గుడి! దేవుడు మనలోనే ఉన్నప్పుడు మరి గుడికి ఎందుకు వెళ్ళడం? Temple Secrets - Gudi - Aalayam
గుడి! దేవుడు మనలోనే ఉన్నప్పుడు మరి గుడికి ఎందుకు వెళ్ళడం? దేవుడు అన్ని చోట్లా, అంతటా ఉన్నప్పుడు, మరి ప్రత్యేకించి దేవాలయాలకు వెళ్ళడం అవసరమా? ఈ ప్రశ్న నేటి తరం వారందరికీ కలుగుతుంటుంది.. ఆలయాలను దర్శించుకోవడం వెనుక ఎన్నో శాస్త్రీయ ప్రయోజనాలున్నాయి. అసలు గుడి ఎప్పుడు, ఎందుకు, ఎలా ఏర్పడింది? దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి? ఈ విషయమై వేదాలు ఏం చెబుతున్నాయి? నేటి తరంలో చాలామందికి తెలియని ఇటువంటి అంశాలు ప్రతి హిందువూ తెలుసుకోవడం చాలా అవసరం.. ఈ వీడియోను అందరికీ చేరేలా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/gh0S2nYUMIM ] మనదేశంలో చిన్నా పెద్దా ఆలయాలను చూసుకుంటే, వేలాది సంఖ్యలో ఉంటాయి. అయితే, అవన్నీ వైదిక దేవాలయాల పరిగణనలోకి రావు. నియమాలను పాటించి, నిర్దిష్ఠంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే, గురువులు పరిగణిస్తారు. అలాంటివే, అత్యంత ప్రసిద్ధి చెందాయి. ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే కానీ, కొన్ని ఆలయాలు మరింత పునీతమై, స్థలమాహాత్మ్యాన్ని సంతరించుకున్నాయి. భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో, అక్కడ ఆలయాన్ని నిర్మించాలి. ఇంకా అర్ధమయ్యేట్ల...