Posts

Showing posts from January, 2025

Discover the REAL Story Behind Kumbh Mela! | 'కుంభ' మేళా! లక్షల సంవత్సరాల చరిత్ర!

Image
కుంభమేళా! లక్షల ఏళ్ల చరిత్ర!  TELUGU VOICE 144 ఏళ్ళకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా! ఇదే నేడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రధాన వార్తా పత్రికలలోనూ కనిపిస్తున్న ముఖ్య వార్త.. అన్ని దేశాలూ, అంతరీక్షంలో ఉన్న శాటిలైట్స్ సహాయంతో వీక్షించాలని తహతలాడుతున్న ఏకైక పరిణామం, ఆఖరికి ఇస్లాం పుట్టుకకు మూలమైన మధ్య ఆసియా దేశాల ప్రజల నుంచి, మన పొరుగునే ఉన్న పాకిస్తాన్ లోని జనాల వరకూ, ఒక్కసారైనా వెళ్ళాలని అనుకుంటున్న డెస్టినేషన్, అఖండంగా, ఆమోఘంగా, దేదీప్యమానంగా, ఏ బాష వర్ణనకీ అందనంత ఘనంగా మన దేశంలో జరుగుతున్న మహాకుంభమేళా గురించే అని చెప్పడం, ఎంత మాత్రమూ అతిశయోక్తి కాదు.. భారత దేశంలోని ఉత్తర్ ప్రదేశ్ లో గల ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకి తరలి వస్తున్న కోట్లాదిమంది భక్తులనూ, అక్కడికి వచ్చే ఎందరో నాగ సాధువులు, అఘోరాలు, యోగులూ, మహాపురుషుల వంటి వారిని చూసి, ప్రపంచం మొత్తం తాదాత్మ్యం చెందుతోంది. ఈ క్రమంలో ఇతర దేశస్థులతో పాటు, మన దేశంలో ఉన్న చాలా మందికి, అసలు కుంభమేళ అంటే ఏమిటి..? మహా కుంభమేళ విశిష్టత ఏమిటి..? ఇది ఎప్పుడు మొదలైంది..? ఎలా మొదలైంది..? కుంభమేళా పూర్తి చరిత్ర ఏమిటి..? వంటి ఎన్నో సందేహాలు కలుగ...

anjore Brihadeeswara: Ancient Secrets Revealed | 1000 ఏళ్ల క్రితం ఇవన్నీ ఎలా సాధ్యపడ్డాయి?

Image
1000 ఏళ్ల క్రితం ఇవన్నీ ఎలా సాధ్యపడ్డాయి?  TELUGU VOICE నీడ నేలపై పడని అతి పెద్ద ఆలయ రహస్యం! ఆది మానవుడి పుట్టుక ఎప్పుడు సంభవించిందో తెలియదు కానీ, ముందుగా నాగరికత నేర్చి, మన దేశాన్ని విశ్వ గురువు స్థానానికి చేర్చిన ఘనకీర్తి పొందిన వారు మన పూర్వీకులు. నేడు భూమిపై అగ్ర రాజ్యాలుగా చలామణి అవుతున్న దేశాలలోని ప్రజలకు, కనీసం గుడిసెలు కట్టుకోవడం కూడా తెలియని సమయంలో, ఇక్కడ పెద్ద పెద్ద భవనాలూ, అద్భుతమైన మందిరాలూ నిర్మించబడ్డాయి. అలా ఆ నాడు కట్టబడిన అద్భుత నిర్మాణాలలో ఎన్నింటినో, గోరీ, బాబర్ వంటి ధూర్తులు నాశనం చేసినా, నేటికీ కొన్ని నిర్మాణాలు నాటి మనవారి నిర్మాణ కౌశలానికి సాక్షీభూతాలుగా నిలుస్తున్నాయి. అటువంటి కట్టడాలలో ఒక ఆలయం, మన దక్షణ భారత దేశంలోనే కొలువై ఉంది. మనకు అందుబాటులో ఉన్న వివరాల ప్రకరం ఆ ఆలయ నిర్మాణం ఓ వింత అయితే, దాని గోపుర నిర్మాణ పద్ధతి, ఓ అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. ప్రపంచలో మరెక్కడా లేని విధంగా, 13 అంతస్తుల ఎత్తైన ఆ ఆలయ గోపురం నీడ భూమిపై పడదు. ఇన్ని వింతలకూ రహస్యాలకూ నెలవై వున్న ఆ ఆలయం, మన దక్షిణ భారత దేశంలో ఎక్కడ ఉంది? దానిని ఎవరు, ఎప్పుడు నిర్మించారు? అసలు ఆ ఆలయం ...

