Vasuki indicus is the NEW KING of snakes! | నాగుల రారాజు!
నాగుల రారాజు!
ఈ సృష్టిలో నీలి తిమింగలాల పుట్టుకకు వాసుకీ సర్పమే కారణమా?
పురాణ, ఐతిహాసిక కాలం నుంచీ ఇప్పటి వరకూ భూమిపై తిరుగాడిన జీవులలో ఎవ్వరికీ అంతుబట్టని జీవులుగా పాములకు ప్రత్యేక స్థానం ఉంది. యుగ యుగాలుగా పాములకు సంబంధించిన ఎన్నో కథలూ కథనాలూ, ఎప్పటికప్పుడు మనలో ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా అత్యంత భారీ సర్పాలు ఎక్కడున్నాయనే ప్రశ్నకు సమాధానం కోసం మానవులు నేటికీ అన్వేషిస్తూనే ఉన్నారు. ఆ అన్వేషణలో భాగంగా, పూర్వం మన భూమిపై అతిపెద్ద పాములు ఉండేవనీ, వాటిలో దక్షిణ అమెరికాలో కనిపెట్టబడిన Titanoboa అనే పాములు కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం ఉండేవనీ, అవి భారీ డైనోసార్లను సైతం చంపి తినేసేవనీ కనుగొన్నారు. దానిని బట్టి అవి ఎంత భారీ పరిమాణంలో ఉండేవో ఊహించుకోవచ్చు. అయితే, మానవ జాతి పుట్టుకకు ముందే, వాసుకి అనే భారీ సర్పం అప్పటి మన భారత భూభాగంపై తిరుగాడిందనీ, అది Titanoboa కంటే అతి పెద్ద పామనీ, అసలు నాగ జాతిలో ఇదే అతి పెద్ద పాము కావడంతో, దానిని రాజనాగం అని పిలుస్తారనీ తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇదే క్రమంలో మొన్నీ మధ్య బ్రెజిల్ లో కనిపించిన భారీ అనకొండా శాస్త్రవేత్తల ఫ్యూజులు ఎగరగొడితే, అసలు ప్రస్తుతం భూమిపై అత్యంత భారీ జీవి అయిన నీలి తిమింగలం పుట్టుకకు మన వాసుకీ సర్పమే కారణమని తాజాగా వైజ్ఞానికులు చెబుతుండడం ఆశ్చర్య జనకంగా మారింది. అసలు వాసుకీ సర్పమేమిటి, బ్రెజిల్ లో కడబడిన అనకొండాను చూసి శాస్త్రవేత్తలు ఎందుకు షాక్ అయ్యారు..? బ్లూ వేల్ పుట్టుకకు వాసుకీ సర్పం కారణమని ఎందుకంటున్నారు? మన పురాణాలలో పేర్కొనబడిన శివుడి మెడలోని వాసుకీ సర్పం, భగవద్గీతలో శ్రీకృష్ణుడు నాగులలో వాసుకి తానే అని పేర్కొన్న ఆ వాసుకీ, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వాసుకీ ఒకటేనా..? వంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు తేలియాలంటే, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి, మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/728MycSjBq0 ]
ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన వర్షారణ్యం ‘అమెజాన్’ అన్న విషయం మనందరకీ తెలిసిందే. దాదాపు దక్షిణ అమెరికా ఖండంలో సగానికి పైగా విస్తరించి ఉన్న ఈ అరణ్యాలు, నేటికీ అంతుచిక్కని ఎన్నో రహస్యాలకు నెలవుగా పేరుగాంచాయి. ప్రపంచంలో మరెక్కడా కనిపించని ఎన్నో రకాల వృక్ష సంపద నుంచి వింత వింత జీవుల వరకు అమెజాన్ ఆడవులలోనే కనిపిస్తాయి. అటువంటి వాటిలో ప్రస్తుతం భూమిపై అతిపెద్ద పాములుగా పిలవబడుతున్న అనకొండలు కూడా ఉన్నాయి. హాలీవుడ్ లో వచ్చిన పలు సినిమాల కారణంగా, అనకొండలు అత్యంత భారీ పాములనీ, అవి మనుషులను సైతం అవలీలగా మింగేస్తాయనీ మనలో చాలా మంది భావిస్తారు. నిజానికి ఇందులో సగమే వాస్తవముంది. ప్రస్తుత ప్రపంచంలో అవే అతిపెద్ద పాములయినా కానీ, మనుషులను తింటాయనడానికి