనికి అర్ధావసుడూ, పరావసుడంటే అసూయ. అందుకని, కష్టపడకుండా సకల విద్యలూ సంప్రాప్తించాలనే కోరికతో, ఇంద్రుని గురించి తపస్సు చేశాడు. చివరకు ఇంద్రుడు ప్రత్యక్షమై, అంత ఘోరతపస్సుకు కారణం అడిగాడు. అందుకు యువక్రీతుడు, తనకు చదవకుండానే సకల శాస్త్రాలూ, వేదాలూ అవగతం కావాలని కోరాడు. ఆ మాటలు విన్న ఇంద్రుడు, అది అనుచితమని చెప్పి, అలా వచ్చే విద్య మత్సరాన్ని కలిగిస్తుంది. అది మంచిది కాదు. విద్య గురు ముఖతః నేర్చుకుంటేనే శాశ్వతమని హితవు పలికి, మరే ఇతర వరాన్నైనా కోరుకొమన్నాడు. అందుకు యువక్రీతుడు సమ్మతించలేదు. దాంతో ఇంద్రుడు తిరిగి వెళ్ళి పోయాడు.
మరింత పట్టుదలతో యువక్రీతుడు తపస్సును కొనసాగించాడు. మరల ఇంద్రుడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి, అక్కడ ప్రవహిస్తున్న గంగా నదికి అడ్డుగా, చేతులతో ఇసుక పోస్తూ సేతుబంధనం నిర్మించే ప్రయత్నం చేయసాగాడు. అది చూసి యువక్రీతుడు నవ్వి, అలా ఎన్ని రోజులు చేస్తే, ఆ సేతువు పూర్తవుతుందని అడిగాడు. దానికి ఆ వృద్ధుడు, అతనిలాగానే అసాధ్యమైన దాని కోసం ప్రయత్నిస్తున్నానని సత్యాన్ని పలికాడు. ఇంద్రుడు తన నిజరూపం చూపి, తను చేసిన పని ఎంత నిరర్ధకమో, సంస్కార రహితమైన విద్యలూ అంతే నిరర్ధకమని చెప్పి, అతని ప్రయత్నం విరమించుకోమని చెప్పజూశాడు. అందుకు యువక్రీతుడు అంగీకరించక, తనకు సకల విద్యలూ కావలసిందేనని పట్టు పట్టాడు. ఇక ఇంద్రుడు చేసేది లేక, అతనికి సకల విద్యలనూ ప్రసాదించాడు.
తన కోరిక తీరిందన్న గర్వంతో, తన తండ్రి వద్దకు వెళ్ళాడు యువక్రీతుడు. తన పాండిత్యంతో ఎంతో మందిని ఓడించాడు. ఒకరోజు యువక్రీతుడు, తన తండ్రి మిత్రుడైన రైభ్యుని చూడటానికి వెళ్ళాడు. అక్కడ రైభ్యుని రెండవ కుమారుడు పరావసుడి భార్య అయిన కృష్ణ అనే సుందరిని చూశాడు. ఆమెను మోహించి, తన కోరిక తీర్చమని అడిగాడు. అందుకామె, అతనిని తిరస్కరిస్తే శపిస్తాడేమోనని భయపడి, సాకు చెప్పి తప్పించుకుని పోయింది. తరువాత ఆ విషయాన్ని తన మామగారికి చెప్పి, కన్నీరు పెట్టుకుంది. దాంతో రైభ్యుడు ఆగ్రహించి, తన జటాజూటం తీసి అగ్నిలో వేసి, ఒక రాక్షసుడిని సృష్టించాడు. మరొక జటను లాగి అగ్నిలో వేసి, కృష్ణ లాంటి మరొక కన్యను సృష్టించాడు. వారిరువురినీ చూసి, యువక్రీతుని నశింపజేయమని చెప్పి పంపాడు. ముందు ఆ యువతి తన అందంతో యువక్రీతుని మైమరపించి, అతని కమండలాన్ని సంగ్రహించింది. కమండలం పోగానే యువక్రీతుడు అశక్తుడయ్యాడు. వెంటనే రాక్షసుడు యువక్రీతుని వధించాడు. ఆ తరువాత రైభ్యుడు, ఆ యువతిని రాక్షసునికి ఇచ్చి వివాహం చేశాడు. ఆశ్రమానికి వచ్చిన భరద్వాజుడు, కుమారుని మరణ వార్త విని, పుత్ర శోకం భరించలేక, అగ్ని ప్రవేశం చేసి మరణించాడు.
