హిందూత్వం - 1 - Science and Hinduism
హిందూత్వం - 1
మనం కాలాన్ని ఏ విధంగా కొలుస్తాము?.. భూమి మీద ఒక ప్రామాణిక దూరములోగల బిందువులను తీసుకుని, ఆ రెండు బిందువులనూ, నిర్దేశిత వేగంతో చేరే సమయాన్నీ, కాలాన్నీ, ఒక ప్రమాణంగా తీసుకోవడం జరుగుతుంది. అంతేకదా.. మరి మీరు దూరాన్ని ఏ విధంగా కొలుస్తారు? అని అడిగితే దానికి సమాధానం, ఇంతకు ముందు చెప్పిన విధానాన్నే చెప్పవలసి వస్తుంది. ఏ విధంగా అంటే, ఒక రెండు బిందువులను తీసుకుంటే, మీరు ఒకే సమయంలో, రెండు బిందువుల వద్దా ఉండలేరు గనుక, మొదటి బిందువు నుండి ఒక ప్రామాణిక వేగంతో, ప్రామాణిక కాలంలో, రెండవ బిందువు చేరగలిగితే, దానిని దూరము అంటాం.. ఇలా ఈ రెండూ ఒక దానితో ఒకటి ముడిపడి, ఈ కాలము, విశ్వముతో ఉన్న సంబంధాన్ని మనకు తెలయజేస్తుంది. ఈ విషయాన్ని ఐన్స్టీన్ మహశయుడు సాపేక్షతా సిద్ధాంత రూపంలో తెలియపరిచారు.
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/HAU_0e-RybQ ]
నిన్న మొన్నటి వరకూ వీదేశీయుల కాలగమనం ప్రకారం, సెకను, నిమిషము, గంట, దినము, వారము, మాసము, ఋతువు, సంవత్సరం మాత్రమే ఉండేవి. సంవత్సరములు, అంటే, కేవలం అంకెలు మాత్రమే .. రశ్మ్యుద్గారకత, పరమాణు విచ్చిత్తి వంటివి జరిగిన తరువాతే, వారు మైక్రొ సెకను పై దృష్టి పెట్టారు. కానీ, ప్రాచీన వైదిక కాలంలోనే, మన భారతీయులు, కాలగణనాన్ని పరమాణువు నుండి మొదలు పెట్టి, మహా యుగాల వరకు విస్తరించి ఉన్నారు. విదేశీయుల కాలగణనము ప్రకారం, 26 మైక్రొ సెకన్లకు సమానమైనది ఒక పరమాణువు.. రెండు పరమాణువులు ఒక అణువు, మూడు అణువులు ఒక త్రసరేణువు, మూడు త్రసరేణువులు కలిపి ఒక తృటి, వంద తృటులు కలిస్తే ఒక వేధ, మూడు వేధలు ఒక లవము, మూడు లవములు కలిపి, ఒక నిమిషమవుతుంది. ఆ విధంగానే, మూడు నిమిషములు, ఒక క్షణము, అయిదు క్షణములు ఒక కాష్ఠము, పదిహేను కాష్ఠములు కలిపితే ఒక లఘువు, పదిహేను లఘువులు కలిపితే ఒక దండ, అదే రెండు దండలు అయితే, విదేశీయుల కాలమానం ప్రకారం, 48 నిమిషములకు సరిపడే ఒక ముహుర్తం. ఇలాంటి ముప్పది ముహుర్తములు కలిపి, ఒక అహోరాత్ర దినం, 30 దినములు ఒక మాసము, రెండు మాసములు కలిపి ఒక ఋతువు. మూడు ఋతువులు కలిసి ఒక ఆయనము, అదే రెండు ఆయనములు కలిస్తే, దేవతల అహోరాత్రములకు సమానమైన ఒక సంవత్సరము.. దేవతల మాసమునకు 30 దినములు. దేవతల సంవత్సరములకు రెండు ఆయనములు మరియు 12 మాసములు... దేవతల సంవత్సరముల ప్రకారం, 4,800 దివ్యవత్సరములు, ఒక సత్య యుగం. 3,600 దివ్యవత్సరములు ఒక త్రేతాయుగం, 2,400 దివ్యవత్సరములు కలిపి, ఒక ద్వాపర యుగం, 1,200 దివ్యవత్సరములకు, ఒక కలయుగం. ఈ నాలుగు యుగములూ కలిపితే, మానవ సంవత్సరముల లెక్క ప్రకారం, 43,20,000 సంవత్సరాలన్న మాట...
