హిందూత్వం - 2 | Hinduism - History
హిందూత్వం - 2 (Hinduism - History)
ఆంగ్లేయులూ, వామపక్షీయులూ కలిసి, మన దేశపు చరిత్రను కలగాపులగం చేసి, ఏలా విప్పాలో తెలియని విధంగా పీట ముడులు వేసి మనపై వదిలారు. ప్రాచీన కాలంలో మన భారతీయ మేధావులు తమ గ్రంథాలలో, కాల నిర్ణయానికి శాలివాహన శకాన్ని ఒక ప్రమాణంగా తీసుకున్నారు. ఈ శకం సా. శ. 79 మార్చి 22 న, చైత్ర మాసారంభమున ప్రారంభించారు. ఈ చైత్ర మాసపు తొలి దినమే, దైవ అహోరాత్ర యుగమునకు ఆది కనుక, యుగాది అనే పేరును ఆపాదించి, దానికి చాలా విశిష్టతను చేకూర్చారు. కానీ ఈ కాలంలో యువత, జనవరి 1 న చూపే ఉత్సాహంలో సగం కూడా ఉగాది నాడు కనిపించదు. ఇప్పుడు ఎటు చూసినా పరాధీనంలో ఉన్న దౌర్భాగ్యమే కనిపిస్తుంది.
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/PUzEWDiAhOw ]
గౌతమి పుత్ర శాతకర్ణితో ప్రారంభించబడిన నాటినుండి, 1879 సంవత్సరములు గడిచిన తరువాత, 1957 మార్చి 22 నుండి భారత ప్రభుత్వం, ఈ శాలివాహన శకాన్ని అధికారికంగా కాలమానంగా స్వీకరించింది. అంటే, ఇప్పుడున్న గ్రిగేరియన్ క్యాలెండర్ లోని సంవత్సరము నుండి, 79 తీసివేస్తే, శక సంవత్సరం వస్తుంది. ఒక గ్రిగేరియన్ తేదీకి సమానమైన శాలివాహన సంవత్సరపు తేదీని లెక్కించాలంటే, చాలా తతంగాలున్నాయి. దీనిని ఒక ఉత్సాహవంతుడు చేధించి వివరించాడు. దాని ప్రకారం గ్రిగేరియన్ తేదీ "2015, October 04, Sunday" నకు సమానమైన శాలివాహన సంవత్సరము లోని తేదీ "1937, ఆశ్వీజము 12, రవివారము అని వివరించారు. ఈ శాలివాహనులనే, శాతవాహనులు అనికూడా అంటారు. మొదట్లో నాగజాతికి చెందిన వారి ఆధిపత్యం ఉండేది. ఈ నాగ మరియు నాంధ్ర అనే పదాలు, ప్రాచీన సాహిత్యంలో కొన్ని చోట్ల సమానార్థంలో వాడారు. విశ్వామిత్రుని చేత "ఏతమేవా ఆంధ్రేన పుళిందేన చాపి... అని శపించబడినట్లు వీరిని ఉదహరించి ప్రస్తావించారు. అందుచేత, వీరు బహుశా ఆటవిక జాతి అయ్యి ఉండవచ్చు. చరిత్రకారులు కూడా దీనిని దృఢపరుస్తున్నారు. ఈ జాతి వారి శాలివాహనుని తల్లికి ఒక సాధువు, 'నీ కూమారుడు రాజ్య స్థాపన చేస్తాడ'ని జోస్యము చెప్పారట. ఆ మాటను తల్లి శాలివాహనునికి చెప్పగా, అతను క్రమంగా ఆటవికత్వమునకు దూరమై, నాయకత్వ లక్షణాలను పెంపోందించుకున్నాడట.
ఆ విధంగా రాజ్య స్థాపన చేసి, శాలివాహన వంశ మూలపురుషుడు అయ్యాడని ఒక ఐహిత్యం ఉంది. ఒక రాజునకు వచ్చిన కలలో, పులి మీద స్వారీ చేసే బాలుడు కనిపించాడు. ఈ కల వృత్తాంతమే దీనిని సూచించింది కాబోలు. మౌర్యులు వీరిని ఢీ కోని, సామంతులుగా చేసుకొన్నారనడానికి తగిన ఆధారాలు ఏమి లేవు. అందుకే, వారి ఇష్ట పూర్వకంగానే మౌర్యులకు సామంతులై, విధేయత చూపినందుకు గాను, వీరికి యాంధ్రభృత్యులను మాట తిరస్కారంగా కాక పురస్కారంగా ఉదహరించబడింది.