తరువాత కొన్నాళ్ళకు, బృహద్యుమ్నుడనే రాజు సత్రయాగం చేయడానికి పూనుకున్నాడు. ఆ యాగానికి పరావసుడూ, అర్ధావసులను ఋత్విక్కులుగా నియమించాడు. యజ్ఞం జరుగుతుండగా ఆ రాత్రి, పరావసుడు ఆశ్రమానికి బయలుదేరిన సమయంలో, అరణ్యమార్గంలో ఏదో అలికిడి వినిపించింది. ఎదో క్రూరమృగమనుకుని, ఆత్మరక్షణార్ధం పొరపాటున ఎదురుగా వస్తున్న తండ్రి రైభ్యుని చంపాడు. తండ్రిని గుర్తించి, కుమిలి పోయాడు. అతనికి దహన సంస్కారాలు ముగించి అన్న వద్దకు పోయి, జరిగినది చెప్పాడు. పరావసుడు తన అన్న అర్ధావసుడితో, "అన్నయ్యా! నీవు ఒక్కడివే, యాగాన్ని నిర్వహించ లేవు. అది నేను చేయగలనుగనుక, నేను యాగాన్ని కొనసాగిస్తాను. నీవు పోయి నాకు కలిగిన బ్రహ్మహత్యా పాతకానికి పరిహారం చెయ్యి" అని అన్నాడు. సంస్కారవంతుడైన అర్ధావసుడు, తమ్ముని బదులు అన్ని ప్రాయశ్చిత్తములూ పూర్తి చేసి, యాగశాలకు తిరిగి వచ్చాడు. అన్నయ్యను చూసిన పరావసుడు, ఎక్కడ తనవలన జరిగిన తప్పును బయటపెడతాడోనన్న భయంతో, బృహద్యుమ్నునితో, "మహారాజా! ఇతడు యాగశాలలో ప్రవేశించడానికి అర్హుడు కాదు. పవిత్రమైన యాగక్రతువును విడిచి, బ్రహ్మహత్యా ప్రాయశ్చిత కార్యం నిర్వహించి వస్తున్నాడు" అని అన్నాడు. ఆ మాటతో రాజు అనుచరులు, అర్ధావసుణ్ణి యాగశాలలోనికి రాకుండా అడ్డుకున్నారు.
