Posts

Showing posts from October, 2024

The Varna and Caste System as per Garuda Puranam | శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పిన గరుడ పురాణం ప్రకారం కులము!?

Image
కులము!? – గరుడపురాణంలో చెప్పబడిన వర్ణాశ్రమ ధర్మాలేమిటి? శూద్రులు తపస్సు చేయడం? వేదాలు చదివి బ్రాహ్మణులవ్వడం? బ్రాహ్మణుల చేత పూజలందుకోవడం? ఈ సువిశాల విశ్వం లాగానే, ఆది తెలియనిది, అంతం లేనిది, సనాతన ధర్మం. నాలుగు వేదాలను స్థంభాలుగా చేసుకుని సుస్థిరంగా నిలబడిన సనాతన ధర్మాన్ని నిష్ఠగా పాటించే హిందువులను గెలువలేక, పాశ్చాత్య ధూర్తులు పన్నిన ఒకానొక దౌర్భాగ్యపు పన్నాగం, 'కులం'! 1947 లో పేరుకు వారు వదిలి వెళ్ళినా, Secularism పేరిట హిందువుల ముసుగులో ఇప్పటికీ వారి ప్రయత్నాన్నీ, వారసత్వాన్నీ కొనసాగిస్తూనే వున్నారు కొందరు ద్రోహులు. మరి సాక్షియత్తు శ్రీమహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పిన విషయాలను, వ్యాస మహర్షి మనకందించిన అష్టాదశ పురాణాలలో ఒకటయిన గరుడపురాణంలో, ఆ పైత్యం గురించి ఏం చెప్పబడింది? వర్ణాశ్రమ ధర్మాలేమిటి? వంటి విషయాలను తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/yF1smKwsNqo ] వర్ణమంటే కులం కాదు. పురాణ కాలంలో సమాజాన్ని నడిపించిన వర్ణానికీ, నేటి కలికాలంలో రాజకీయాలను

అష్టదిగ్బంధనం! Ashta Digbandhanam - Arunachaleswara, Tiruvannamalai

Image
అష్టదిగ్బంధనం! అష్టదిక్పాలకుల బంధనంలో అరుణాచలం! తిరువణ్ణామలై అరుణాచలేశ్వరుడు అష్టలింగాలతో దిగ్బంధనం చేయబడ్డాడా? సనాతన సాంప్రదాయంలో అష్ట దిక్కులకూ, ఆ దిక్కులను పాలించే అష్ట దిక్పాలకులకూ ఎంతో ప్రాధాన్యత ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం అలా ఎనిమిది దిక్కులలోనూ ఎనిమిది మంది ఉప దేవతలైన దిక్పాలకుల శక్తిని నిక్షేపించి, ఒక రక్షణ వలయాన్ని ఏర్పరచడమే, ‘అష్టదిగ్బంధనం’. సాధారణంగా ఒక ప్రదేశానికి రక్షణ ఏర్పాటు చేయడానికి, రత్నాధ్యాయ క్రియను వినియోగిస్తారు. అంటే, ఎనిమిది దిక్కులలో ఎనిమిది గ్రహాలకు చెందిన జాతి రత్నాలను, కొన్ని ప్రత్యేకమైన మంత్రాలను పఠిస్తూ భూమిలో నిక్షిప్తం చేస్తారు. తద్వారా ఆ రత్నాలు Receivers లా పనిచేస్తూ, అంతరీక్షంలోని ఆ రత్నాలకు చెందిన గ్రహాల యొక్క శక్తిని ఆకర్షించి, ఆ ప్రదేశాన్ని చెడునుంచి రక్షిస్తూ, నిత్యం ఉత్కృష్టమైన Positive Energy ని ప్రసరింపజేస్తుంటాయి. అటువంటిది, సాక్షాత్తూ ఆ దిక్పాలకులే దిగివచ్చి, అరుణాచలేశ్వరుడి చుట్టూ వారి వారి స్థానాలలో ప్రతిష్ఠితమైన అరుణాచల క్షేత్రం గురించి ఇక వేరే చెప్పాలా! అంతటి అరుణాచలేశ్వరుడి విశిష్ఠతను వివరిస్తూ, గతంలో చేసిన వీడియోను కూడా తప్పక చూడండి.