ఎటువంటి ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే, ఇప్పటి వరకు అనకొండాలు 30 అడుగుల వరకు పేరుగుతాయని అందరూ భావించారు. అయితే, ఇప్పటి వరకు కనపడ్డ అనకొండాలలో, 2024లో నేషనల్ జియోగ్రఫి ఛానల్ వారు చేసిన ఒక పరిశోధన ద్వారా, దక్షిణ అమెరికా ఖండంలో ఉన్న Costa Rica అనే దేశంలో, 26 అడుగుల అనకొండాను కనుగొన్నారు. దానితో అఫిషియల్ గా ఇప్పటి వరకు కనిపించిన అనకొండాలలో అదే అతిపెద్ద పామని చెప్పుకోవాలి. కానీ, 2025 మార్చి నెలలో, బ్రెజిల్ లోని ఒక భారీ సరస్సు వద్ద సేద తీరుతున్న టూరిస్టులకు, అవతాలి గట్టుపై దేనినో తిని కదలలేకపోతున్న భారీ అనకొండా ఒకటి కనిపించింది. దానితో వారు ఆ పామును వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా, అది క్షణాలలో వైరల్ గా మారిపోయింది. అందుకు కారణం దాని సైజ్. అంతకు ముందు నేషనల్ జియోగ్రఫీ వాళ్ళు ఎంతో కష్టపడి తెచ్చిన ఆధారాల ప్రకారం, 26 అడుగుల అనకొండానే అతిపెద్దదని అందరూ భావిస్తున్న తరుణంలో, అనుకోకుండా జనాలకు కనిపించిన అనకొండ సైజు ఇంచుమించు 34 నుంచి 36 అడుగుల వరకు ఉంటుందనే అంచనాకి వచ్చారు. అమెజాన్ అడవులలో ఇంకా భారీ సైజ్ అనకొండాలు ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఆ ఆడవులను ఎవరూ పూర్తిగా శోధించలేకపోయారు. ఇంకా చెప్పాలంటే, ఇప్పటి వరకు మనకు అమెజాన్ అడవుల గురించి తెలిసింది 30 శాతం మాత్రమే. అందువలన అక్కడ మరింత పెద్ద పాములు ఉండే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో ఒక ఆసక్తికరమైన విషయం శాస్త్రవేత్తల ద్వారా బయటకు వచ్చింది. అదే, బ్లూ వేల్స్ పుట్టుకకు కారణం మన వాసుకీ పామని. ఎన్నో ఏళ్లుగా మన శాస్త్రవేత్తలు భూమిపై నివసించిన అతి పెద్ద పాము గురించి పరిశోధనలు చేస్తూ వస్తున్నారు. దక్షిణ అమెరికాలోని కొలంబియా దేశంలో, Titanoboa అనే పాము అవశేషాలు కనుగొన్నారు. ఇది దాదాపు 42 అడుగుల పొడవు ఉండేదనీ, ఇంచుమించు 50 నుంచి 60 మిలియన్ సంవత్సరాల క్రితం బ్రతికి ఉండేదనీ శాస్త్రవేత్తలు తెలియజేశారు. 2024 వరకు కూడా అదే భూమిపై నివశించిన అతిపెద్ద పామని అందరూ భావించారు. కానీ, శాస్త్రవేత్తల అంచనాలను తలక్రిందులు చేస్తూ, వాసుకి ముందుకు వచ్చింది. మన భారత దేశంలోని గుజరాత్ రాష్ట్రంలోగల Panadhro అనే గ్రామానికి దగ్గరలో ఉన్న ఒక మైనింగ్ ఏరియాలో, వాసుకి అవశేషాలను కనుగొన్నారు.
2005లోనే వాసుకి సర్పం ఎముకలను కనుగొన్నా, చాలా ఏళ్లు అవి ఏదో భారీ జంతువుకు సంబంధించిన అవశేషాలని మనవారు భావించారు. దానితో వాటిని పెద్దగా పట్టించుకోలేదు. 2020 తర్వాత మళ్ళీ ఆ ఎముకలపై పరిశోధనలు మొదలుపెట్టి, అవి ఒక పాముకు సంబంధించినవనీ, ఇంచుమించు 56 మిలియన్ సమవత్సరాల క్రితం అది మన భారత భూగంలోని అడవులను ఏలిన రారాజనీ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. దానికి Vasuki indicus అనే పేరు పెట్టి, అప్పటి వరకు అతి పెద్ద పాముగా పేరొందిన Titanoboa కంటే ఇది ఇంకా పెద్ద పామనీ, దీని పొడవు ఏకంగా 50 అడుగులనే వివరాలను తెలియ చేసి ప్రపంచం మొత్తాన్నీ ఆశ్చర్య పరిచారు.
