Battle of the Ten Kings in Rigveda | Dasaragna War | దశరాజ్ఞ యుద్ధం
ఆఫ్ఘనిస్థాన్ లో సనాతన ధర్మం! @teluguvoice.in
‘దశరాజ్ఞ యుద్ధం’ ‘Battle of The Ten Kings’ గురించి ఋగ్వేదంలో ఏమని పేర్కొనబడింది?
ఈ ప్రపంచంలో నేటికీ మనుగడలో ఉన్న ఏకైక పురాతన నాగరికత, అత్యంత ఉత్కృష్టమైన విలువలు కలిగిన ధర్మం ఏదైనా ఉంది అంటే, దానికి ఒకేఒక్క సమాధానం మన ‘సనాతన ధర్మం’. అయితే, తన సుదీర్ఘ ప్రయాణంలో ప్రపంచం మొత్తం వ్యాపించిన మన ధర్మం, ఉత్థాన పతనాలను ఎన్నింటినో చవి చూసింది. అద్భుతమైన రాజ భవనాలతో, ఆమోఘమైన శిల్ప కళలతో కూడుకున్న అందమైన ఆలయాలూ, నేటి metropolitan సిటీలను కూడా తలదన్నే ఇంజనీరింగ్ ప్రతిభతో నిర్మించిన నగరాలూ, వర్తక వ్యాపారాలూ, ప్రాచీన కళలతో మన హిందూ ధర్మం పాదం మోపిన ప్రతి చోట, దేదీప్యమానంగా వెలుగొందింది. అయితే, స్వార్ధపూరిత, మానవస్థాపిత కొత్త మతాల పుట్టుక మనుషులలో క్రూరత్వాన్ని నింపడమే కాకుండా, ఎంతో అద్భుతమైన మన సనాతన ధర్మాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తూనే ఉంది. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో దాదాపు తుడిచి పెట్టేసింది. అందుకు నేటికీ మన కళ్ల ముందు ప్రత్యక్షంగా కనిపిస్తున్న ఆఫ్ఘనిస్థాన్ ని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఒకప్పుడు సనాతన ధర్మం పరిఢవిల్లిన ఆ ప్రాంతం, ఇప్పుడు ఎందుకని ఎడారి మతం పాలైంది? ఒకప్పుడు అద్భుతమైన శిల్ప సంపదకూ, ఆమోఘమైన ఆలయాలకూ, రాజ ప్రసాదాలకూ అలవాలమైన ఆఫ్ఘనిస్థాన్, నేడు మట్టి దిబ్బల నిలయంగా ఎందుకు మారిపోయింది? ఎంతో ఘనమైన సనాతన సంస్కృతి వెలుగొందిన ఆఫ్ఘనిస్థాన్ నుంచి హిందూ ధర్మం పూర్తిగా ఎలా తుడిచిపెట్టుకు పోయిందనే సందేహాలు కలుగుతాయి. వాటి వెనుక ఉన్న అసలు సంఘటనలను తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/uKbb2uF8UM0 ]
మన పురాణాలనూ, ఇప్పుడిప్పుడే నేటి పరిశోధకులు వెలికి తీస్తున్న మన ప్రాచీన చరిత్రనూ పరిశీలిస్తే, ఒకప్పుడు యావత్ ప్రపంచం మన సనాతన ధర్మం దేదీప్యమానంగా పరిఢవిల్లిందని తెలుస్తోంది. అటువంటి ప్రదేశాలలో ఆఫ్ఘనిస్థాన్ అత్యంత ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ దేశం పేరు వినగానే, పురాణాలలో చెప్పబడిన రాక్షల వంటి తాలిబన్ మూకలూ, లోయ ప్రాంతాలలో కాలం వెళ్ళ దీస్తున్న ఇస్లామిక్ ట్రైబల్స్, ఎటు చూసినా మట్టి దిబ్బలూ కనిపిస్తూ, తుపాకీ మోతలూ, అమాయక ప్రజల ఆర్తనాదాలూ మాత్రమే వినిపిస్తున్నాయి. కానీ, కొన్ని యుగాలకు పూర్వం, ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉండేదక్కడ. ప్రపంచంలోనే అతి పెద్ద శివాలయాలూ, ఉన్నత శ్రేణి వర్తక వ్యాపార ప్రదేశాలూ, భారీ రాజ భవనాలూ, ఎంతో వైభవంగా కనువిందుజేసేవి. అక్కడి రాజులు ఎంత ఆధ్యాత్మిక పరులంటే, తమ నాణాలపై కూడా ఆ శివయ్య ముఖచిత్రాన్నీ, శివ లింగ ప్రతిమనూ ముద్రించుకునే వారు. మరి అలాంటి ప్రదేశం నేడు ఉన్న పరిస్థితికి ఎలా దిగజారిందో తెలియాలంటే, మహా భారత కాలానికంటే ముందూ, రామావతారం కూడా పురుడు పోసుకోక ముందు నుంచి నేటి వరకు ఏం జరిగిందో, సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.