సత్వగుణుడైన అర్ధావసుడు, అప్పుడుకూడా తమ్ముడి మీద ఆపేక్షతో వాస్తవాన్ని బయటపెట్టక, దేవతలను ప్రార్ధించాడు. దానికి దేవతలు సంతోషించి, అతని సత్యనిరతిని మెచ్చుకుని, ఏం వరం కావాలో కోరుకోమన్నారు. అప్పుడు అర్ధావసుడు, "అయ్యా! నా తండ్రినీ, భరద్వాజునీ, యువక్రీతుణ్ణీ బ్రతికించండి. అలాగే, నా తమ్ముని దోషాన్ని కూడా పరిహరించండి" అని కోరుకున్నాడు. ఆ విధంగా దేవతలు, అర్ధావసుడు కోరినట్లు వారిని బ్రతికించారు. తిరిగి బ్రతికిన యువక్రీతుడు దేవతలను చూసి, "దేవతలారా! నేను ఎన్నో విద్యలను పొందాను, వ్రతాలు చేశాను. కానీ, రైభ్యునిచే చంపబడ్డాను. కారణం ఏమిటి?" అని అడిగాడు. దానికి సమాధానంగా దేవతలు "యువక్రీతా! గురు ముఖతః నేర్చుకున్న విద్య, సంస్కారంతో కూడుకున్నది గనుక, ఫలిస్తుంది. తపస్సు వలన పొందినది అహంకారపూరితమైనది గనుక, అక్కరకురాదు. అందుకే నీ కమండలం దూరమైన వెంటనే, నీ విద్యలు నిర్వీర్యమయ్యాయి. రైభ్యుని విద్య గురువు నేర్పినది కనుక, అతడు నీ కంటే శక్తిమంతుడయ్యాడు." అని పలికి, దేవతలు అంతర్ధానమయ్యారు. ఇందుకు మరో ఉదాహరణగా, తననుజూసి అరుస్తున్నదని, అల్ప ప్రాణి అయిన శునకము నోటినిండా బాణాలను సంధించిన ఏకలవ్యుడి కథను కూడా చెప్పుకోవచ్చు.
The story series set up for the Pandavas in the Aranya Parva of the Mahabharata continues to deliver, with sage Romasa narrating tales that convey the significance of each sacred spot that the brothers visit. The next in the sequence is the story of the death and resurrection of sage Yuvakrita. It begins with the friendship of two rishis, Bharadwaja and Raibhya, who make their hermitages in the same forest.
Raibhya has two sons, Ardhavasu and Paravasu, while Bharadwaja has a son by the name of Yuvakrita. Yuvakrita is the troubled one, envious of the adulation that the relatively gregarious Raibhya, and his sons, receive from other brahmans.
In order to acquire the knowledge of the vedas and beyond, Yuvakrita decides not to take the normal, organic route of learning them from his preceptor, but to employ his asceticism and force the gods to grant all the knowledge to him. That said, there is a hint in the text that Yuvakrita’s decision might have been due to his difficulties with learning: he isn’t a particularly intelligent chap. The king of the gods, Indra, is ruffled by the harsh austerities that Yuvakrita performs, and, in the guise of an old brahmin, tries to impart some sense to him. But Yuvakrita is stubborn, and eventually Indra grants him what he desires. When Bharadwaja comes to learn of this, he is agitated.
He considers such a shortcut to knowledge as a betrayal of destiny, and predicts that if Yuvakrita became proud of his achievement, he will be miserably destroyed. One day, Yuvakrita roams into Raibhya’s hermitage and, seeing her alone, rapes Parvasu’s wife. When Raibhya learns of this, he creates two beings: one a woman of beauty, whose task is to lure Yuvakrita; and another a rakshasa, who is tasked with killing him.
Their mission, of course, is successful. Seeing his dead son and knowing his deeds, Bharadwaja’s grief pushes him to take his own life, but that doesn’t happen before he curses Raibhya’s eldest son with killing his own father. One day, after conducting sacrifices for a king, Paravasu returns to the hermitage almost blinded by fatigue and is terrified seeing a black figure in the dense forest: to him its an animal. It is in fact Raibhya, clad in black deerskin, but Paravasu fails to realise that and kills his own father. Thus Bharadwaja’s curse comes to pass.
In order to allow Paravasu to continue the sacrifices, Ardhavasu takes the blame upon him. When the gods are pleased with this act, they allow him to bring back to life his own father, and also Bharadwaja and Yuvakrita. Thus, everything becomes alright again. Only that it doesn’t. The Mahabharata doesn’t offer us any window into the plight of the raped woman, used so blatantly as a narrative device that even her name is not provided. Do the gods un-rape her somehow? Does her trauma also vanish? Or is she banished instead? We don’t know, for our Mahabharata doesn’t care.
ధర్మో రక్షతి రక్షితః
Comments
Post a Comment