Posts

Showing posts from November, 2024

నవంబర్‌ 9, 2024 "కోటి సోమవారం!"

Image
నవంబర్‌ 9, 2024 "కోటి సోమవారం!"  కార్తీక సోమవారం లాగానే, కోటి సోమవారం అనే ఒక సోమవారం వస్తుందనుకుంటే, అది పొరపాటే... సోమవారం శివుడికి ఇష్టమైన రోజు, కోటి సోమవారాల పూజ ఫలితాన్ని ఇచ్చే విశేషమైన రోజు, 'కోటి సోమవారం'. కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రంతో కలసి వచ్చే రోజునే, కోటి సోమవారంగా పిలుస్తారు. ఈ 2024లో, కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రం నవంబర్‌ 8న ఉదయం 9.18 నిముషాలకు ప్రారంభమై, నవంబర్‌ 9న శనివారం ఉదయం 8.42 నిముషాలకు ముగుస్తుంది. శ్రవణా నక్షత్రం సూర్యోదయంతో కలిసి ఉండడం వలన, నవంబర్‌ 9ని కోటి సోమవారంగా జరుపుకోవాలని అధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. ఆ రోజు చేసే ఏ పని అయినా సరే.. దీపం, స్నానం, దానం, ఉపవాసం లాంటివి, కోటి రెట్లు అధిక ఫలాన్నిస్తాయని శాస్త్ర విదితం. 🚩 ఓం నమః శివాయ 🙏 Link: https://www.youtube.com/post/UgkxEDDejQzfu2fI7FJL2WFJZ20y8pm7HZe9

నాగుల చవితి 2024 Nagula Chavithi

Image
అందరికీ ' నాగుల చవితి ' శుభాకాంక్షలు 🙏  @VoiceofMaheedhar 'కాల నాగు' మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాలను గ్రక్కుతూ, మానవునిలో 'సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందనీ, అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే, మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివసించే 'శ్రీమహావిష్ణువు'కు తెల్లని ఆదిశేషువుగా మారి, శేషపాన్పుగా మారాలనే కోరికతో చేసేదే, ఈ పాము పుట్టలో పాలు పోయడంలో గల ఆంతర్యమని కొంత మంది పెద్దల మాటల ద్వారా తెలుస్తుంది. పాలు స్వచ్ఛతకు ప్రతీక. ఈ పాలను వేడి చేసి చల్లపరచి, దానికి కొద్దిగా చల్లను చేరిస్తే పెరుగవుతుంది. ఆ పెరుగును చిలుకగా వచ్చిన చల్లలో నుంచి వచ్చే వెన్నను కాయగా, నెయ్యి అవుతుంది. దీనిని మనం యజ్ఞంలో హవిస్సుగా ఉపయోగిస్తాము. అలాగే మన బ్రతుకనే పాలను, జ్ఞానమనే వేడితో కాచి, వివేకమనే చల్ల కలిపితే, సుఖమనే పెరుగు తయారవుతుంది. ఈ పెరుగును ఔదార్యమనే కవ్వంతో చిలుకగా, శాంతి అనే చల్ల లభిస్తుంది. ఆ చల్లను సత్యం, శివం, సుందరం అనే మూడు వేళ్ళతో క

What is Cosmic Plan? | కర్మయోగం!

Image
కర్మయోగం!  ఫలాన్ని ఆశించి చేసే 'కర్మ' వలన ఎటువంటి ఫలితాన్ని పొందుతాము? ఫలితంపై కోరిక లేకుండా పనిచేయడానికి, అంటే, నిష్కామకర్మకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు పెట్టిన పేరే, 'కర్మయోగం'. యోగం అంటే ఆసనాలు వేయడం, గాలి పీల్చడం అని మనం సాధారణ పరిభాషలో అనుకుంటూ వుంటాము. నిజానికి యోగమంటే కలయిక. ఫలానా వాడికి రాజయోగం పట్టింది, లక్ష్మీ యోగం పట్టిందని అనడం వింటూంటాము. లేనిదానిని పొందడం, పొందినదానిని రక్షించుకోవడమే, యోగమంటే. ఇక్కడ కర్మయోగం అంటే, కర్మ అనే ఉపాయాన్ని పట్టుకుని, మరొకదానిని సాధించడం. ఆ మరొకటే, 'ఆత్మజ్ఞానం'. ఆ విషయాలను తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/XycX4sTLnE8 ] ఫలితం కోరకుండా పని చేసే వ్యక్తి మనస్సు, క్రమక్రమంగా పవిత్రంగా మారుతుంది. దీనినే చిత్తశుద్ధి అంటారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా మంచిపనులు చేస్తున్నప్పుడు, మనస్సు ఎంత ప్రశాంతత, సంతృప్తిని పొందుతుందో, మనం స్వంతంగా ప్రయత్నం చేసి చూడవచ్చు. కర్మ మనస్సును శుభ్రపరచడానికి ఒక మార్గం. చిత్తశు