ఆది నుంచి ప్రపంచ వ్యాప్తంగా సనాతన ధర్మం యొక్క ఆనవాళ్ళు స్పష్టంగా ఉండేవి. అందులో నేడు ఆఫ్ఘనిస్థాన్ గా పిలుచుకుంటున్న ప్రదేశంలో, సనాతన ధర్మం మరింత ఉత్కృష్టమైనదిగా ఉండేదని తెలుస్తోంది. నేడక్కడున్న కొన్ని తెగలవారు, త్రేతాయుగంలో జరిగిన కొన్ని సంఘటనలకు సాక్ష్యాలుగా నిలుస్తున్నారు. రాముడి సోదరులైన భరతుడు, శత్రుఘ్నుడు, రాజ్య విస్తరణలో భాగంగా, మధ్య ఆసియా, ఈజిప్ట్ ప్రాంతాల వరకు వెళ్లారు. ఆ ప్రదేశాలలో తమ రాజ్యాలను స్థాపించారు. ఒకప్పుడు ఈజిప్ట్ ను పాలించిన ఫారో రాజులు కూడా, రాములవారి చిన్న తమ్ముడైన శత్రుఘ్నుడి వంశస్థులే అని, చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మనం ఆఫ్ఘనిస్థాన్ గురించి మాట్లాడకుంటున్నాం కాబట్టి, ఈజిప్ట్ గురించి మరో సందర్భంలో తెలుసుకుందాము.
ఇక రామావతారం ముగిసిన చాలా ఏళ్ల తర్వాత, ద్వాపర యుగం మొదలయ్యే సమయంలో, మన భరత ఖండంపై కురుక్షేత్ర యుద్ధం వంటి మరో భారీ యుద్ధం జరిగింది. అదే ‘దశరాజ్ఞ యుద్ధం’గా ఋగ్వేదంలో పేర్కొనబడింది. ఆ యుద్ధాన్నే ఆధునిక చరిత్రకారులు, Battle of The Ten Kings అనే పేరుతో, ఆంగ్లంలో కొన్ని పుస్తకాలను ప్రచురించి, ప్రపంచ వ్యాప్తంగా ఆ ఘన చరిత్రకు మంచి గుర్తింపు తీసుకు వచ్చారు. నాడు జరిగిన ఆ యుద్ధంలో, భరత వంశానికి చెందిన సామ్రాట్ సుదాసుడూ అతని మద్దతుదారులతో కలిపి, మరి కొంతమంది ట్రైబల్ రాజులు పాలుపంచుకున్నారు. ఆ భయంకర యుద్ధంలో సుదాసుడి వర్గం గెలవడంతో, ఓడిపోయిన తెగల రాజులలో కొంతమంది మన దేశంలోనే ఉండిపోయినా, కొంతమంది రాజులు నేడు ఉన్న భారత ప్రాంతాన్ని వదిలి, సుదూర ప్రాంతాలకు వెళ్లిపోయారు. అలా వెళ్ళిన వారిలో, Pakhta, Bhalana, Druhyu వంటి తెగలవారు ముఖ్యం.
