ఆనాడు రాముడు చేసినపని ధర్మబద్ధమేనా? Killing Vali: Rama's Confession
ఆనాడు రాముడు చేసినపని ధర్మబద్ధమేనా? రాముడు చేసిన తప్పు ద్వాపర యుగంలో శాపంగా మారిందా? మన పురాణాలనుంచి మనం నేర్చుకోవలసిన ధర్మసూక్ష్మాలు కోకొల్లలు. రామాయణంలో ఎన్నో గొప్ప పాత్రలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవలసిన వారు, ఇంద్ర, సూర్య తనయులైన వాలి, సుగ్రీవుల గురించి. వానర జాతిలో మహా బలవంతులూ, పరాక్రమవంతులుగా పేరుగడించిన ఆ సోదరులు, చివరకు శత్రువులయ్యారు. ప్రతిదినమూ బ్రహ్మ ముహుర్తంలోనే నిద్దురలేచి, నాలుగు సముద్రములకు వెళ్లి, సంధ్యోపాసన గావించేవాడు వాలి. పర్వతాల పైకెక్కి, వాటి శిఖరములను కూల్చి, వాటితో బంతాట ఆడుకునేవాడు. పది తలల రావణుడిని మూడు మార్లు ఓడించిన వీరుడు. అంతటి బలవంతుడైన వాలిని, రాముడు చెట్టు చాటు నుండి అంతమొందించడానికి అసలు కారణం, అతని బలమా, గుణమా? రాముడు వాలిని చంపడం ధర్మబద్ధంగానే జరిగిందా - వంటి ధర్మాధర్మ వితార్కానికి గురిజేసే ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/9LXSsYA2RbE ] వాలి, సుగ్రీవుల యుద్ధంలో, కొన ప్రాణాలతో వున్న వాలిని సమీపించారు రామలక్ష్మణులు. వారిని చూడగానే, పరుష పదములతో నిందించాడు వాలి. ‘‘నీతోయుద్...