Posts

Showing posts with the label అశ్వత్థ వృక్షం!

అశ్వత్థ వృక్షం! Significance of Ashvattha (Peepal) Tree

Image
అశ్వత్థ వృక్షం! మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణీ! అగ్రత శ్శివ రూపాయ వృక్ష రాజాయతే నమః!! అశ్వత్థ వృక్షం త్రిమూర్తి స్వరూపమే కాకుండా, సర్వదేవతా స్వరూపం. ఈ వృక్షమును ఒక్క శనివారము మాత్రమే ముట్టుకోవచ్చు. అమావాస్య  నాడు ఈ అశ్వత్థ వృక్షానికి శక్తి కొలదీ అంటే, 21, 108 ప్రదక్షిణలు చేసి పూజిస్తే, సర్వాభీష్ట సిద్ధి కలుగుతు౦ది. విష్ణు సహస్ర నామం పఠిస్తూ ప్రదక్షిణ చేయవచ్చు.  మౌనంగా ప్రదక్షిణ చేస్తే అమిత ఫలం లభిస్తు౦ది. ఉదక కుంభం (నీళ్ళ చెంబు) తీసుకుని గర్భిణీ స్త్రీలా మ౦దగతితో ప్రదక్షిణ చేస్తే, అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తు౦ది. రావి చెట్టును పూజించటం వలన కలిగే ఫలితములు: అశ్వత్ధ వృక్షంలో సర్వదేవతలూ ఉంటారు. దాని మహాత్మ్యం గురించి బ్రహ్మాండ పురాణంలో నారదుడు వివరించాడు. అశ్వత్ధమే నారాయణ స్వరూపము. ఆ వృక్షం యొక్క 'మూలము – బ్రహ్మ', 'మధ్య భాగం – విష్ణువు', 'చివరి భాగము – శివుడు' కనుక, దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించి నట్లే. ఈ త్రిమూర్తులు దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిక్కులలోని కొమ్మలలో ఉంటారు. తూర్పు దిక్కున ఉన్న కొమ్మలలో, ఇంద్రాది దేవతలో, సప్త సముద్రాలో, అన్ని పుణ్య నదుల...