వీరిలో ముఖ్యంగా చెప్పుకునే తెగ, నేడు ఉన్న ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ వరకు, చాలా ప్రాంతాలలో నేటికీ మనుగడలో ఉన్న తెగ, Pakhta తెగ. వీరినే నేటి కాలంలో Pactyan తెగగా పిలుస్తున్నారు. ఇక Bhalana తెగ, నేడు పాకిస్తాన్ నుంచి విముక్తి కోసం పోరాడుతున్న బలూచిస్థాన్ తెగగా మారిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, వీరిలో అతి ముఖ్యమైన తెగగా, దృహ్యు తెగను చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఎందుకంటే, వీరివల్లనే గాంధార రాజ్యం ఏర్పడిందని చరిత్ర తెలియజేస్తోంది.
ఈ పేరు వినగానే, మనకు మరో విషయం గుర్తుకు వస్తుంది. మహా భారత కాలంలో కౌరవుల తల్లి అయిన గాంధారి, ఈ దృహ్యు వంశానికి చెందిన మహిళ. దృహ్యు తెగకు చెందిన రాజులు, నేడు ఉన్న ఆఫ్ఘనిస్థాన్ ప్రాంతంలోనే గాంధార రాజ్యాన్ని నెలకొల్పారు. సంస్కృతంలో ‘గాంధార’ అనే పదానికి, The land of Fragrance అని అర్ధం. ఆ కాలంలో గాంధార రాజ్యం, ఈనాటి చైనా యూరోప్ లను కలిపే సిల్క్ రూట్ కి మధ్యలో ఉన్న అతిపెద్ద మార్కెట్ గా ఉండేది. ఇక్కడి నుంచే మన దేశంలో దొరికే ఎర్ర చందనం నుంచి, యాలుకలు, మిరియాల వంటి మసాలా దీనుసుల వరకు, సమస్తం ఇతర ప్రాంతాలకు ఎగుమతి అయ్యేవనీ, అందుచేత ఆ ప్రాంతం మొత్తం సువాసనలతో నిండి ఉండేదనీ, అందుకే ఆ రాజ్యానికి గాంధార రాజ్యం అనే పేరు వచ్చిందనీ చరిత్రకారులు చెబుతున్నారు.
అంతేకాదు, గాంధార రాజ్యం అద్భుతమైన శిల్ప సంపదకూ, కళలకూ ఆలవాలంగా ఉండేది. సంస్కృత భాషపై ఎంతో పరిశోధన చేసి, నేటికీ ఆ భాష బ్రతికి ఉండటానికి కారణమైన మహానుభావులలో ఒకరైన, ఆచార్య పాణిని కూడా ఈ గాంధార రాజ్యానికి చెందిన వ్యక్తే అని, చరిత్ర చెబుతోంది. దృహ్యు వంశానికి చెందిన రాజులు మహా శివ భక్తులవ్వడంతో, ఆ ప్రాంతమంతా ఎన్నో అద్భుతమైన శివాలయాలను నిర్మించారు.
ఇక గౌతమ బుద్ధుడి రాక ఆనంతరం, ఆసియాలోని చాలా ప్రాంతాలకు బౌద్ధ ధర్మం మెల్ల మెల్లగా వ్యాపించడం మొదలు పెట్టింది. ముఖ్యంగా అశోక చక్రవర్తి, కళింగ యుద్ధం తర్వాత బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి, ఆ ధర్మ వ్యాప్తికి విశేషంగా కృషి చేయడం వల్లనే, నేడు ఆసియాలోని అనేక దేశాలలో బౌద్ధ మతం బాగా వ్యాప్తి చెందినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఆ విధంగా బుద్ధిజం అనేది ఆఫ్ఘనిస్థాన్ ప్రాంతానికి కూడా పాకడం జరిగింది.
