గడప విషయంలో ఇవి పాటిస్తే, అదృష్టం మీ వెంటే ఉంటుంది! Main Door Gadapa


గడప విషయంలో ఇవి పాటిస్తే, అదృష్టం మీ వెంటే ఉంటుంది!

ఇల్లే సకల సౌఖ్యలనూ, అష్టైశ్వర్యాలనూ, ఆయురారోగ్యాలనూ ప్రసాదించే దివ్యమైన ప్రదేశమని మన పెద్దలు చెబుతుంటారు. అందువల్ల, ఇంట్లో మనం చేసే పనులే, మన జీవితాన్ని నిర్ణయిస్తాయని, శాస్త్ర వచనం. అందులోనూ, ఇంటి నుంచి బయటి శక్తులను దూరంగా ఉంచి, మనల్ని ఎల్ల వేళలా కాపాడే గడపకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన ధర్మం ప్రకారం, గడపను సాక్ష్యత్తు లక్ష్మీ స్వరూపంగా చూస్తాము. అదువల్ల, ఆ గడప దగ్గర చేయాల్సిన, చేయకూడని పనులు కొన్ని ఉన్నాయనీ, వాటిని తెలుసుకుంటే, ఆ లక్ష్మీ మాత అనుగ్రహం మన వెంటే ఉంటుందనీ, పండితుల మాట.

మన పురాణాలలో, వేదాలలో, శాస్త్రాలలో, గడపకు ఎంతో విశేషమైన స్థానం కల్పించబడింది. అందువల్ల, గడప విషయంలో కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించి తీరాలని కూడా, చెప్పబడి ఉంది. ఆ విధంగా చెప్పిన వాటిలో, గడప దగ్గర పాల ప్యాకెట్లను పెట్టం. మనలో చాలా మంది, పాల ప్యాకెట్లను వేయించుకుంటూ ఉంటాము. ఆ పాల ప్యాకెట్లు డెలివర్ చేసేవారు, వాటిని గడపపై కానీ, గడప ముందు నేలపై కానీ పెట్టి వెళ్లిపోతారు. ఆ విధంగా అస్సలు చేయకూడదు. ఇక్కడ పాలు కూడా లక్ష్మీ సమానం కాబట్టి, వాటిని కింద పెడితే మంచిది కాదు. అలాగే, గడపపై ఎటువంటి బరువూ పెట్టకూడదని, శాస్త్రం చెబుతోంది. అందువల్ల, గుమ్మం పక్కగా గానీ, డోర్ హ్యాండిల్ కి కానీ ఒక కవర్ నీ, లేదా బుట్టను పెట్టి, అందులో వేయించుకోవాలి.

ఇక ప్రతి రోజూ, వచ్చిన పాలలో మొట్ట మొదట ఓ చెంచాడు పాలు పక్కన పెట్టి, ఆ పాలను గడపపై రెండు ములలా, ఒక్కో చుక్క చొప్పున వేసి దణ్ణం పెట్టుకోవడం వల్ల, లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఇక ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు, గడపకు దణ్ణం పెట్టి, ముందుగా కుడి కాలు బయటపెట్టి వెళ్ళడం ద్వారా, వెళ్ళిన పని ఎటువంటి ఆటంకం లేకుండా జరిగుతుంది. ఇక పండుగలకీ, పబ్బాలకీ, గుమ్మానికి మామిడి తోరణాలు కడుతూ ఉంటాము. అలా కట్టిన తోరణాలను, నెలలతరబడీ వాటికే ఉంచేయకుండా, మూడవ రోజు కానీ, ఐదవ రోజుగానీ, ఇంట్లోని మగవారు తీసి పడవేయలి. లేకపోతే, ఇంట్లోకి లక్ష్మీకి బదులు, అలక్ష్మి వచ్చే ప్రమాదం ఉంది.

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home