లక్ష్మీ కటాక్షం - Avoid doing these things on bed..
మంచంపై ఈ పనులు చేయకపోతే లక్ష్మీదేవి మీ ఇంటే స్థిరంగా ఉంటుందని మీకు తెలుసా?
గత కొన్నేళ్లుగా జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. ఆధునీకరణ నేపద్యంలో, నగరాలలో నివసించే ప్రజల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. దాంతో, ఒకప్పుడు విశాలంగా ఉండే ఇళ్ళు కాస్తా, ఇరుకు గదులుగా తయారవుతున్నాయి. అందువల్ల, నేడు చాలా మంది నేర్చుకుంటున్న కొత్త అలవాటు, మంచాలను ఎక్కవగా వాడటం. అవసరం ఉన్నా లేకపోయినా, మనలో చాలా మంది, మాట్లాడితే మంచంపైనే ఎన్నో పనులు చేస్తున్నారు. అయితే, కొన్ని పనులు మాత్రం, మంచంపైన అస్సలు చేయకూడదనీ, అలా చేస్తే, అష్ట కష్టాలనూ కోరి తెచ్చుకున్నట్లవుతుందనీ, పండితులు చెబుతున్నారు. అసలు మంచంపైన ఏ పనులు చేయవచ్చు? ఏ పనులు చేయకూడదనే విషయంపై, మనలో చాలా మందికి అవగాహన ఉండదు. అందువల్ల, శాస్త్రానుసారం, మంచం పై చేయాల్సిన, చేయకూడని పనుల గురించి, తెలుసుకుందాము.
ఈ మధ్య కాలంలో గదులు చిన్నగా ఉండటం వల్లనో, బెడ్ రూమ్ లోనే టీవీ ఉందనో, మంచం మీద బాగా కంఫర్ట్ గా ఉందనో, చాలా మంది, ఉదయం టిఫిన్ నుంచి, రాత్రి భోజనం వరకు, మంచాలపైనే కుర్చుని తింటున్నారు. ఆ విధంగా అస్సలు చేయకూడదని, పండితులు చెబుతున్నారు. మంచంపై కుర్చుని తినడం వల్ల, రోగాల భారిన పడే అవకాశం ఎక్కువని, ఆధునిక విజ్ఞానం కూడా చెబుతోంది.
కొంతమంది పిల్లలు మంచాలపై కుర్చుని చదువుకోవడం, మంచాలపైనే హోం వర్క్ రాసుకోవడం వంటివి చేస్తుంటారు. ఆ విధంగా చేయడం వల్ల, సర్వస్వతీ మాతను అవమానించినట్లేననీ, దాంతో పిల్లల విద్య దెబ్బతిని, భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందని శాస్త్ర వచనం.
ఇక కొంతమంది ఆడవాళ్ళయితే, మంచాలపైనే కుర్చుని, వంటకు సంబంధించిన కూరగాయలు తరుక్కోవడం, ఇతర ఇంటి పనులు చేసుకోవడం వంటివి చేస్తుంటారు. ఇదిలా ఉంటే, కొంతమంది ఇళ్లలోని వారు, బయటి నుంచి వచ్చి, కాళ్ళు కూడా కడుక్కోకండా, నేరుగా మంచంపై పడిపోతారు. ఇలా చేయడం వల్ల, లక్ష్మీమాత ఆ ఇంటిని వెంటనే వదిలి వెళ్ళిపోతుందనీ, దాంతో వారు అటు ఆరోగ్యపరంగానూ, ఇటు ఆర్ధికంగానూ ఇన్నో ఇబ్బందులకు గురవుతారని, పండితులు చెబుతున్నారు.
అసలు మన శాస్త్రాలు చెప్పిన దాని ప్రకారం, మంచంపై, రాత్రి వేళలో పడుకోవడం తప్ప, మరో పని చేయకూడదనీ, మంచంపై వేసిన పక్కను కూడా, ప్రతి రెండు రోజులకోసారి తీసి, శుభ్రం చేసుకోవాలనీ, ఉదయం లేచిన వెంటనే మంచంపై ఉన్న పక్కను సక్రమంగా వేసుకోవాలనీ నిపుణులూ, పండితులు చెబుతున్నారు. ఈ విధంగా చేయడం వల్ల, ఆ ఇంట లక్ష్మి దేవి తిష్ట వేసుకుని కుర్చుంటుందని, శాస్త్ర వచనం.
సర్వేజనాః సుఖినోభవంతు!
Comments
Post a Comment