సుమారు సా.శ. 230 ప్రాంతంలో, మౌర్య సామ్రాజ్య పతనం కారణంగా, గత్యంతరం లేక, శ్రీముఖ శాతకర్ణి స్వతంత్రించి "యేకరాట్" బిరుదాంకితునిగా యాంధ్ర శాతవాహన రాజ్యస్థాపన చేసాడు. సా.శ. 78 నుండి సా.శ. 102 మధ్య కాలానికి చెందిన శాతవాహన ప్రభువైన గౌతమి పుత్ర శాతకర్ణియే, శాలివాహన శక ప్రారంభకుడు. తన తాత తండ్రుల కాలంలో పోగోట్టుకున్న రాజ్యాలను విడిపించుకొని, రాజ్యవిస్తరణ చేసారు. క్రమక్రమంగా, శక, పల్లవ, క్షహరాటులు మొదలు, అనేక రాజ్యాలను జయించారు. మరుసటి చైత్రమాసం నుండి, శాలివాహన శకాన్ని ప్రకటించాడు. ఇంతవరకు మనకు అర్థమయ్యే రీతిలో ఉంది. కానీ, మన చరిత్రకారులు దీనికి ఒక అదనపు వివరణ ఇచ్చారు. శాలివాహన అనే పదానికి గానీ, వారి వంశానికి కానీ, ఏ సంబంధం లేని కనిష్కునికి, శాలివాహన శకంతో ముడిపెట్టారు.
చరిత్రకారులు, సా.శ. 1913 నుండి సా.శ. 1960 సంవత్సరముల మధ్యకాలంలో, ఎన్నో సదస్సులు పెట్టి, చాలాసార్లు కూలంకషంగా చర్చించినా, అమోదయోగ్యమైన కనిష్కుని కాలాన్ని కనిపెట్ట లేకపోయారు. సా.శ 57, సా.శ 78, సా.శ 115, సా.శ 128, సా.శ 134, సా.శ 144, సా.శ 230 మరియు ఇతర కాలాల్లో ఎప్పుడైనా కావోచ్చట..? ఒక మానవునికి ఇన్ని జన్మదినాలుంటాయా? చివరగా 2001 లో, Harry Falk అనే అతను, కనిష్కుని యవ్వన జాతకంలో ఉన్న ఒక ప్రస్తావనను బట్టి, అతని రాజ్యపాలన, సా.శ 127 గా తేల్చిచెప్పాడు. ప్రస్తుతం జరుగుతున్న పద్దతి ప్రకారం, అన్ని తేదీలనూ ఒక పట్టికలో వేసి, ఆ తేదీలకు కొత్త ఆధారాలు దొరికినప్పుడల్లా, ఆ గడులలో మార్కులు వేయడం జరుగుతుంది. ఇంతకన్నా విచిత్రమేమిటంటే, కనిష్కుని పేరుతోనే కుషాను శకమని మరోక శకం కూడా ఉంది. దాని మొదటి సంవత్సరము, సా.శ 227. కనిష్కుడొక్కడే, శాలివాహన శకాన్నీ, కుషాను శకాన్నీ స్థాపించడం ఏ విధంగా సాధ్యం?
