కాకులు ఇంటిపై తిరిగినా ఈ విధంగా అరిచినా ఏం జరుగుతుందో మీకు తెలుసా? Significance of Crows
కాకులు ఇంటిపై తిరిగినా, ఈ విధంగా అరిచినా ఏం జరుగుతుందో మీకు తెలుసా?..
ఈ సృష్టిలో ఉన్న కొన్ని జీవులకు, మన భవిష్యత్తును చెప్పే శక్తి ఉందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే, అది మూఢ నమ్మకం అని కొంతమంది హేతువాదులు కొట్టి పారేస్తారు. కానీ ఆ జీవులు ఇచ్చే సూచనలు నిజంగా జరిగినట్లు ఎన్నో ఆధారాలున్నాయని పెద్దలు చెబుతారు. అటువంటి శక్తివంతమైన జీవులలో, కాకులు కూడా ఒకటనీ, జగరబోయే మంచినీ, చెడునూ ముందే చెప్పే శక్తి ఉన్న కాకులు, మన ఇంట్లో ఆ దిక్కున చేరి అరిస్తే జరిగే అనర్ధం, వెన్నులో వణుకు పుట్టిస్తుందనీ, ఆ సంకేతాన్ని గుర్తించి మనం తగు జాగ్రత్తలు తీసుకోకపోతే జరిగే నష్టం మాటల్లో చెప్పలేమనీ పండితులు చెబుతున్నారు. కాకి ఏ దిక్కున కూర్చుని అస్సలు అరవకూడదు? అలా అరిస్తే ఏం జరుగుతుంది? వంటి సందేహాలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాము.
ఈ ప్రకృతిలోని జీవులలో కాకి ఓ శక్తివంతమైన జీవి అని పెద్దలు చెబుతున్నారు. అంతేకాదు, అది శని భగవానుడి వాహనం అనీ, అవి యమ దూతల ప్రతిరూపాలని కూడా చెబుతుంటారు. అందుకే వాటిని చూడగానే మనలో చాలా మందికి ఓ రకమైన భీతి కలుగుతుంది. అంతేకాదు, అవి మన ఇంటి గోడమీద చేరి పదే పదే అరుస్తూ ఉంటే, కాస్త భయం కూడా వేస్తుంది. అందుకే కాకులు ఇచ్చే సూచనలను గుర్తించడానికి శాస్త్రం కూడా మన పూర్వీకులు ఏనాడో రాసి ఉంచారు.
ఆ శాస్త్రం ప్రకారం కాకులు మనకు జరిగబోయే మంచి చెడులను ముందుగానే తెలియ చేస్తాయి. కాకి మన ఇంట్లోని వాయవ్యం మూలకు వచ్చి పదే పదే అరుస్తుందంటే, ఆ రోజు లేదా ఆ మర్నాడు, మన ఇంటికి దూరపు చుట్టాలు ఎవరో రాబోతున్నారనీ, అందువల్ల ఇంట్లో ఖర్చులు పేరగబోతున్నాయనీ చెబుతోందని శాస్త్ర వచనం.
అయితే, కాకి ఆగ్నేయం మూల నుంచి అరిచిందంటే, ఆ ఇంట ఓ ప్రాణం పోయే అవకాశం ఉందనీ, అంతేకాక, మూడు కాకులు పదే పదే పెద్దగా అరుస్తూ, ఆ ఇంటిపై కొన్ని రోజుల పాటు వలయాకారంలో ఎగురుతూ ఉన్నాయంటే, ఆ ఇంట కనీసం రెండు మూడు శవాలు లేస్తాయనే విషయాన్ని మనకు ముందుగానే అవి తెలియచేస్తున్నట్లని, శాస్త్రం చెబుతోంది. అందువల్ల, ఎప్పుడైనా కాకులు ఈ విధంగా అరిచాయి అంటే, వెంటనే దగ్గరలో ఉన్న వేద పండితుల దగ్గరకు వెళ్ళి విషయం చెబితే, వారు తగిన పరిహారాలు చేయించి, రాబోయే గండం నుంచి గట్టెక్కిస్తారని, పండితులు చెబుతున్నారు. అందుకే కాకి అరుపులను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదని ఆర్యోక్తి.
Comments
Post a Comment