గౌతమ బుద్ధుడి సమయానికి కలియుగం ఆరంభమై ఉంది. ఇక అశోకుడి సమయంలో హిందూత్వం నుంచి బౌద్ధ మతం పుట్టినట్లు, మధ్య ఆసియా వంటి అనేక ప్రాంతాలలో, Babylonian, Sumerian వంటి అనేక నాగరికతలు పుట్టుకొచ్చాయి. ఈ మతాల వారు మన దేవుళ్ళకే, అక్కడి స్థానిక భాషలలోని పేర్లను మార్చుకుని పూజించడం మొదలు పెట్టారు. అందుకే హైందవ ధర్మ మూలం వారిలో అలాగే ఉండిపోయింది. అయితే, Alexander కారణంగా Babylonia మహా సమారాజ్యం నాశనం అవ్వడంతో, ఆ ప్రాంతంలో ఉన్న రాజ్యాలన్నీ చిన్న చిన్న ట్రైబల్ రాజ్యాలుగా మారిపోయాయి. దాంతో అబ్రహామిక్ మతాలు విస్తరించడానికి అనువైన అవకాశం ఏర్పడిందని చెప్పవచ్చు. ఇక అశోకుడి కాలానికి, నేడు ఉన్న సౌదీ, ఇరాక్, ఇరాన్ వంటి అనేక ప్రాంతాలలో, అబ్రహామిక్ మతాల విజృంభణ కాస్త ఎక్కువగానే ఉండిందని చెప్పాలి. అయినా అక్కడి ప్రజలలో సనాతన ధర్మానికి చెందిన వాసనలు పోలేదు.
ఇదిలా ఉంటే, అశోకుడి కాలంలో, ఆఫ్ఘనిస్థాన్ లో బౌద్ధ ధర్మం బలంగా విస్తరించడంతో, అక్కడున్న రాజులు, ప్రజలు, ఇరు మతాలనూ సొంతం చేసుకుని, రెండు మతాల కలయికతో జీవించారు. ఇక మొదటి శతాబ్దంలో కుషాణుల రాకతో, అఖండ భారత చరిత్రలో మరో అధ్యాయం మొదలైంది. వారిలో ప్రముఖుడైన కనిష్క చక్రవర్తి, గాంధార రాజ్యం గొప్పదనాన్ని మరో స్థాయికి తీసుకువెళ్ళినట్లు చరిత్ర చెబుతోంది. ఆయన కూడా బౌద్ధ ధర్మాన్ని బలంగా నమ్మేవాడైనా, హైందవ ధర్మ విలువలను కాపాడటానికీ, హిందూ ధర్మ అభివృద్ధికీ ఎంతగానో పాటు పడ్డాడు. దానితో ఆఫ్ఘనిస్థాన్ వ్యాప్తంగా ఎన్నో బౌద్ధ క్షేత్రాలతో పాటు, హిందూ ఆలయాలు కూడా వెలిశాయి. ఆ సమయంలో హిందూ ఆధ్యాత్మిక రూపాలను యూరోపియన్ శైలిలో చెక్కించి, గాంధార శిల్ప కళను మరో స్థాయికి తీసుకెళ్ళారు.