శాతవాహనుల చరిత్రలో ఒక అపూర్వమైన రహస్యం ఇమిడి ఉంది. మొదట్లో వీరు సామాన్య స్థితిని అనుభవించారు. ఆ తరువాత రాజ్య స్థాపన చేసి, క్షత్రియులుగా మారారు. కానీ, కొందరు చరిత్రకారులు సాధ్వహణులను పేరుతో, వైశ్య వర్ణము వారని వాదిస్తున్నారు. శ్రీముఖ శాతకర్ణి ఒక బ్రాహ్మణుడని కూడా చెప్పారు. దానిని అందరూ అంగీకరించారు. ఆది కాలమందు బ్రహ్మణులు కానివారు బ్రహ్మణులుగా ఎప్పుడు మారారు? అగస్త్యుని కుంభసంభవుడని అంటారు. ఏ మానవుడైనా కుంభమునుండా పుట్టగలరా? బహుశా కుంభకారుల యందు పుట్టి, ఆయనకు ఉన్న ఆధిక జ్ఞానముతో అందరిని మెప్పించి, బ్రాహ్మణులు సైతం నమస్కరించే స్థాయికి ఎదిగి ఉండవచ్చు. వారి ప్రతి భావమునూ సౌందర్య భరితంగా మార్చి, అలంకరించి చెప్పుట భారతీయుల జీవలక్షణము. వేదవ్యాస విరచితమైన జయేతిహాసంలో ఒక కుంభ సంభవుడున్నాడు. ద్రోణాచార్యుడు స్వయంగా తానే అబ్రాహ్మణత్వం నుండి బ్రాహ్మణత్వానికి ఎదిగాడు. కానీ, నిష్కారణంగా ఏకలవ్యుడిపై ఎలా కులాధిక్యతను ప్రదర్శించాడు? ఎవరైనా దీనిని సాధించగలను, అని ఆత్మవిశ్వాసముకలిగి ఉన్నప్పుడు, ఏ చాతుర్వర్ణములు, ఏ కుల భేదములు, ఏ బ్రాహ్మణ్యము వానిని ఆపలేవు కదా. శాతవాహనులు అది సాధించారు. అది మాత్రమే కాక, సనాతన ధర్మమునూ ద్రవిడ సంప్రదాయమునూ కలిపి, మొత్తం భారతదేశంలో ఏకత్వాన్ని సాధించారు.
ఈ శాలివాహన శకానికి ముందు, విక్రమ శకమును బట్టి కాలనిర్ణయము చేసేవారు. గౌతమి పుత్ర శాతకర్ణి, తన విజయ యాత్రలో గెలిచిన ఉజ్జయిని ప్రభువైన విక్రమార్కుడే, ఈ విక్రమ శక స్థాపకుడు. ఈ శకము సా.శ.పూ 57 నుండి సాగుతుంది. యజ్ఞశ్రీ శాతకర్ణి ఉజ్జయిని పై విజయం సాధించేవరకు ఉన్న కాలంలో రచించబడిన గ్రంధాలలో ఇది చెప్పబడింది. ఇప్పటి నేపాల దేశంలో, ఇదే అధికారిక కాలమానం. కానీ, మన చరిత్రకారులకు ఉజ్జయిని రాజ్యాన్ని ఏలిన విక్రమమార్కుని జాడ కనిపించలేదు. ఇదేం చోద్యమో..
అనామకుడయిన రాజు, శక స్థాపకుడు కాలేరు కదా? మరి శక స్థాపకుడు వాస్తవ ప్రపంచంలో లేరనడం, ఏ విధంగా సమంజసం? అతడు దొరకకపోవడం వల్లనే ఈ శకానికి కర్తగా, గుప్త వంశపు చంద్రగుప్త విక్రమాదిత్యుని తెచ్చి పెట్టారు. ఇతని కాలం, సా.శ 375 నుండి, సా.శ 415 వరకు ఉంది. ఏ ప్రభువైనా తన కీర్తినిబట్టి శకమును స్థాపించాలనుకున్నప్పుడు, అన్ని సంవత్సరములు వెనకనుండి ప్రారంభించడం ఏ విధంగా సరియైనది? ఈ శకాన్ని ముందు కృతశకమనీ, తరువాత మాల్వేశ శకమనీ పిలిచారు. తరువాత సా.పూ. 57 నుండి, విక్రమార్కుని ప్రాభవాన్నిబట్టి, విక్రమ శకమని పొందుపరిచారు.
మహాకవి కాళిదాసు జ్యోతిర్విద్యాభరణం అనే కావ్యాన్ని రచించి, అందులోని ప్రధమాధ్యాయంలో, కలియుగం ప్రారంబమై 3,045 సంవత్సరాలు గడిచిన తరువాత, విక్రమ శకం ప్రారంభమయ్యిందని ప్రస్తావించారు. కలియుగ ప్రారంభం సా.శ. పూ. 3102 అని ఖచ్చితంగా తెలిసింది కనుక, దానిని బట్టి లెక్కిస్తే సా.శ. 57 నుండి విక్రమ శకం మొదలయ్యిందని నిర్ధారించవచ్చు. మరియు విక్రమార్కుడు వాస్తవ ప్రపంచంలో లేడని చెప్పడం దుర్మార్గమే కాక, ఈ కాళిదాసు మహాకవిని కూడా గుప్త వంశపు చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలానికి జరిపారు. కానీ, అదే జ్యోతిర్విద్యాభరణ కావ్యంలోని గ్రంధ రచనా కాలాన్ని, కలి ప్రారంభమైన తరువాత 5.067 అని చెప్పుకున్నారు. ఈ సంవత్సరం విక్రమ శకారంభము. తరువాత వచ్చే సా.శ.పూ. 35 తో సరిపోతుంది. మరి విక్రమార్కుని ఉనికిని గల సాక్ష్యాలను కనిపెట్టటం మాని, ఈ ఎగలాగుడు దిగలాగుడు వ్యవహారాలేంటో మరి? అందుకే పెద్దలు.. ‘నాయనా, పరిధిని దాటిన జ్ఞానము శిరోభార హేతువు. కనిపించిన ప్రతిదానికీ ప్రశ్నలు సంధించకురా...’ అని పదే పదే చెప్పేవారు.
