Mahavatar Babaji's Cosmic Cobra Breath | మహావతార్ బాబాజీ – ‘విశ్వ సర్ప శ్వాస’ ప్రక్రియ!
మహావతార్ బాబాజీ – ‘విశ్వసర్పశ్వాస’!?
కుండలినీ శక్తిని నిద్ర లేపటానికి ఉపయోగించే తాంత్రిక యోగమార్గం ఏమిటో తెలుసా?
ఈ అనంత విశ్వంలో దాగి ఉన్న ఎన్నో రహస్యాలూ, మనిషి మేధస్సుకందని విశేషాలూ అనంతం. మరణం లేని మానవులూ.. మరణాన్ని జయించే యోగాసనాలూ.. ఆ మహా యోగి గురించి తెలుసుకునే ప్రయత్నం చేసేకొద్దీ, సాధారణ మానవులకు నమ్మశక్యంకాని అటువంటి అద్భుతాలు కోకొల్లలు. ఆయనే మహావతార్ బాబాజీ. సుమారు 2000 సంవత్సరాలుగా, సజీవంగా ఉన్న సిద్ధ యోగి బాబాజీ గురించీ, ఆయన జీవిత విశేషాలతో, మానవాళి శ్రేయస్సుకోసం ఆయన అందించిన ‘క్రియా యోగం’ గురించీ, గతంలో మనం చేసిన వీడియోల Playlist, క్రింద description లో పొందుపరిచాను. చూడని వారు తప్పక చూడండి. ఇక ఈ రోజుటి మన వీడియోలో, ఆ సిద్ధ యోగి మనకోసం అందించిన మరో అద్భుతమైన ‘విశ్వ సర్ప శ్వాస’ గురించి తెలుసుకుని, గురవు ద్వారా నేర్చుకుని తరిద్దాము..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/W_hczzQyXJY ]
ఈనాటికీ హిమాలయాలలో అదృశ్యరూపుడిగా సంచరిస్తున్నాడని చెప్పబడుతున్న మహావతార్ బాబాజీ, మానవ జాతి అభ్యుదయం కోసం అందించిన ఒక అపూర్వమైన వరం “క్రియా యోగం”. క్రియా యోగం అంటే, ఎవరిని వారు తెలుసుకోవటం అని అర్ధం. నిజానికి క్రియా యోగం ఒక సైన్స్ అని చెప్పాలి. ఈ క్రియాయోగంలో అత్యున్నత స్థాయికి చెందిన ఒక యోగ ప్రక్రియను “విశ్వ సర్ప శ్వాస ప్రక్రియ అనీ, Science పరంగా కాస్మిక్ కోబ్రా బ్రీత్” అనీ పిలుస్తారు. అతి పవిత్రమయిన, మరియు అత్యంత రహస్యమైన ఈ శ్వాస ప్రక్రియను, మహావతార్ బాబాజీ తన శిష్యులకు బోధించారు. ఆ తరువాతి కాలంలో, ఆ శిష్యులు తమ శిష్యులకు ఈ ప్రక్రియను అందజేస్తూ వచ్చారు.
మానవ శరీరంలో దాగి ఉండే శృంగార సామర్ధ్యాన్ని ఊర్ధ్వరేతస్సుగా, కుండలినీ శక్తిని నిద్రలేపటం కోసం ఉపయోగించే ఒక తాంత్రిక యోగమార్గాన్ని, విశ్వ సర్ప శ్వాస, లేక కాస్మిక్ కోబ్రా బ్రీత్ అని పిలుస్తారు. వేలాది సంవత్సరాలుగా భారతదేశానికి చెందిన ఎందరో మహర్షులు, ఈ విధానం ద్వారా కుండలినీ సాక్షాత్కారాన్ని పొందారని తెలుస్తోంది. ఈ విధానంలో 7 స్థాయిలుంటాయి. ఒక్క గురువు ద్వారా మాత్రమే, ఈ శ్వాస విధానాన్ని నేర్చుకోవాలని తెలుస్తోంది.
