దీపారాధన ఇలా చేయకపోతే ఇంట్లో దరిద్రం తాండవించడం ఖాయం! Deeparadhana Process
దీపారాధన ఎలా చేయాలి? Deeparadhana or Lighting Lamps or Diyas Importance in Telugu
మన సనాతన హైందవ ధర్మంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉన్న విషయం మనకు తెలుసు. అయితే, మనలో చాలా మందికి దీపారాధన ఎలా చేయాలి? ఏ ఏ సమయాల్లో ఇవ్వాలి? దీపపు కుందిలో ఎన్ని ఒత్తులు వేయాలి? దీపాన్ని ఏ దిక్కున వెలిగించాలి? ఎటువంటి కుందులలో దీపారాధన చేయాలి? దీపారాధనకు ఏ నూనెను వాడాలి? దీపం వెలిగించినప్పుడు ఏ మంత్రం చదవాలి - అని ఎన్నో సందేహాలు ఉంటాయి. మరి ఆ సందేహాలన్నింటికీ సమాధానం తెలియాలంటే, ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి.
దీపారాధన చేసే ముందు, దేవుడి దగ్గర ఉంచిన దీపారాధన కుందులనూ, ఇతర పాత్రలను కూడా శుభ్రం చేసుకోవాలి. ముందు రోజు దేవుడి దగ్గర పెట్టిన మలినాలన్నీ తీసేయాలి. దేవుడి దగ్గర ఉంచే దీపపు కుందులు, ఇత్తడి తో కానీ, పంచ లోహాలతో కానీ, వెండితో కానీ చేసినవే వాడాలి తప్ప, స్టీలు వంటి మరే ఇతర లోహాలూ వాడకూడదు. ఇవి కొనే స్థోమత లేని వారు, మట్టితో చేసిన దీపపు కుందులను వాడవచ్చు.
ఇక దీపారాధనకు వాడే తైలాలలో ముఖ్యంగా, మంచి మేలు రకమైన నువ్వుల నూనెను కానీ, ఆవు నెయ్యినీ, లేదా కల్తీ లేని కొబ్బరి నూనెనూ ఉపయోగించాలి. నేడు మార్కెట్ లో దీపరాధన తైలం అని అమ్మే నూనెలు అస్సలు వాడకూడదని, నిపుణులు చెబుతున్నారు.
ఇక దీపారాధన చేసేటప్పుడు, కుందిలో ఎప్పుడూ రెండు వొత్తులను కలిపి ఒక వొత్తిగా చేసుకుని, దీపం వెలిగించాలి. చాలా మంది తెలియక, ఒక ఒత్తిని మాత్రమే వేయడమో, లేక రెండు వేరు వేరు ఒత్తులు వెలిగించడమో చేస్తుంటారు. ఆ విధంగా అస్సలు చేయకూడదు.
ఇక దీపం వెలిగించినప్పుడు, ఆ దీపం దేవుడి వైపు మాత్రమే ఉండాలి. దీపం క్రింద ఎప్పుడూ ఒక చిన్న పళ్ళెం, లేదా కనీసం ఒక తమలపాకునైనా పెట్టాలి. దీపం నేరుగా ఎట్టి పరిస్థితులలోనూ, నేలపై పెట్టకూడదు. ఇక దీపారాధనను ప్రతి రోజూ రెండు సార్లు చేస్తే చాలా మంచిది. ఉదయం వీలైనంత త్వరగా దీపం వెలిగించాలనీ, కనీసం 9 గంటల లోపు వెలిగించాలని, పెద్దలు చెబుతున్నారు. ఇక సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత కూడా దీపరాధన చేస్తే, చాలా మంచిది. అయితే, సాయంత్రం దీపరాధన చేయడం కుదరని వారు, కనీసం ఉదయం అయినా ఖచ్చితంగా చేసుకోవాలి.
ఇక ఉదయం దీపారాధన చేసే సమయంలో..
దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వ తమోపహం ।
దీపేన సాధ్యతే సర్వం దీప లక్ష్మీ ర్నమోస్తుతే ।।
ఈ మంత్రం జపిస్తే, దీపం పెట్టిన పూర్తి ఫలితం లభిస్తుందని, శాస్త్రం చెబుతోంది.
అలాగే, సాయంత్రం వేళ దీపరాధన చేసే వారు..
దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వ తమోపహం ।
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే ।।
అనే మంత్రాన్ని జపించాలి.
సర్వేజనాః సుఖినోభవంతు!
Comments
Post a Comment