ఈ వార్త బయటకి వచ్చినప్పటి నుంచీ అది ప్రపంచ వ్యాప్తంగా దావానలంలా వ్యాపించి, అందరనీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫేమస్ పత్రికలలో, Vasuki indicus గురించిన వార్త ప్రధాన శీర్షికగా ముద్రితమయ్యింది. విదేశీయులు ఇదో గొప్ప విషయంగా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. అంతేకాదు, దాని గురించి పూర్తి సమాచారం కోసం వెతుకులాట కూడా మొదలు పెట్టారు.
అయితే, వాసుకి అనే పేరు పెట్టగానే మన వారికి వెంటనే మన పురాణాలలో పేర్కొనబడినట్లుగా, శివుడి మెడలో ఆభరణంగా నిలిచిన వాసుకి సర్పం, భగవద్గీతలో స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు పేర్కొన్న వాసుకీ, ఇదీ ఒకటేనా అనే సందేహం చాలామందిలో మెదిలింది. ఒకప్పుడు మన పురాణాలలో వర్ణించబడిన భారీ సర్పాలైన వాసుకీ, ఆది శేషుడి వంటి సర్ప రాజుల గురించి మనం చెప్పుకుంటుంటే విని, నిజంగా అంత పెద్ద పాములు ఉంటాయా అని వెటకరిస్తూ మాట్లాడిన కుహనా మేధావుల నోళ్ళు, ఇప్పుడు బయటపడ్డ వాసుకీ సర్పం అవశేషాలను చూసి టక్కున మూతబడ్డాయి. అయితే మన పురాణ, ఇతిహాసాలపై పరిశోధనలు చేస్తున్న కొంతమంది నిపుణులు, శివుడి ఆభరణమైన వాసుకికీ, ఈ పాముకూ సంబంధం లేదని వెంటనే తేల్చి చెప్పేశారు. అందుకు కారణం, మన పురాణాలలో ప్రస్థావించబడిన వాసుకి ఒక దేవతా సర్పం, నాగుల రారాజు. పురాణ వర్ణన ప్రకారం ఆ సర్పాకారం ఎంత పెద్దదంటే, ఏకంగా ఒక పర్వతాన్నే చుట్టి లాగేంత. ఈ విషయాన్ని నిరూపించే కృత యుగం నాటి క్షీరసాగర మధనం గురించి ప్రతి హిందువుకూ తెలిసినదే. ఆనాడు శివుడి మెడలో ఉన్న పామును మంధర పర్వతానికి చుట్టి దేవ దానవులు అమృతం కోసం చిలికిన దానిని బట్టే, వాసుకి ఆకారం ఎంత పెద్దదో అర్ధం చేసుకోవచ్చు. అందుకే ఆ వాసుకికీ, ఇప్పుడు కనుగొన్న 50 అడుగుల Vasuki indicus కీ ఎటువంటి సంబంధమూ లేదనీ, కేవలం మన పురాణాల inspiration తో ఈ భారీ సర్పానికి Vasuki indicus అనే పేరు పెట్టారనీ తెలుస్తోంది.