సాధారణ మానవులు శృంగారంలో పాల్గొన్నప్పుడు, వారిలోని శృంగార శక్తి వీర్యం ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఫలితంగా, మానవులు బలహీన పడతారు. అయితే, యోగులు ఆ శృంగార శక్తిని, తమ శరీరంలోని పై భాగాలకు పంపిస్తారు. దీనినే ఊర్ధ్వ రేతస్ అని పిలుస్తారు. ఈ ‘విశ్వ సర్ప శ్వాస’ అనే ప్రక్రియ, గురువు నుండి శిష్యుడికి తెలుస్తుంది. ఈ ప్రక్రియ ఎక్కడా వ్రాత రూపంలో కనబడదు. ‘విశ్వ సర్ప శ్వాస’ అనే యోగ ప్రక్రియలో, మొదటి స్థాయిలోనే మానవుడి నుదిటి భాగంలో ఉన్న “అజ్ఞా చక్రాన్ని”, చాలా వేగంగా తెరిచే విధానం నేర్పబడుతుంది. దీనినే మూడవ కన్ను అనికూడా పిలుస్తారు. ఇక ఈ విశ్వ సర్ప శ్వాస ప్రక్రియలోని రెండవ స్థాయిలో, మనిషిలో ఉండే స్త్రీ / పురుష శక్తులను సమతౌల్యంలోకి తీసుకువచ్చి, ఆపై దిగువగా ఉండే మూడు శక్తి కేంద్రాలైన చక్రాలను శుద్ధిచేసే పద్ధతి బోధించ బడుతుంది.
ఇక మానవునిలోని హృదయ ప్రాంతంలో, మరియు కంఠ ప్రాంతంలో ఉండే 4, 5 చక్రాలను తెరచి, ఆపై వెన్నెముక గుండా వెళ్ళే కేంద్ర మార్గాన్ని తెరచి, ఆ మార్గం గుండా, కుండలినీ శక్తిని పైకి వెళ్ళేలా చేసే ప్రక్రియ, “విశ్వ సర్ప శ్వాస” మూడవ స్థాయిలో బోధిస్తారు. నడి నెత్తిన ఉండే ఏడవ చక్రాన్ని తెరచి, ఆ పై జీవాత్మతో పరమాత్మను కలిపే ప్రక్రియను, “విశ్వ సర్ప శ్వాస” నాలుగవ స్థాయిలో నేర్పిస్తారు. మొత్తంగా ఉన్న 7 స్థాయిలలో, 4 స్థాయిలు గురువు ద్వారా నేర్చుకోవాలి. మిగిలిన మూడు స్థాయిలను, శిష్యుడు తన వ్యక్తిగత సాధన ద్వారా సాధించాల్సి ఉంటుంది.
మహావతార్ బాబాజీ ప్రబోధించిన “క్రియాయోగం”లో 5 విభాగాలుంటాయి. అవి..,
1. క్రియా హఠయోగం 2. క్రియా కుండలినీ ప్రాణాయామం 3. క్రియా ధ్యాన యోగం 4. క్రియా మంత్ర యోగం 5. క్రియా భక్తి యోగం..
మానవాళి శ్రేయస్సుకై మహావతార్ బాబాజీ అందించిన ‘క్రియా యోగం’ గురించీ, పైన ప్రస్తావించబడిన సప్త చక్రాల గురించీ, గతంలో మనం చేసిన వీడియోల Playlists, ఈ వీడియో క్రింద description లో పొందుపరిచాను. చూడని వారు తప్పక చూసి మీ అభిప్రాయాలను కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక్క విషయం.. గతంలో చాలామంది, ఈ విద్యలను నేర్చుకునే విధంగా వీడియోలు చేయమని కోరారు. అందరూ గమనించాల్సిన ముఖ్యమైన విషయం, ఇవన్నీ గురుముఖత నేర్చుకోవలసినవే.. ఔత్సాహికులు గురువులకొరకు స్వయంగా అన్వేషణలో పడక తప్పదు.
🚩 ఓం క్రియా బాబాజీ నమః ఓం 🙏
Comments
Post a Comment