హనుమద్విజయోత్సవం Hanumath Vijayotsavam
అందరికీ హనుమద్విజయోత్సవ శుభాకాంక్షలు 💐
ఆంజనేయ స్వామి అద్భుత చరిత్ర!: https://youtu.be/6wOkEw-wpsw
హనుమంతుడు భీముడికి చెప్పిన యుగ ధర్మాలు!: https://youtu.be/5Qbjiqk3f9I
ఆవేశంలో ఉన్న హనుమకు సీతమ్మ చెప్పిన కథ!: https://youtu.be/YK8QjVW2kc0
అర్జునుడి రథంపై హనుమంతుడు ఉండడానికి గల కారణం!: https://youtu.be/F3pdXaWX7ps
మనోజవం మారుత తుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం ।
వాతాత్మజం వానరయూధ ముఖ్యం
శ్రీరామదూతం శిరసా సమామి ।।
చైత్రపౌర్ణమి హనుమాన్ జయంతి కాదు విజయోత్సవమే..
హనుమంతుని సహాయంతో సీత జాడను వెతకడం, రావణుడిపై యుద్ధానికి రామసేతు వారధిని నిర్మించడం, లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు పర్వతంతోసహా సంజీవిని తీసుకొచ్చి ప్రాణాపాయం నుంచి తప్పించడం, ఇలా రాముడు ఎదురైన క్షణం నుంచీ, తిరిగి అయోధ్య చేరుకునే వరకూ, శ్రీరామ విజయం వెనుక అడుగడుగునా హనుమంతుడు ఉన్నాడు. అయోధ్యకు చేరుకుని, పట్టాభిషేక ఘట్టం ముగిసిన తర్వాత, రాముడు ఇలా అనుకున్నాడు.. "హనుమంతుని అమోఘమైన సేవల కారణంగానే సీతాదేవి తిరిగి వచ్చింది.. తిరిగి అయోధ్యా నగరంలో పట్టాభిషిక్తుడిని అయ్యాను.. ఈ రోజు ప్రజలు అత్యంత ఆనందంగా ఉన్నారంటే, ఈ విజయం, ఆనందం, అన్నీ హనుమంతుడి వల్లనే" అని..
ఆంజనేయుడిని ప్రేమగా ఆలింగనం చేసుకుని, కృతజ్ఞతలు తెలియజేశాడు రాముడు. ఈ సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ, ప్రజలు అప్పటి నుంచీ, శ్రీరామనవమి, శ్రీరామ పట్టాభిషేకం తర్వాత వచ్చే పూర్ణిమను, హనుమత్ విజయోత్సవంగా భావించి, వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది..
''కలౌ కపి వినాయకౌ'' అంటే కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతా రూపాలు వినాయకుడు, హనుమంతుడు..
"యత్ర యత్ర రఘునాధ కీర్తనం - తత్ర తత్ర కృతమస్తకాంజిలమ్, బాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షసాంతకమ్" అంటే, శ్రీరాముని కీర్తన ఎక్కడ జరిగితే, అక్కడ హనుమంతుడు పులకించిపోతూ, అంజలి జోడించి ప్రత్యక్షమైపోతాడు. రాక్షసాంతకుడైన అటువంటి హనుమంతునికి నమస్కరిస్తున్నానని అర్థం.
#HanumanJayanti #2023 #mplanetleaf #voiceofmaheedhar #HanumanVijayotsavam
Comments
Post a Comment