ప్రతి హిందువూ తెలుసుకోవలసిన జనవరి 1 చరిత్ర! New Year History
జనవరి 1న ప్రపంచమంతా, కొత్త సంవత్సర వేడుకలను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అయితే, ఈ జనవరి ఒకటి కొత్త సంవత్సరానికి ఆరంభం అనే విషయం వెనుక, చరిత్రతో పాటు, ఎన్నో వివాదాలు కూడా ఉన్నాయనే విషయం, మనలో ఎంతమందికి తెలుసు? ఇప్పుడు మనం వాడుతున్న ఈ Calendar ని ఎవరు కనిపెట్టారు? పూర్వం ఏ నెలలో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేవారు? మన దేశంలో, ఈ ఆంగ్ల Calendar ఎలా అమలులోకి వచ్చింది? అత్యంత పురాతన సంస్కృతి గల మన దేశంలో, జనవరి 1 న కొత్త సంవత్సరాన్ని ఎప్పుటి నుండి జరుపుకుంటున్నారు? అనేటటువంటి విషయాల గురించి, ఈ రోజు తెలుసుకుందాము.. జనవరి ఒకటి నుంచి, కొత్త సంవత్సరం ఆరంభం అవుతుందనీ, ఆ రోజుని New Year గా సంబరాలు జరుపుకోవడం వెనుక, చాలా పెద్ద చరిత్రే ఉందనీ చెప్పాలి. హిందూ, Babylonia, Zoroastrianism, Hebrew, Roman వంటి ప్రాచీన నాగరికతలకు చెందిన ప్రజలు, కొన్ని వేల ఏళ్ల క్రితం, వారి వారి క్యాలెండర్లను రూపొందించుకున్నారు. ఈ Calendars అన్నీ, సూర్యమానం, లేదా చంద్రమానం ఆధారంగా రూపొందినవే. అయితే, నేడు మనం ఉపయోగిస్తున్న ఆంగ్ల Calendar పుట్టుక, Roman Calendar నుంచి వచ్చింది. సామాన్య శక పూర్వం, 7000 సంవత్సరాల ముందు వ...