సూర్యు గ్రహము తన చుట్టు తాను తిరిగే 12,000 భ్రమణములకు సమానమైన కాలాన్ని, ఒక మహా యుగం అంటారు. 1000 మహా యుగాల కాలాన్ని కల్పము అంటారు. 2 కల్పముల సమయం, విధాతకు ఒక అహోరాత్రము. విధాత మాసమునకు 30 దినములు, విధాత సంవత్సరానికి 12 మాసములు. అనగా మన లెక్క ప్రకారం 3.1104 ట్రిలియన్ సంవత్సరములన్న మాట. ఇటువంటివి 50 విధాత సంవత్సరములు గడిస్తే, ఒక పరార్థము, రెండు పరార్ధములు కలిస్తే, 311.04 ట్రిలియన్ మానవ సంవత్సరములకు సమానము. ఈ మహా కల్ప సమయాన్ని, విధాత పూర్ణాయుర్ధాయ సమయంగా నిర్వచించారు మన పూర్వీకులు. 30,67,20,000 సౌర సంవత్సరములకు సమానమైన 71 మహాయుగాలను, ఒక మన్వంతరం అంటారు. ప్రతి మన్వంతరానికి, ఒక మనువు శాసన కర్త, మరియు ప్రతి రెండు మన్వంతరములకు మధ్య, కృతయుగ కాలంతో సమానమైన ఒక సంధికాలం ఉంటుంది. ఈ సంధి కాలమంతా, భూమి నీటితో మునిగి ఉంటుంది. ఇంత సూక్ష్మ వివరణలతో కాలాన్ని వివరించిన ఘనత మన పూర్వీకులకు చెందుతుంది.
భారతీయుల సంవత్సరములు అంటే కేవలం అంకెలు మాత్రమే కాదు. వాటికి పేర్లు నిర్దేశించారు. ప్రతి సంవత్సరానికీ ఒక అధిష్టాన దేవత ఉన్నారు. ప్రభవ నుండి క్షయ వరకు గల 60 సంవత్సరములు కూడా గొలుసుకట్టు విధంగా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది. ఈ 60 సంవత్సరముల చక్రములో ఒక విశేషం ఇమిడి ఉంది. శ్రద్దగా పరిశీలించినట్లయితే, మనకు అర్దమవుతుంది. మొదటి 20 సంవత్సరములు శుభకరమైన, వృద్ది కలిగే గుణమును కలిగి ఉంటాయి. పెరుగుట విరుగుట కొరకే అనే సామెత ప్రకారం, తదుపరి వచ్చే 20 సంవత్సరములూ అభివృద్ది లేని సమతా స్థితిని కలిగి ఉంటాయి. ఇక చివరి 20 సంవత్సరములు ప్రశాంతత కరువై క్రమంగా అశాంతితో మిగిలి ఉంటుంది. ఈ మానవ సమాజాన్ని చారిత్రకంగా, ఇన్ని దశలలో చూచి, వాటికి తగిన పేర్లతో, ఒక చక్రంగా సమకూర్చిన వారి మేధస్సుకు మనం తలోగ్గక తప్పదు.