కాలగమనంలో ఎంతో మంది రాజులు ఆఫ్ఘనిస్థాన్ ని ఏలారు. ఎన్నో వంశాలు మారాయి. వారందరూ ఆఫ్ఘనిస్థాన్ లో హిందూ ధర్మ పరిరక్షణకు ఎన్నో చర్యలు తీసుకున్నారు. శివుడు, విష్ణువులకు సంబంధించిన పెద్ద పెద్ద ఆలయాలను కట్టించడం, నాణాలపై ఆ ప్రతిమలను ముద్రించి చలామణీ చేయడం, ఇలా ఎన్నో సంస్కరణలు చేశారు. కానీ, ఇది కలికాలం.. ధర్మాన్ని నాశనం చేయడానికి కొత్త కొత్త అధర్మ శక్తులు పుట్టుకొస్తాయని, మన వేదాలలో ఏనాడో చెప్పబడింది. ఆ విధంగానే 7వ శతాబ్దం నాటికి, ఇస్లాం మతానికి చెందిన దూరాక్రమణ దారులు అఖండ భారతావని పై దాడులు చేయడం మొదలు పెట్టారు. ఆ దాడులను, అప్పట్లో ఆఫ్ఘనిస్థాన్ ను పాలిస్తున్న షాహీ హిందూ రాజైన ఖింగిలా వీరోచితంగా ఎదిరించి పోరాడి, వారిని ఓడించి వెనక్కి పంపించాడు. అయితే ఈ టర్కీ దూరాక్రమణదారుల ఆక్రమణలు పేరుగుతాయని భావించిన నాటి రాజులు, ఆలయాలను సైతం కోటల్లా మార్చి, శత్రువులపై దాడి చేయడానికి అనువైన ప్రదేశాలుగా ఏర్పాటు చేసుకున్నారు.
ముహమ్మద్ ఘజిని తండ్రి సబుక్తిజిన్ ఘజిని, అప్పట్లో హిందూ రాజ్యాలుగా ఉన్న Uzbekistan, ఆఫ్ఘనిస్థాన్ ల పై ఎన్నో దాడులు చేశాడు. వాటిలో కొంతవరకు మాత్రమే విజయం సాధించాడు. ఇక ముహమ్మద్ ఘజిని ఆఫ్ఘనిస్థాన్ వరకూ, అన్ని ప్రాంతాలలో హిందూ ధర్మం జాడలను దాదాపుగా తుడిచేసి, కొన్ని లక్షల మందిని చంపి రక్తపుటేరులు పారించినట్లు చరిత్ర విదితం. కోట్లాది మందిని బలవంతంగా మతం మార్చారు. ఈ క్రమంలో అక్కడున్న ప్రతి హిందూ ఆలయాన్నీ పూర్తిగా నెలమట్టం చేశారు. కొన్ని ఆలయాలను ఆక్రమించుకుని మసీదులుగా మార్చారు. మరికొన్నింటిని భారతీయ ఆలయాలనుండి దోచుకున్న సంపదతో నిర్మించారు. అలాంటి వాటిలో నేడు ఆఫ్ఘనిస్థాన్ లోని కాబూల్ లో అతి పెద్దదయిన Pul-e Khishti Masjid ను చెప్పుకోవాలి. 1756 లో మథుర శ్రీకృష్ణ మందిరాన్నీ, 1762 లో అమృత్సర్ పై దాడి చేసి స్వర్ణ దేవాలయాన్నీ దోచుకున్న సంపదతో, 18వ శతాబ్దం చివరలో దీనిని కట్టడం జరిగినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఇలా ఒకప్పుడు ఎంతో ఘనమైన హైందవ సామ్రాజ్యంగా వెలుగొందిన ఆఫ్ఘనిస్థాన్ ప్రాంతం, నేడు మట్టి దిబ్బల నిలయంగా, తీవ్రవాదులకు ఆవాసంగా మారిపోయింది. దోచుకున్న ఆలయాల నిధులతో నిర్మించబడిన దేశం కాలక్రమేణా నాశనం అవుతుందనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇదే కోవలో ఉన్న ఆ మిగతా దేశాలేమిటో మీరే ఆలోచించి కామెంట్ చేయండి.
🚩 జై భారత్ 🚩 జై హింద్ 🚩 జై భవాని 🙏
Comments
Post a Comment