దేవుడి పటాల వెనుక బల్లి తిరుగుతుంటే ఏం జరుగుతుంది? Lizard Shastra

 

దేవుడి పటాల వెనుక బల్లి తిరుగుతుంటే ఏం జరుగుతుంది?

భగవంతుడు ఈ భూమిపై తిరిగే ప్రతి జీవికీ ఓ శక్తిని ఇచ్చాడని, శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే మనం ప్రతి జీవినీ గౌరవించాలనీ, ప్రతి జీవికీ మేలు జరిగే పనులు చేయాలనీ, మన ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే, మన చుట్టూ ఉండే జీవులలో కొన్ని మాత్రం కాస్త ప్రత్యేకమైనవిగా పండితులు చెబుతున్నారు. అటువంటి జీవులలో, బల్లి ఒకటి. మన ఇళ్ళలో ఎక్కువగా కనిపించే ఈ బల్లుల విషయంలో, మనకు ఎన్నో భయాలూ, అనుమానాలూ ఉంటాయి. అటువంటి అనుమానాలలో, ఇంట్లో ఉన్న దేవుడి మందిరంలోకీ, దేవుడి పటాల మధ్యకీ బల్లులు రావచ్చా? అనేది ఒకటి. ఒకవేళ దేవుడి పటాల మధ్యలోకి బల్లులు వస్తే, మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? అని ఎంతో మంది సందేహపడుతుంటారు. ఆ విషయాలు స్పష్టంగా తెలుసుకోడానికి, ఈ శీర్షికను పూర్తిగా చదవండి.

మన హైందవ ధర్మం ప్రకారం, బల్లికి కొన్ని శక్తులు ఉన్నాయనీ, దాని ప్రకారం అవి మనిషి జీవితంలో జరగబోయే విషయాలను ముందుగానే తెలియచేస్తాయనీ, ఎంతో స్పష్టంగా చెప్పబడి ఉంది. అందుకోసం మన ధర్మంలో, ఈ సృష్టిలో మరే ప్రాణికీ లేని విధంగా, ఏకంగా బల్లి శాస్త్రం అని ఓ శాస్త్రమే ఉంది.

అటువంటి బల్లిని మనం చూడగానే, భయంతో వాటిని ఇంటి నుంచి దూరంగా తరిమేయడానికి ప్రయత్నిస్తాం. ఈ క్రమంలో, ఒక్కోసారి వాటి ప్రాణాలు కూడా తీసేస్తాం. ఆ విధంగా అస్సలు చేయకూడదని, పెద్దలు చెబుతున్నారు. బల్లులు ఇంట్లో ఎక్కువగా ఉంటే చూడటానికి బాగోదు కాబట్టి, వాటిని దూరంగా ఉంచడానికి తగు చిట్కాలు పాటించ వచ్చు కానీ, వాటిని చంపితే అష్ట కష్టాలూ పడతారని, పండితులు చెబుతున్నారు.

ఇక ఆ బల్లులు దేవుడి పటాల మధ్యలోకి వచ్చాయి అంటే, అవి మీ ఇంటిలోకి Negative Energy రాబోతుందని చెబుతున్నాయని అర్ధం చేసుకోవాలని పండితుల మాట. ఏ ఇంట్లో అయితే పూజలు సరిగ్గా జరగవో, ఆ ఇంట్లోని దేవుడి గదిలోకీ, పటాల మధ్యలోకీ బల్లులు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అలా వచ్చాయంటే, ఆ ఇంట్లో దైవ ప్రార్ధన లేనందు వల్ల, Negative energy రాబోతోందని అవి సూచిస్తున్నాయనీ, బల్లులు దేవుడి పటాల వెనుకకు రావడంతో, జరగబోయే విషయం తెలుస్తుంది కనుక, అది మనకు మంచే అనీ పండితులు చెబుతున్నారు.

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess