RAVANA'S LANKA: The Landscape of a Lost Kingdom | సముద్ర గర్భంలో కలిసిపోయిన రావణ లంక!
సముద్ర గర్భంలో కలిసిపోయిన రావణ లంక! కుబేర నిర్మితం, స్వర్ణ శోభిత భవంతులతో దేదీప్యమానంగా వెలిగిన ప్రదేశం, ఆ యుగం చూడని అద్భుతమైన శాస్త్ర పరిజ్ఞానం కలిగిన నగరం, రావణ ఆక్రమిత ‘లంక’. అసుర రాజు ఏలిన లంక.. సీత మాత కన్నీటితో మలినమైన లంక.. హనుమ దహించిన లంక.. రాముడి చేతిలో పరాజయం పొందిన లంక.. నేడు మనకు కనిపిస్తున్న శ్రీలంక కాదా..? మరి రావణ పాలిత లంక నేడు ఉన్న శ్రీలంక కానప్పుడు, అసలు లంక ఎక్కడ ఉంది..? అలాంటప్పుడు ధనుష్కోటి నుంచి శ్రీలంకను కలుపుతున్న రామసేతు, రాముడు నిర్మించినదెలా అయ్యింది? రావణ లంక కుమారీ ఖండంలో భాగమా..? మరి ఇప్పుడున్న శ్రీలంక ఏమిటి? అసలు శ్రీలంకను రావణ లంకగా ఎందుకు భావిస్తున్నారు..? వంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/ZgGKSd_PD_Q ] నేటి శ్రీలంక రావణ లంక కాదా? అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే, అసలు రామాయణం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది అనే విషయాలు స్పష్టంగా తెలియడానికి మనకు ముందుగా కనిపించే ఆధారం వాల్మీ...