శివరాత్రి నాడు అభిషేకం చేస్తూ ఏ మంత్రాన్ని జపిస్తే మంచిది? Abhisheka Mantra


శివరాత్రి నాడు అభిషేకం చేస్తూ ఏ మంత్రాన్ని జపిస్తే మంచిది?

ఆ పరమేశ్వరుడు అభిషేక ప్రియుడని, శాస్త్ర వచనం. అంతేకాదు, ఆ శివయ్యకు.. పాలు, నీళ్ళు, పంచదార, పంచామృతాలు, ఇలా ఒక్కో రకమైన ద్రవ్యంతో అభిషేకం చేస్తే, ఒక్కో విధమైన ఫలితం ఇస్తాడాని, వేదాలు చెబుతున్నాయి. అందులోనూ, మహా శివరాత్రి లాంటి పర్వదినంలో, పరమేశ్వరుడికి చేసే అభిషేకాలు, మరింత పుణ్యం చేకూరుస్తుందని, శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల, రాబోయే శివరాత్రి నాడు, భక్తకోటి మొత్తం, స్వయంగా శివ లింగానికి అభిషేకం చేయాలని, ఆశిస్తారు. అయితే, ఇలా అభిషేకం చేసే సమయంలో, ఏ విధమైన మంత్రాలు చదవాలి? ఏ మంత్రాలు చదివితే స్వామిని ప్రసన్నం చేసుకోగలం? అనే సందేహాలు, మనలో చాలా మందికి ఉంటాయి. మరి ఆ సందేహాలకు సమాధానాలు చూడండి.

భక్తితో, త్రికరణ శుద్ధిగా పోసే చెంబెడు నీళ్ళు చాలు, ఆ భోళా శంకరుడి కరుణకు పాత్రులవ్వడానికని, పెద్దలు చెబుతూ ఉంటారు. అభిషేక ప్రియుడిగా పేరు తెచ్చుకున్న ఆ పరమేశ్వరుడికి, ఎన్ని పూజలు చేసినా, కాసిన్ని నీళ్ళతో కానీ, ఆవు పాలతో కానీ అభిషేకం చేస్తే, మన బాధలన్నీ దూరం చేసేస్తాడు. అందుకే, ఆ స్వామికి ప్రపంచ వ్యాప్తంగా, ప్రతి రోజు అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. అందులోనూ, శివరాత్రి నాడు స్వామికి అభిషేకం చేయడం ద్వారా, మరింత ఉత్తమమైన ఫలితం పొందవచ్చని, శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే, అలా చేసేటప్పుడు, ఏ మంత్రం చదవాలనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది.

సాధారణంగా, ఆలయాలలో కానీ, వేదం చదినవారు కానీ, గురు ముఖతా మంత్రం నేర్చుకున్నవారు కానీ, శివ లింగానికి అభిషేకం చేసేటప్పుడు.. నమకం, చమకం, రుద్రం వంటివి ఎక్కువుగా చదువుతూ ఉంటారు. అయితే, వీటిని చదవడానికి కొన్ని నియమాలు ఉండటం వలన, పైన చెప్పిన విధంగా నేర్చుకున్నవారు తప్ప, తక్కినవారు ఆ మంత్రాలను చదవకూడదు. ఇలా వేద విరచితమైన నమక, చమకాలను చదవలేనివారు,

మహాదేవ మహాదేవ మహాదేవ దయానిధే 
భవానేవ భవానేవ భవానేవ గతిర్మమ ।।

అనే మహా దేవ శ్లోకాన్ని పఠించడం ఉత్తమమని, పండితులు చెబుతున్నారు. అది గుర్తులేని వారు, “ఓం నమః శివాయ” అనే శివ పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ శివ లింగానికి అభిషేకం చేయవచ్చు.

ఓం నమః శివాయ!

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home