Reincarnation of Arjuna a Hagiography | కలియుగంలో అర్జునుడు ‘పునర్జన్మ – మోక్షం’!

Image
ఆత్మీయ మిత్రులందరికీ 'భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు'  TELUGU VOICE పరమాత్ముడికై సంపూర్ణ శరణాగతీ, ఆత్మ నివేదనా ఎలా ఉండాలి? కలియుగంలో అర్జునుడు ‘పునర్జన్మ – మోక్షం’! పంచమ వేదంగా పేరుగాంచిన వ్యాస విరచిత జయకావ్యం - మహాభారతంలో, పాండవుల స్వర్గారోహణ గురించి వివరించబడివున్నది. 17వ పర్వమైన మహా ప్రస్థానిక పర్వం ప్రకారం, పాండవులు సర్వమూ త్యజించి, స్వర్గానికి పయనమైనట్లు చెప్పబడింది. ఆ విషయాలను వివరిస్తూ, 'పాండవులు స్వర్గానికి వెళ్లిన దారి ఎక్కడుంది?' అనే శీర్షికన గతంలో మనం వీడియో చేసి ఉన్నాము. చూడని వారు అదికూడా తప్పక చూడండి. అలా ఆ జన్మను ముగించిన పాండవ మధ్యముడు 'అర్జునుడి' మరుజన్మ వివరాలు ఏమిటి? అని తెలుసుకునే ముందు, ద్వాపరయుగంలో అర్జునుడు శివుడి గురించి తపస్సు చేయగా, పాశుపతాస్త్రాన్ని వరంగా ఇచ్చాడు గానీ, మోక్షం ప్రసాదించలేదు ఆ పరమేశ్వరుడు. ‘కలియుగంలో బోయ వానిగా జన్మించి మోక్షం పొందుతావ’ని అర్జునుడికి శివుడు చెప్పినట్లు మన ఇతిహాసాలలో పేర్కొనబడింది. దాని ప్రకారం అర్జునుడు బోయవానిగా జన్మించి, శివుడి అనుగ్రహాన్ని పొందాడని ప్రతీతి. ఆ బోయవాడి పుట్టుపూర్వోత్తరాలనూ, ఆతడు కైవ...

Sabarimala: Original Ayyappa's Idol Vandalised? | శబరిమల అయ్యప్ప! దైవ స్థాపిత విగ్రహం ఏమయ్యింది?

Image
శబరిమల అయ్యప్ప! దైవ స్థాపిత విగ్రహం ఏమయ్యింది!  TELUGU VOICE నేడు భక్తులు దర్శించుకునే అయ్యప్ప స్వామి విగ్రహం పరశురాముడు ప్రతిష్ఠించినది కాదా? స్వామియే శరణం అయ్యప్ప అంటూ ప్రపంచం దద్దరిల్లి పోతోంది. ఆ హరిహర సుతుడిపైనున్న నమ్మకం, ప్రేమ, భక్తికి గుర్తుగా, ఆయప్ప మాలను ధరించి, మండలం రోజుల పాటు దీక్షబూనుతుంటారు ప్రతి సంవత్సరం. కార్తీక మాసం మొదలవ్వగానే, మనకు ఎక్కడ చూసినా ఆ మణికంఠుడి మాల ధరించిన స్వాములే కనిపిస్తూ ఉంటారు. ఈ సమయంలో ఆయప్ప మాల వేసుకుని వచ్చే కోట్లాది మంది స్వాములతో కిక్కిరిసి పోయి ఉంటుంది శబరిమల. ప్రతి సంవత్సరం కోట్లాది మంది దర్శించుకునే అయ్యప్ప స్వామి విగ్రహం, ఆనాటి దైవ స్థాపిత విగ్రహమేనా? అసలైన విగ్రహం పళనిలోని కుమారస్వామి ఆలయంలో ఉన్న నవ పాషాణ విగ్రహం లాంటిదా? మరి అసలైన విగ్రహానికి ఏమైంది..? ఇప్పుడున్న విగ్రహం అక్కడికి ఎలా చేరింది..? వంటి అనేక సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Z1osWZdk17g ] కార్తీక మాసంలోనే కాకుండా, ప్రతి న...