మా తాత ఎడ్ల బండి మీద తిరిగారు. నేను కూడా ఎడ్ల బండి మీద జర్మనీకి పోతాను. అనుకోవడమే భారతీయ సంస్కృతని, హిందువులను వెక్కిరించే వారికి, వారి దేశంలోనే ఉన్న 14 విశ్వ విద్యాలయాల్లో, మన సంస్కృత భాషను బోధిస్తున్నారని తెలియదేమో మరి... ఈ థాయిలాండ్ వారు ఏ దేశాన్ని చూసి, ‘మన’ దేశం కన్నా గొప్పదని లొట్టలు వేస్తున్నారో, ఆ దేశంలో గల పరిశోధకలు, మన భారతయ విజ్ఞాన శాస్త్ర ప్రతిభకు తలొగ్గిన సంగతి ఇంకా తెలుసుకోలేదేమో.. సూర్యుని అఖండ తేజోమయమైన కాంతిని ఒక గ్రుడ్డివాడు చూడలేడు కదా.... స్వతంత్ర భారతావనిలో మొదటి ప్రధాని హైందవ ధర్మ ద్వేషి అవ్వడం వల్లే, ఇక్కడి విశ్వవిద్యాలయాల్లో ఉన్నవారు, కోతి మూకలా అడ్డూ అదుపూ లేకుండా చేలరేగి పోతున్నారు. ఇప్పటికి వారి ఆగడాలకు అడ్డుకట్ట పడింది. హిందువులు ఇంతకు ముందు వారివలె లేరు. వీరు కక్కిన హైందవ ద్వేషం యెక్క నిజరూపాన్ని తెలుసుకుని, వారి వల్ల ఈ నాటికి హిందువులు జాగ్రత్త పడ్డారు.
ఏ ప్రజలూ తమ దేశానికి చేయని అపకారాన్ని, భారత దేశపు వామపక్షాలు చేశాయి. ముఖ్యంగా, మన దేశ చరిత్రను ఏం ఆశించి వక్రీకరించారు? మన దేశానికి సంబంధించి ప్రతీదీ చెత్తగానే భావించారు. మన దేశాన్ని ఆక్రమించి, మన దగ్గర నెలకొని ఉన్న శాంతిని ధ్వంసం చేసిన విదేశీయులు జగదేకవీరులా? మన దేశపు రాజులు శివాజీ మహారాజ్ మెదలుకొని, మహారాణా ప్రతాప్ వరకు ఎవ్వరైనా క్రూరులే. బాబరు నుండి ఔరంగ జేబు వరకు ఉన్న వారు మాత్రమే ధర్మ ప్రభువులుగా కనిపించారా? వీరు మన దేశానికి రాకపోతే, మనకు చాలా నష్టము వాటిల్లేదనే భావనలో ఉన్నారు. ఏంటి ఈ పైత్యకారి సిద్ధాంతాలు? మన ఆచార వ్యవహారాలన్నీ అనాగరికములే అని, విదేశీయుల సిద్దాంతాలను మనపై రుద్దమని ప్రకటించిన వాడూ, వ్యభిచారీ, లౌకికత్వముతో అగ్రగణ్యుడైన వాడూ, పండితుడయ్యాడు. అతని తప్పులనూ, వీరి అబద్దములను బయటపెడితే, అది లౌకికతత్వమునకు విరుద్దమట. ఇదేం చోద్యమో...
🚩 జై శ్రీ కృష్ణ 🙏
Link: https://www.youtube.com/post/UgkxNkF7ZHn7e05R2t5qeV8xkn377PNPQkla
Comments
Post a Comment