ఇదిలా ఉంటే డైనోసార్లను సైతం మింగేయగలిగేంత పెద్ద పాము కావడంతో, శాస్త్రవేత్తలు దీనిపై సునిశితంగా పరిశోధనలు చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో అది ఏ కాలం నాటిది, అంత పెద్ద పాము మన దేశంలో ఎలా పుట్టింది, అది ఇక్కడ ఎలా ఉండేది, ఏ విధమైన ఆహారం తీసుకునేది వంటి వివరాలు ఆ పరిశోధనలలో బయటపడ్డాయి. దాదాపు 60 నుంచి 65 కోట్ల సంవత్సరాల క్రితం, ఈ భూ ప్రపంచం ఇప్పుడున్నట్లు ఉండేది కాదు. ఆ కాలంలో ఇప్పుడున్న ఖండాలన్నీ ఒకే చోట, ఒకే భాగంగా, ఒక super continent గా ఉండేది. దానినే శాస్త్రవేత్తలు Gondwana Continent అని పిలుస్తున్నారు. ఆ సమయంలో భూమిపై ఎన్నో రకాల జీవరాశుల పుట్టుక ఆరంభమయ్యింది. క్రమేపీ అవి పెద్దగా మారి డైనోసార్ల వంటి జీవులుగా మారాయి. ఆ క్రమంలోనే భూమిపై మొదటిసారి పాము జాతి కూడా పుట్టినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ కాలంలో డైనోసార్ల లాగానే పాములు కూడా చాలా పెద్దవిగా ఉండేవి. అలా మొదలైన భారీ సర్పాలకు శాస్త్రవేత్తలు పెట్టిన పేరు Madtsoiidae. ఇప్పటి వరకూ భూమిపై బయటపడిన భారీ పాములన్నీ ఈ Madtsoiidae జాతికి చెందినవే అనీ, Vasuki indicus కూడా అదే జాతికి చెందిన పామనీ నిపుణులు చెబుతున్నారు. ఈ జాతి పాములన్నీ భారీగా పెరగడం, విషం లేకపోవడం, ఆహారాన్ని వేటాడి, దానిని బలంగా చుట్టుకుని, శరీరంలో ఉన్న ఎముకలన్నీ విరిగిపోయేలా చేసి, ఒక్కసారిగా మిగేయడం వంటి లక్షణాలు కలిగి ఉంటాయి. Vasuki indicus, Titanoboa కూడా అటువంటి లక్షణాలు కలిగిన పాములే.
అయితే, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కేవలం మన దేశంలోనే ఈ Vasuki indicus లను కనుగొనడానికి కూడా ఓ బలమైన కారణం ఉంది. ఒకప్పుడు super continent గా ఉన్న ఈ భూగోళం, తరువాతి కాలంలో క్రమేపీ tectonic plates కదలికలవల్ల వివిధ ఖండాలుగా విడిపోయింది. ఈ పరిణామ క్రమంలో దాదాపు 4 నుంచి 5 కోట్ల సంవత్సరాలకు పూర్వం అన్ని ఖండాలూ పూర్తిగా విడిపోయి, ఇప్పుడున్న ప్రపంచానికి కాస్త దగ్గర పోలికకు చేరింది. ఆ సమయాన్ని Paleocene Time Period అని అంటున్నారు. అయితే ఆ సమయంలో మన భారత భూభాగం ఇప్పుడున్న హిందూ మహా సముద్రంలో ఒక దీవిలా ఉండేది. అది మెల్ల మెల్లగా ఆసియా ఖండంవైపు కదులుతూ వచ్చింది. అందుకే మన దేశాన్ని Indian subcontinent అని పిలుస్తారు.
అలా super continent కాలం నాటి చాలా జీవులు అంతరించిపోగా, కొన్ని జీవులు మాత్రం కాలమాన పరిస్థితులను బట్టి క్రమేపీ తమ రూపాలను మార్చుకుని జీవించడం మొదలు పెట్టాయి. ఆ విధంగా పుట్టుకొచ్చిన సర్పమే ఈ Vasuki indicus. సాధారణంగా పాములు cold blooded creatures అని అందరికీ తెలిసిందే. అందుకే ఇవి కాస్త వేడిగా ఉండే ప్రదేశాలలో తమ ఆవాసాలను ఏర్పాటు చేసుకుంటాయి. అందులోనూ Madtsoiidae జాతికి చెందిన పాములకు వేడి వాతావరణంలో ఉండే అలవాటుతోపాటు, దొరికిన ఆహారాన్ని బట్టి తమ ఆకారాన్ని మరింతగా పెంచుకునే అవకాశం ఉండేది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, మన దేశం ఒక దీవిగా ఉన్న కాలంలో, ఇక్కడ ఉష్ణోగ్రతలు 60 నుంచి 90 డిగ్రీల వరకు ఉండి, వర్షారణ్యాలు ఎక్కువగా ఉండేవి. దానితో పాటు ఆ కాలంలో ఏనుగుల జాతికి మూలమైన gomphothere జాతి జంతువులు మన దేశంలో