హనుమత్ విజయోత్సవ దినం 2024 Hanuman Jayanti
అందరికీ హనుమత్ విజయోత్సవ శుభాకాంక్షలు 🚩 జై శ్రీహనుమ 🙏
ఈ రోజు చైత్ర పూర్ణిమ - హనుమత్ విజయోత్సవ దినం..
చాలా మందికి వున్న సందిగ్ధం, హనుమాన్ జయంతి ఎప్పుడు? హనుమాన్ విజయోత్సవ దినం ఎప్పుడనేది.. హనుమంతుని జన్మ తిథి చైత్ర మాసం లోనా, వైశాఖంలో చేసుకోవాలా అనే అనుమానం చాలామందికి ఉంటుంది.. అలాంటి వారు ఈ కథనం చదివి, సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
[ హనుమంతుడు తీర్చిన తుంబుర నారదుల వివాదం: https://youtu.be/PDJaB6-eRmQ ]
పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం, ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి, శనివారం రోజున జన్మించారని తెలుపబడింది.. అదే రోజున హనుమంతుని జన్మ తిథి చేసుకోవాలని చెబుతారు.
[ హనుమకు సీతమ్మ చెప్పిన ‘బోయవాడు - ఎలుగుబంటి’ కథ!: https://youtu.be/YK8QjVW2kc0 ]
అయితే, కొన్ని ఇతిహాసాల ప్రకారం, చైత్ర పౌర్ణమినాడు నికుంభుడు, తదిరత రాక్షసులను సంహరించి, హనుమంతుడు విజయం సాధించినట్లు వ్యక్తమవుతోంది. ఈ కారణంగా, ఆ రోజున హనుమద్ విజయోత్సవం చేసుకునే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. దీన్ని ఉత్తరాదిలో హనుమంతుని జన్మ తిథిగా చేసుకుంటారని పండితులు సూచిస్తున్నారు. అలాగే, చైత్ర పూర్ణిమ నాడు "హనుమంతుని విజయోత్సవం" దక్షిణాదిలో, ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో చాలా ఘనంగా జరుపుకుంటారు.
[ ఆంజనేయ స్వామి అద్భుత చరిత్ర!: https://youtu.be/6wOkEw-wpsw ]
ఆంజనేయస్వామి వారి నిలువెత్తు విగ్రహం, దగ్గర దగ్గరగా 60 అడుగులతో, శోభా యాత్రగా ఊరేగిస్తారు. చైత్ర పూర్ణిమ "హనుమత్ విజయోత్సవం" నుండి నుంచి 41 రోజుల పాటు ఆంజనేయునికి దీక్ష చేస్తారు. ఈ దీక్ష చివరి రోజున, హనుమంతుని జన్మ తిథి చేసుకుంటారు. ఈ 41 రోజులూ తెలుగు ప్రజలు ఆంజనేయునికి ఉత్సవాలను జరుపుతారు. వైశాఖ బహుళ దశమి నాడు దీక్షా విరమణ చేసి వైభవంగా పూజలు నిర్వహిస్తారు.
[ అర్జునుడి రథంపై హనుమంతుడు: https://youtu.be/F3pdXaWX7ps ]
హనుమంతుని జన్మ తిథి వైశాఖ బహుళ దశమినాడు జరుపుకునేందుకు ఓ బలమైన కారణం వుంది. "కలౌ పరాశర స్మృతి" అని శాస్త్రాలు చెబుతున్నాయి.
శ్లో: వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే |
పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనూమతే ||
అని చెప్పబడింది. దీని ప్రకారం వైశాఖ మాస బహుళ దశమి నాడు హనుమంతుని జన్మ తిథి జరుపుకుంటారు. ఈ రోజున హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్తోత్రాలతో స్వామిని స్తుతిస్తే, అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని, ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.
[ ఔరంగజేబుని హడలెత్తించి పరుగెత్తించిన ఆంజనేయస్వామి!: https://youtu.be/pmdh0JhWyMY ]
చైత్ర పూర్ణిమను హనుమాన్ విజయోత్సవం అంటారని పెద్దలు చెబుతారు. పరాశర సంహితను అనుసరించి హనుమంతుడు అవతరించింది, వైశాఖ బహుళ దశమినాడని, పరాశర మహర్షి చెప్పారు.
[ 16వ శతాబ్దంలో హనుమాన్ చాలీసా వ్రాసిన తులసీదాసుకు హనుమ కటాక్షం: https://youtu.be/jUk27kUoa5w ]
శ్రీ రాముడు సీతామాతతో కలసి అయోధ్యను చేరుకున్నాక, లంకలో రావణునిపై విజయానికి కారణం హనుమయేనని రాముడు ప్రకటించి, చైత్ర పూర్ణిమను హనుమాన్ విజయోత్సవంగా నిర్ణయించారట.
🚩 జై శ్రీరామ 🚩 జై శ్రీహనుమ 🙏
Comments
Post a Comment