మంత్ర రాజం Mantra Rajam
మంత్ర రాజం: నమః శివాయ.. సాంబాయ.. శాంతాయ.. పరమాత్మనే!
'సాంబా' అని పిలిస్తే చాలు.. శివుడు వెంటనే కరిగిపోతాడు.
మహాభారతంలో ఉపమన్యు మహర్షి శ్రీకృష్ణ పరమాత్మకి శివదీక్ష ఇస్తూ...
”నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే...
య ఇదం కీర్తయేన్నిత్యం శివసాయుజ్యమాప్నుయాత్” అనే మంత్రాన్ని ఉపదేశించారు.
చాలా గొప్పదయిన ఈ మంత్రం, శివపురాణంలో కూడా వస్తుంది.
నమః శివాయ.. సాంబాయ.. శాంతాయ.. పరమాత్మనే..
ఈ నాలుగు నామాలలో అత్యద్భుతమైన శక్తి ఉంది.
1). నమః శివాయ...
(శివాయ నమః) మహాపంచాక్షరీ మంత్రం.
శివ భక్తులకు నిరంతర జప్యమైన పంచాక్షరీ మంత్ర మహిమను శాస్త్రాలు పలు విధాలుగా వర్ణించాయి.
అ, ఉ, మ, బిందు, నాద అనే పంచ అవయవాలతో కూడిన ఓంకారం సూక్ష్మ ప్రణవం.. న, మ, శి, వా, య అనే అయిదు అక్షరాల శివ మంత్రం స్ధూల ప్రణవం. పంచాక్షరిని పఠిస్తే పరమేశ్వర అనుగ్రహం సిద్ధిస్తుంది.
2). సాంబాయ...
అమ్మతో ఉన్నవాడు. ఇలా పిలిస్తే చాలు శివుడు వెంటనే కరిగిపోతాడు. అమ్మతో ఉన్నవాడు అనగానే పరమేశ్వరుని దయ వేరు. అమ్మ అయ్యలతో కలిపి భావిస్తే కావలసినవి అన్నీ సమృద్ధిగా పొంద వచ్చును.
3). శాంతాయ...
ఆయనను తలంచుకుంటే వచ్చేది శాంతం. జీవితానికి కావలసింది కూడా శాంతమే.
"ప్రపంచోప శమం శాంతం అద్వైతం మన్యంతే" అని ఉపనిషత్తు చెప్పింది. అలజడులు అన్నీ అణగిన తరువాత వచ్చే శాంతం అది.
4). పరమాత్మనే నమః...
చిట్ట చివరికి పొందవలసినది పరమాత్మ తత్త్వమే... అన్నిటినీ కలిపి నాలుగు నామాలతో పొదిగిన 'మంత్ర రాజం' ఈ శ్లోకం..!
Watch Shiva Parivaram Series: https://www.youtube.com/playlist?list=PLNoNQLGbZ7gaHFlfr9ViR4CpQnVhsH3IK
Comments
Post a Comment