ఈ 20 సంవత్సరములకు మరొక విశేషం కూడా ఉంది. భారతదేశమంతటా కలియదిరిగి, హైందవధర్మ తత్వాన్ని నిరూపించి, ఎన్నో లెక్కకు మించిన సద్గురు పీఠములను నిర్మించి, అక్కడ జరగవలసిన ప్రతి కార్యాన్నీ వివరించి, భవిష్యత్త్ కాలంలో కూడా వాటికి ఎటువంటి ఆటంకాలూ రాకుండా, అన్ని విధాల ఏర్పాట్లను చేసిన శ్రీ శంకర భగవత్పాదుల ఆయుర్ధాయం, 32 సంవత్సరములు మాత్రమే కదా... అందులో ఆయన బాల్యాన్నీ, ఆయన శక్తి అందరికి స్పష్టంగా తెలిసేవరకూ పట్టిన సమయాన్నీ వదిలేస్తే, ఆయనకు ఉన్న కాలం 20 ఏండ్లు మాత్రమే.. ఆంధ్రులు ఇప్పటికీ తమకు ఆదర్శ ప్రభువుగా భావించే, ఆంధ్రభోజుడనే కీర్తిని సాధించిన శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనా కాలం కూడా, 20 ఏండ్లే.. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, మానవ జన్మను సార్థకం చేసుకోవాలంటే, వందల ఏండ్లు బ్రతకాల్సిన అవసరం లేదు. 20 ఏండ్ల సమయం సరిపోతుందని అర్థం అవుతుంది.
భారతీయ కాలమానం ప్రకారం ఈ విశ్వమంతా ఒక కల్పము వెనుక పుట్టింది. ఆనాటి పద్మకల్పము నుండి మొదలై, నేటికి శ్వేత వరాహ కల్పానికి చేరుకున్నాం. ఇప్పటికి విధాత ఆయుర్థాయం 50 ఏండ్లు పూర్తయి పరార్ధమున తొలి దినము నడుస్తున్నది. ఆరు మన్వంతరాలు గడిచి, ఏడవదయిన వైవస్వత మన్వంతరము సాగుతున్నది. ఈ వైవస్వత మన్వంతరములో, 28 వ మహా యుగంలోని కలియుగంలో ఉన్నాము.
సామాన్య శకం పూర్వం, 3102 లో, కలి ప్రారంభయయ్యిందని అందరి చేత నిర్ధారించబడింది. ఇవన్నీ కూడా పనిపాట లేక, ముక్కుమూసుకొని, కారడవులలో ఆశ్రమములు కట్టుకుని, ఒంటరి పక్షులవలె తిరిగే మునుల కాకిలెక్కలు కావు. ఈ నాటి ఆధునిక వైజ్ఞానిక శాస్త్రపు లెక్కలతో సరిసమానంగా నిరూపించబడి ఉన్నాయి. విష్ణు పురాణం ప్రకారం లెక్కిస్తే, ప్రస్తుత సృష్టి కాలం 4.32 బిలియన్ సంవత్సరములు.. ఇటీవలి కాలంలో ఆధునిక శాస్త్రం, భూమి వయస్సు 4.5 బిలియన్ సంవత్సరములు అని తెలియజేసింది. ఈ లెక్క మన పురాణాల లెక్కకు ఇంచుమించు దగ్గరగా ఉంది. తొలి ఆరు మన్వంతరాలు, సంధి కాలంతో కలిపి, (6 X 71 X 43,20,000 ) + 7 X 1.728 X 106 = 1.852 ) ఇప్పటికి 1.852 బిలియన్ సంవత్సరములు పూర్తయ్యాయి. ప్రస్తుత మన్వంతరంలో గడిచిన 27 మహాయుగముల కాలము 116.640000 మిలియన్ సంవత్సరాలు. ఇప్పటి మహాయుగంలో (1.728 X 106 + 1.296 X 106 + 8,64,000 = 3.888) 3.888 మిలియన్ సంవత్సరాలు గడిచాయి. కలి కాలం ప్రారంభమై (3102 + 2019 = 5119) 5119 సంవత్సరములు నిండాయి. వీటన్నింటిని కలిపితే, మొత్తము (155.52 X 1012 + 1.973X109 + 0.00012053302 = 155,521,972,949,113) 155 ట్రిలియన్ సంవత్సరాలన్నమాట. మహా విస్ఫోటనం జరిగినప్పటి నుండి, పాశ్చాత్యుల లెక్క ప్రకారం, మన విశ్వం యెక్క వయస్సు 13.7 బిలియన్లు మాత్రమే. కానీ, వారి లెక్క ప్రకారం, ఒక చిన్న తప్పు ఉంది. ఒక విస్ఫాటనం జరిగింది అంటే, అంతకుముందే దాని ప్రభావం వ్యాపించి ఉంటుందని వారు ఆలోచించలేదు. వారు లెక్కించిన విలువ మొట్టమొదటిది కాదు. దపదఫాలుగా మారుతూ వస్తూ ఉంది. అదే విధంగా, బావి తరాలలో మరిన్ని ఆవిష్కారాల తర్వాత, దాని విలువ కొంచెం అటు ఇటుగా మారి, మన పూర్వీకుల లెక్కకు మరింత దగ్గరగా చేరవచ్చు. భూమి యొక్క గోళాకారాన్ని నిరూపించాలి అనుకున్న వారికి, అత్యంత క్రూరమైన మరణ శిక్ష విధించక ముందే, మన భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులందరూ ముక్త కంఠంతో దానిని నిరూపించారు. మార్కండేయ పురాణంలో, భూమి ఒక అంచున నొక్కబడి ఉందని వర్ణించబడింది. మన దేశ పూర్వీకుల శాస్త్ర విజ్ఞాన ప్రతిభకు, ఇంకా ఎవరైనా సాక్ష్యాలడిగితే, వారిని మన దేశం నుండి బహిష్కరించి, వారికి నచ్చిన దేశంలోకి వెళ్లి బ్రతకమని మర్యాదపూర్వకంగా పంపడం మంచిది.
"INCEPTION" అనే ఆంగ్ల చిత్రం మీకు సులువుగా అర్థమవ్వాలంటే, భారతీయ విశ్వ సృష్టి వాదం తెలియాలి. ఎందుకంటే, అందులో ఉన్న కథ అంతా ఒక కల. ఆ కలలో మరొక కలను కలిపి చిత్రికరించారు. ఇదంతా బ్రహ్మసత్యం, జగన్మిధ్య అనే దానికి, బింబరూపంగా అనిపిస్తుంది. "MATRIX అనే మరొక చిత్రంలో కూడా, నటీనటులు చెప్పే మాటలన్నీ, మన భారతీయ కర్మ సిద్ధాంతానికి ప్రతిధ్వనిలా వినబడుతుంది. మన భారతదేశపు సంస్కృతి వైభవాన్ని, విదేశీయులు సైతం పారవశ్యంతో కీర్తిస్తుంటే, మన ప్రజలు మాత్రం, మన దేశపు గొప్పతనాన్ని తెలుసుకోలేక, ఈ దేశంలో ఏముందని చిన్నచూపు చూస్తున్నారు. మరి ఏ దేశమైనా, ఇంతటి కీర్తిని సాధించి ఉంటే, కన్ను మిన్ను కానరాక, తమ గోప్పలు చెప్పుకుంటూ, భూమి ఆకాశాన్ని ఏకం చేసేవారు. గురుత్వాకర్షణ సిద్దాంతాన్ని తెలియజేసిన మహానుబావుడు, ఐజాక్ న్యూటన్. కానీ, 64 శతాబ్ధాల క్రితమే, ఋగ్వేద సంహితలో ఈ ప్రపంచంలో ప్రతి వస్తువూ మరొక వస్తువుకు ఆకర్షించబడుతుందని స్పష్టముగా వివరించి ఉంది. నేటి కాలంలో ఈ విషయం అందరికి తెలిసినా సరే, గుర్తింపు ఎవరికి చెందింది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు కదా... ఆ విధంగానే, గడిచిన మన చరిత్ర వాస్తవాలను మఱుగున పడేసి, అసత్యాలను ప్రచారం చేసే దుష్కర్ములూ, మన శకకర్తల ఉనికిని కనిపెట్టలేని ఈ అసమర్థులూ, మన దేశపు కీర్తి ప్రతిష్ఠల కోసం పోరాడడం సాద్యమయ్యే పనేనా?
🚩 జై శ్రీ కృష్ణ 🙏
Contd.. in Part 2
Comments
Post a Comment