ఉండేవి. వాటికి ఇప్పుడున్న ఏనుగులలాగా తొండం ఉండేది కాదు. అటువంటి భారీ ఆకారాలను తినడానికి, తమ సైజ్ కూడా భారీగా ఉండాలి కాబట్టి, Vasuki indicus ల రూపం భారీగా మారిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఇక బ్లూ వేల్ పుట్టుకకు వాసుకీ సర్పమే కారణం ఎందుకయ్యిందనే విషయానికి వస్తే, Vasuki indicus లు భారీ జీవులను ఆహారంగా తీసుకున్నప్పటికీ, వాటికి అత్యంత ప్రియమైన ఆహారం మాత్రం Indohyus. ఇవి దాదాపు నాలుగున్నర కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై తిరుగాడిన ఓ జంతు జాతి. అవి చూడటానికి ఇప్పుడున్న చిరుతపులి సైజులో ఉండేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ Indohyus లు చిన్న చిన్న జంతువులను వేటాడి తిన్నప్పటికీ, వాటికి ప్రియమైన ఆహారం మాత్రం చేపలు. అందుకే అవి ఎక్కువగా నదులు, చెరువులు, సముద్ర ప్రాంతాలలో నివసించేవి. చేపల మీద మక్కువ కారణంగా అవి ఎక్కువ సమయం నీటిలోనే ఉండేవి. అలా అవి ఎక్కువగా నీటిలోనే ఉండటానికి మరో ముఖ్య కారణం, Vasuki indicus లకు ఆహారంగా మారకుండా తప్పించుకోవడం. ఈ Indohyus లు చిన్నవిగా, వేటాడటానికి సులువుగా ఉండటంతో, Vasuki indicus పాములు వీటినే ఎక్కువగా వేటాడి తినేవి. అందుకే ఆ భారీ సర్పాల బారి నుంచి తమను తాము రక్షించుకోడానికి ఈ Indohyus జీవులు నీటిలో దాక్కునేవి.
అలా కాలగమనంలో Indohyus జీవులు సముద్ర జలాలకు బాగా అలవాటుపడి, అందులోనే జీవించడం మొదలు పెట్టాయి. అలా కాలక్రమేణా వాటి ఆకారం కూడా రూపాంతరం చెందుతూ, దాదాపు నాలబై లక్షల సంవత్సరాలు గడిచేసరికి, ఇప్పుడు మనం చూస్తున్న నీలి తిమింగలాలుగా మారాయి. ఇప్పటికీ కొన్ని తిమింగలాలను పరిశోధిస్తే వాటి శరీరం వెనుక భాగంలో కాళ్ళ వంటి ఎముకలు కనిపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ విధంగా Vasuki indicus పాముల కారణంగా ఈ సృష్టిలో Blue whales పుట్టాయని వారి అభిప్రాయం. ఇక ఆనాడు దీవిగా ఉన్న మన భారత భూ భాగం ఆసియా ఖండాన్ని ఢీకొన్నప్పుడు వచ్చిన భూకంపాలకూ, ప్రకృతి విపత్తులకూ Vasuki indicus పాములు దాదాపుగా అంతరించి పోయాయి. మిగిలిన కొన్ని పాములూ సరైన ఆహారం లభించకా, నాడు ఏర్పడిన వాతావరణ పరిస్థితులలో తమ మనుగడ సాగించలేకా, పూర్తిగా కనుమారుగైనట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే కొంతమంది శాస్త్రవేత్తల వాదన ప్రకారం, భరత ఖండం ఆసియా ఖండాన్ని ఢీకొన్న తర్వాత, మిగిలి ఉన్న Vasuki indicus పాములు మెల్లగా ఆఫ్రికా, అటు నుంచి యూరోప్, అక్కడి నుంచి దక్షిణ అమెరికా వంటి ఖండాలకు వెళ్లిపోయాయనీ, అక్కడున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వాటి పరిమాణం తగ్గి, ప్రస్తుతం కనిపిస్తున్న కొండచిలువలుగా మారాయనీ అంటున్నారు.
ఏది ఏమయినా, ఈ Vasuki indicus పాములు అంతరించిపోయిన ఎన్నో లక్షల సంవత్సరాల తర్వాత పుట్టిన మానవ జాతికి, ఒకప్పుడు అంత పెద్ద పాములు ఉండేవని ఎలా తెలిసింది? మరీ ముఖ్యంగా మన భారతీయ ఋషులు వాటి గురించిన వర్ణనలను అప్పటిలోనే మన శాస్త్రాలలో ఎలా పొందు పరిచారనే విషయాలు, నేటి సైన్స్ పరంగా అంతుచిక్కని మిస్టరీయే.. అదే సనాతన ధర్మం గొప్పదనం..
🚩 ॐ శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే 🙏
Comments
Post a Comment