వశీకరణ విద్య! ఈ విద్య ఇప్పటికీ ఉందా? Vashikarana

వశీకరణ విద్య! ఈ విద్య ఇప్పటికీ ఉందా? ఒక వ్యక్తిని తమ చెప్పు చేతల్లో నడిపించుకోవడానికి ఉపయోగించే విద్యే ‘వశీకరణం’. దీనిని పూర్వకాలంలో ఎక్కువగా ఉపయోగించే వాళ్లు. ఎక్కువ సందర్భాలలో వశీకరణ విద్యను, ప్రేమ, జీవితంలో ఎదగడానికీ, పనులలో ఆటంకాలు లేకుండా పూర్తవడానికీ ఉపయోగించారు. తమకు కావాల్సినట్టు, తమకు అనుకూలంగా ఉండేలా పని పూర్తి చేసుకోవడానికి, ఈ వశీకరణ మంత్రాలు సహాయ పడతాయి. అయితే ఇదంతా నిజమేనా? వశీకరణం ఈ మోడ్రన్ యుగంలో ఉపయోగించవచ్చా? వశీకరణ మంత్రాలు నిజంగానే పనిచేస్తాయా? వశీకరణం అనేది, మంచి మార్గమా? చెడు మార్గమా? అనేటటువంటి ప్రశ్నలకు సమాధానాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/NL8QPIrBwOA ] గమనిక: ఈ వీడియో ద్వారా వశీకరణ శక్తిని సమర్ధించడం గానీ, మూఢనమ్మకాలను ప్రోత్సహించడం గానీ నా ఉద్దేశ్యం కాదు. కేవలం అతీంద్రయ శక్తి అయినటువంటి వశీకరణం గురించి, సమాచారాన్ని అందించడం మాత్రమే నా ప్రయత్నం. వశీకరణం ఆమోద యోగ్యమే కానీ, చెడు పద్ధతిలో దీనిని ఆచరించడం శాస్త్ర నిషిద్ధమని, ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. చీకటి-వెలుతురూ, మంచి-చెడు, ధర్మం-అధర్మం, ఎలా అవిన...