పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home


పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? వారికి రోజూ నైవేద్యం పెట్టాలా?

పుట్టిన వాడు మరణించక తప్పదు, మరణించినవాడు మరల జన్మించిక తప్పదని, భగవద్గీతలో గీతాచార్యుడు ఎంతో స్పష్టంగా చెప్పాడు. జనన మరణాల మధ్య జరిగే జగన్నాటకంలో, మనమంతా కేవలం పాత్రధారులము మాత్రమే అని పెద్దలంటూ ఉంటారు. ఇది నాటకమో, జీవితమో చెప్పడం కష్టంకానీ, పోయిన వాళ్ళను తలుచుకుంటూ, బ్రతికున్న రక్త సంబంధీకులూ, ఆత్మీయులూ, తక్కిన జీవితం గడిపేస్తూ ఉంటారు. ఈ క్రమంలో, పోయిన వారి గుర్తుగా ఫోటోలను కూడా ఇంట్లో ప్రత్యేకంగా పెట్టుకుంటారు. అయితే, ఈ ఫోటోలకు రోజూ నైవేద్యం పెట్టవచ్చా? వారి ఫోటోలను దేవుడి మందిరంలోనే పెట్టుకుని పూజించవచ్చా? అసలు పోయిన వారి ఫోటోలను, ఏ దిక్కున పెట్టుకోవాలి? వంటి సందేహాలేన్నో మనలో చాలా మందికి కలుగుతుంటాయి.

మనిషి జీవితంలో చేసే ప్రతి పనిలో పాటించాల్సిన కొన్ని నియమాలను, మన హైందవ ధర్మంలో ఎంతో స్పష్టంగా చెప్పబడి ఉంది. అందులోనూ, జనన మరణాల విషయంలో, ఈ నియమాలు ఎంతో కఠినంగా, ఎంతో స్పష్టంగా ఉన్నాయి. ఆ నియమాలను పాటించడంలో, ఏ చిన్న పొరపాటు జరిగినా, ఆ తర్వాత సంభవించే పరిణామాలు, ఎంతో దారుణంగా ఉంటాయని, పెద్దలు చెబుతున్నారు.

మరీ ముఖ్యంగా, చనిపోయిన వారి విషయంలో పాటించాల్సిన ఏ చిన్న నియమాన్నీ ఉల్లంఘించకూడదు. అటువంటి నియమాలలో, చనిపోయిన వారి ఫోటోల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా ఉన్నాయి. చాలా మంది, ఇంట్లో చనిపోయిన పెద్దల ఫోటోలను, ఎక్కడపడితే అక్కడ పెడుతూ ఉంటారు. మరి కొంతమంది, ఏకంగా దేవుడి గదిలోనో, దేవుడి పటాల ప్రక్కనో పెట్టి, భగవంతుడికి నిత్య పూజ చేసినప్పుడు, చనిపోయినవారికి కూడా ప్రసాదాలను నివేదించడం, మంగళ హారతులు ఇవ్వడం వంటివి చేస్తారు. ఆ విధంగా చేస్తే, ఆ ఇంట్లోని వారు దైవానుగ్రహాన్ని పూర్తిగా కోల్పోయి, ఎన్నో ఇబ్బందులు పడే అవకాశం ఉందని, శాస్త్ర వచనం.

అసలు చనిపోయిన పెద్దల ఫోటోలు, కేవలం దక్షణం దిక్కున తప్ప, మరెక్కడా పెట్టకూడదు. దక్షిణం దిక్కున మరణించిన వారి ఫోటోలు తప్ప, దేవుడి ఫోటోలూ, బ్రతికున్న వారి ఫోటోలూ పెట్టకూడదని, శాస్త్ర వచనం. ఇక గతించిన వారికి నైవేద్యం కూడా, ప్రతి రోజూ పెట్టకూడదు. కేవలం వారి జయంతి, వర్ధంతి రోజులలో మాత్రమే, బ్రతికి ఉన్నప్పుడు వారు ఇష్టంగా తిన్న రెండు మూడు వంటలు పెట్టాలి. అంతేకాదు, ఆ రోజు.. పోయినవారి పేరు చెప్పి, వస్త్ర దానం, అన్న దానం లాంటివి కూడా చేస్తే మంచిది.

సర్వేజనాః సుఖినోభవంతు!

Where to hang dead person photo as per Vastu!

You can place the pictures of our late family members in the south direction facing towards the north direction. You can also place the photos in the southwest direction. You should not keep them in the east, west, or north direction. This is all on the dead person photo direction.

Important Vastu Tips Regarding the Photos of Dead Person:

1. The ancestor photo as per Vastu should not be kept in any place in the middle of the home.
2. The photos should not be placed at any place from where they can be seen directly while leaving or entering the house.
3. You should not place photos of a dead person in your bedroom or at multiple places in your house. 
4. You should not place photos of any dead person outside of your family.

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess