భూత-భవిష్యత్-వర్తమానాలు! Bhagavadgita భగవద్గీత

 

భూత-భవిష్యత్-వర్తమానాలు! భగవానుడి విశ్వరూపంలో అర్జునుడు ఏం చూశాడు?

'భగవద్గీత' ఏకాదశోధ్యాయం – విశ్వరూప దర్శన యోగం (26 – 30 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదకొండవ అధ్యాయం, విశ్వరూప దర్శన యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విశ్వరూప దర్శన యోగములోని 26 నుండి 30 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/JQCy-zl-l0M ]


00:41 - అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః
సర్వే సహైవావనిపాలసంఘైః।
భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ
సహాస్మదీయైరపి యోధముఖ్యైః ।। 26 ।।

00:54 - వక్త్రాణి తే త్వరమాణా విశంతి
దంష్ట్రాకరాళాని భయానకాని ।
కేచిద్విలగ్నా దశనాంతరేషు
సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః ।। 27 ।।

ధృతరాష్ట్రుడి కుమారులందరూ, వారి సహచర రాజులతో సహా, భీష్ముడూ, ద్రోణాచార్యుడూ, కర్ణుడూ, ఇంకా మన పక్షమున ఉన్న యోధులు కూడా తలక్రిందులుగా, నీ భయంకరమైన నోళ్లలోనికి త్వరితగతిన ప్రవేశిస్తున్నారు. కొందరి తలలు నీ భీకరమైన పళ్ళ మధ్యలో చితికిపోయినట్టు, నేను చూస్తున్నాను.

గొప్ప గొప్ప కౌరవ యోధులు - భీష్ముడూ, ద్రోణాచార్యుడు, మరియు కర్ణుడు, వీరితో పాటు మరెందరో పాండవ పక్ష యోధులు కూడా, భగవంతుని నోటిలోనికి తలక్రింద్రులుగా, త్వరగా, వేగగతిన పోయి, ఆయన పళ్ళ మధ్య నలిగి పోవటం, అర్జునుడు గమనిస్తాడు. అతి త్వరలో జరగబోయే పరిణామాలను, ఆ భగవంతుని యొక్క విశ్వ రూపములో దర్శిస్తున్నాడు. భగవంతుడు కాల పరిమితికి అతీతుడు కాబట్టి, భూత-వర్తమాన-భవిష్యత్తులన్నీ, ఆయన యందు ఇప్పుడే కనిపిస్తున్నాయి.

01:59 - యథా నదీనాం బహవోఽమ్బువేగాః
సముద్రమేవాభిముఖా ద్రవంతి ।
తథా తవామీ నరలోకవీరా
విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి ।। 28 ।।

02:11 - యథా ప్రదీప్తం జ్వలనం పతంగా
విశంతి నాశాయ సమృద్ధవేగాః।
తథైవ నాశాయ విశంతి లోకాః
తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః ।। 29 ।।

ఎన్నో నదుల నీటి తరంగాలు సముద్రములోనికి పారుతూ వచ్చి కలిసి పోయినట్లు, ఈ గొప్ప గొప్ప యోధులు అందరూ, నీ ప్రజ్వలించే ముఖములలోనికి ప్రవేశిస్తున్నారు. అగ్గిపురుగులు ఎలాగైతే అత్యంత వేగముతో వచ్చి, మంటలో పడి నాశనం అయిపొతాయో, ఈ యొక్క సైన్యములు కూడా, నీ నోర్లలోనికి ప్రవేశిస్తున్నారు.

యుద్ధ రంగంలో ఏంతో మంది ఉత్తమ రాజులూ, మరియు యోధులూ ఉన్నారు. వారందరూ అది తమ కర్తవ్యముగా పరిగణించి, యుద్ధంలో పోరాడారు, మరియు యుద్ధరంగంలో తమ ప్రాణములను విడిచి పెట్టారు. అర్జునుడు వారిని, నదులు తమకు తామే వచ్చి సముద్రములో కలిసిపోవటంతో పోల్చుతున్నాడు. ఇంకా చాలామంది ఇతరులు, స్వార్ధం కోసం, మరియు దురాశతో యుద్ధ రంగానికి వచ్చారు. అర్జునుడు వారిని, అమాయకత్వంతో ఎర చూపబడి, అగ్నిలో పడి కాలిపోయే పురుగులతో పోల్చుతున్నాడు. ఈ రెంటిలో కూడా, ఆసన్నమైన మృత్యువు వైపు, వారు వడివడిగా పరుగులు పెడుతున్నారు.

03:24 - లేలిహ్యసే గ్రసమానః సమంతాత్
లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః ।
తేజోభిరాపూర్య జగత్సమగ్రం
భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో ।। 30 ।।

నీ యొక్క భయంకరమైన నాలుకలతో, ఎన్నెన్నో ప్రాణులను అన్ని దిక్కులా చప్పరించిపారేస్తూ, నీ యొక్క ప్రజ్వలిత నోళ్ళతో, వారిని గ్రహించి వేయుచున్నావు. హే విష్ణో! నీవు సమస్త జగత్తునూ, నీ యొక్క భయంకరమైన, సర్వ వ్యాప్తమైన తేజో కిరణాలతో తపింపచేయుచున్నావు.

భగవంతుడు సమస్త జగత్తునూ, మహా శక్తులైన సృష్టి, స్థితి, మరియు లయములచే నియంత్రిస్తూ ఉంటాడు. అన్ని దిక్కులా తన మిత్రులూ, శ్రేయోభిలాషులందరినీ గ్రహిస్తూ ఉన్న సర్వ భక్షక శక్తిగా, ఇప్పుడు అర్జునుడికి అగుపిస్తున్నాడు. ఆ యొక్క విశ్వ రూపములో, భవిష్యత్తులో జరిగే సంఘటనల దివ్య దర్శనంలో, ప్రారంభం కానున్న యుద్ధములో, తన శత్రువులు నిర్మూలించబడటం, అర్జునుడు చూస్తున్నాడు. ఏంతో మంది తమ పక్షం వారు కూడా, మృతువు పట్టులో ఉండటం గమనించాడు. తను చూసే అద్భుతమైన స్వరూపం వల్ల, భయంతో బిగిసిపోయాడు అర్జునుడు.

04:35 - ఇక మన తదుపరి వీడియోలో, శ్రీ కృష్ణుడి విశ్వరూప దర్శనాన్ని చూసి, అర్జునుడు ఏ విధంగా ప్రణమిల్లుతున్నాడో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home