దృష్టికి పెట్టుకునే రాగి యంత్రాలు Drishti Yantras


దృష్టికి పెట్టుకునే రాగి యంత్రాలు పూజ గదిలో పెట్టుకోవచ్చా?
అసలు రాగి యంత్రాల వల్ల ప్రయోజనం ఉందా? ఇది చదివితే మీకే అర్ధం అవుతుంది..

మనిషి ఉదయం లేచినప్పటి నుంచి, రాత్రి పడుకునేంత వరకు, ఎన్నో పనులు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో, ఇతరులు మనల్ని చూసో, మన ఇంటిని చూసో, ఈర్ష్య చెందుతుంటారు. దాని వల్ల, మనకు తెలియకుండానే దృష్టి ప్రభావం ఇంటిపై పడటం వల్ల, ఆ ఇంట్లోని వారు ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అందువల్ల, ఆ దృష్టి ప్రభావం నుంచి తప్పించుకోవడానికి, ఇంటికి బూడిద గుమ్మడికాయను కట్టడం, ఇంటికి దృష్టి తీయయడం వంటి కొన్ని పరిహారాల గురించి, ధర్మ సందేహాలలో స్పష్టంగా చెప్పబడింది. అయితే, మనలో చాలా మంది, దృష్టి పోడానికి కొన్ని రాగి రేకు యంత్రాలను సైతం తెచ్చుకుని, ఇంటి ముందు కట్టుకుంటారు. కానీ మరికొంతమంది, వాటిని దేవుడి గదిలో కూడా పెట్టుకోవడం చూస్తుంటాము. ఆ రాగి రేకులను పూజ గదిలో పెట్టుకోవచ్చా, లేదా? రాగి రేకుల వల్ల దృష్టి నిజంగా పోతుందా? దృష్టిని తొలగించే యంత్రాలను, దేవుడి గదిలో ఎందుకు పెట్టమని చెబుతున్నారు? వంటి సందేహాలు ఎన్నో, మనలో చాలా మందికి కలగకమానవు. అటువంటి సందేహాలకు సమాధానాలు తెలియయాలంటే, ఈ శీర్షికను పూర్తిగా చదవండి..

ఇంటికి పట్టిన దృష్టి పోవాలంటే, బూడిద గుమ్మడి కాయ, నిమ్మకాయలు, పచ్చిమిర్చి వంటివి గుమ్మలకు కడుతూ ఉంటాము. కొంతమంది, ఎర్ర గుడ్డలో స్పటికా, నవ ధాన్యాలు, పసుపు, కుంకుమ వంటివి కలిపి ముడివేసి, గుమ్మానికి కట్టడం కూడా చూస్తుంటాము. కానీ, వాటితో పాటు చాలా సందర్భాలలో, రాగి యంత్రాలను కూడా ఇంటికి దృష్టి తగలకుండా ఉండటానికి కట్టడం జరుగుతుంటుంది. అయితే, ఇవి సాధారణ రాగి రేకులు మాత్రం కావనీ, వాటిపై కొన్ని మంత్ర బీజాక్షరాలను ఓ క్రమ పద్దతిలో రాస్తారనీ, వాటిలో ఎన్నో రకాలు ఉంటాయనీ, కొన్ని ఇంటికి పట్టిన దృష్టికి సంబంధించినవి ఉంటే, మరికొన్ని శ్రీ చక్రం వంటి శక్తి యంత్రాలు ఉంటాయనీ, పండితులు చెబుతున్నారు.

అంతేకాదు, సాధారణంగా రాగికి negative ఎనర్జీని లాక్కునే గుణం ఉంటుంది. దానికి తోడు, ఈ మంత్రాలు కూడా జత కలిస్తే, అది శక్తి యంత్రంగా పని చేసి, ఆ ఇంటిపై కేవలం దృష్టి దోషాలే కాకుండా, గాలీ, ధూళి వంటి వాటిని కూడా వాలకుండా చూసుకుంటుందని, పండితులు చెబుతున్నారు.

అయితే, మనకి ఎవరైనా పండితులు రాగి యంత్రాలను ఇచ్చి, ఒకటి గుమ్మం దగ్గర, ఇంకొకటి దేవుడి గదిలో పెట్టుకుని పూజించమని చెప్పారంటే, వారు చెప్పిన విధంగా చేయాలని పెద్దల మాట. ఎందుకంటే, గుమ్మంపై కట్టుకునే రాగి యంత్రం, దృష్టి దోషాలు తగలకుండా చేస్తే, పూజ గదిలో పెట్టుకునే యంత్రం, ఇంట్లో దైవ బలం పెంచి, positive energy ని పెంచే విధంగా ఉంటుంది. అంతే కాదు, ఆ యంత్రాలలో గుమ్మంపై కట్టిన దానికి, రోజూ సాంబ్రాణి పొగ కానీ, ఆగరు వత్తుల పొగ కానీ ఖచ్చితంగా వేయాలి. అలాగే, దేవుడి గదిలో పెట్టిన యంత్రానికి, ప్రతి రోజూ నిత్య పూజ చేసుకునే సమయంలో, కాస్త కుంకుమను, ‘శ్రీ మాత్రే నమః’ అనే మంత్రం చదువుకుంటూ వేయాలని, శాస్త్ర వచనం. ఇలా చేయడం వల్ల, అవి శక్తి వంతంగా పని చేస్తాయనీ, ఆ విధంగా చేయకపోతే, కొన్ని రోజులకు వాటిలో ఉండే తేజస్సు తగ్గి, ఫలితాలు ఇవ్వడం మానేస్తాయనీ పండితుల మాట.

సర్వేజనాః సుఖినోభవంతు!

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home