అశోకుడి 9 మంది రహస్య సంఘం ఇంకా కొనసాగుతోందా? Mystery of secret organization formed over 2000 yrs ago

అశోకుడి 9 మంది రహస్య సంఘం ఇంకా కొనసాగుతోందా? TELUGU VOICE మనిషి ఆది మానవుడి స్థితి నుంచి, ఆధునిక మానవుడి స్థాయికి ఎదిగే క్రమంలో, ఎన్నో విషయాలను మధించి, కొన్ని శాస్త్రాలను వెలికి తీశాడు.. ఈ శాస్త్రాలలో కొన్ని, మనిషి అభివృద్ధికి తోడ్పడితే, మరికొన్ని, వినాశనానికి కారణమవుతున్నాయి.. ఆ శాస్త్రాలను దాచిపెట్టడం తోపాటు, మానవాళిని రక్షించడానికి కొన్ని రహస్య సంఘాలు ఏర్పడితే, మరికొన్ని నాశనం చేయడానికి ఏర్పడ్డాయి. వీటిలో కొన్ని పురాతన సంఘాలు, ఇప్పటికీ రహస్యంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తుంటే, కొన్ని కాలగమనంలో కలిసిపోయాయి. అటువంటి వాటిలో 'Illuminati, The Skull and Bones, The Rosicrucians, The Knights Templar' అనే సంస్థలు బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే, ఈ రహస్య సంఘాలన్నీ 15, 16 శతాబ్దాల మధ్యలో ఆరంభమైనవే. కానీ, పాశ్చాత్యులకు రహస్య సంఘాలు అనే పదం తెలియక మునుపే, అఖండ భారతావనిని ఏలిన ఒక చక్రవర్తి, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రహస్య సంఘాన్ని ఏర్పాటు చేసి, అతి పురాతనమైన, శక్తివంతమైన విజ్ఞాన భాండాగారాన్ని, దుష్టుల చేతిలో పడకుండా రక్షణ కల్పించాడు. అసలు ఎవరా భారత చక్రవర్తి? అతను ఎందుకని ఈ రహస్య సంఘాన...