Posts

Showing posts with the label 'Chhava' Sambhaji Maharaj: The Forgotten Maratha Prince

'Chhava' Sambhaji Maharaj: The Forgotten Maratha Prince శంభాజీ అసలు చరిత్ర!

Image
శంభాజీ అసలు చరిత్ర!  TELUGU VOICE 21 ఏళ్లలో ఓటమి ఎరుగని 140 యుద్ధాలు! చివరకు బావమరిది కుట్రకు బలి! శూరత్వం, వీరత్వం, త్యాగం కలగలిసిన ఒక మహాయోధుడి చరిత్రను ఈ రోజు తెలుసుకుందాము. తండ్రి స్థాపించిన హైందవ స్వరాజ్య సంరక్షణకై తన సర్వస్వాన్నీ ఒడ్డిన పులిబిడ్డ చరిత్ర ఇది. 9 ఏళ్ల వయస్సులోనే తండ్రితో పాటు వెళ్ళి, చావును వెక్కిరించి మరీ బయటకొచ్చిన ఒక ధీరుడి సజీవ గాథ. కేవలం 31 సంవత్సరాల తన జీవితకాలంలో, 140 కి పైగా యుద్ధాలలో పాల్గొని, ఒక్క యుద్ధంలో కూడా ఒడిపోని రణధీరుడి మరపురాని చరిత్ర. శత్రువులకు చిక్కి, 40 రోజుల పాటు చిత్రహింసలను అనుభవిస్తూ, కళ్ళు పీకేస్తున్నా, కాళ్ళు నరికేస్తున్నా, చర్మం ఒలిచేస్తున్నా, తాను నమ్మిన ధర్మాన్ని వదలనని దృఢ చిత్తంతో నిలబడి, చివరకు మృత్యువు ఒడిలో సేదదీరిన మహానీయుడి ఆవేదన. అతడే మరాఠా ముద్దు బిడ్డ.. హైందవ సామ్రాజ్య రక్షణకు పునాది వేసిన ఛత్రపతి శివాజీ మహరాజ్ కు పుట్టిన యువ సింహం, మరాఠా సామ్రాజ్యపు రెండవ ఛత్రపతీ, ధర్మవీరుడు శంభాజీ మహరాజ్. మరాఠా ప్రజలు ముద్దుగా ‘Chaava’ అంటే సింహం బిడ్డగా పిలుచుకున్న ఛత్రపతి శంభాజీ మహరాజ్ గురించి, ఇన్నేళ్లుగా మన కుహనా చరిత్రకారులు దాచేస...