ఎటువంటివారు పాములూ బల్లులూ తేళ్లుగా జన్మిస్తారు? భగవద్గీత Bhagavad Gita
మూర్ఖపు ఆత్మల గతి! ఎటువంటివారు పాములూ, బల్లులూ, తేళ్లుగా జన్మిస్తారు? 'భగవద్గీత' షోడశోధ్యాయం - దైవాసుర సంపద్విభాగ యోగం (17 – 20 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదహారవ అధ్యాయం, దైవాసుర సంపద్విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, దైవాసుర సంపద్విభాగ యోగములోని, 17 నుండి 20 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/tbwW27eKeDE ] దురహంకారము కలిగిన మనుషులు ఏవిధంగా నడుచుకుంటారో, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు.. 00:49 - ఆత్మసంభావితాః స్తబ్ధా ధనమానమదాన్వితాః । యజంతే నామయజ్ఞైస్తే దంభేనావిధిపూర్వకమ్ ।। 17 ।। ఇటువంటి దురహంకారము, మరియు మొండిపట్టుదల గల మనుషులు, తమ ధనము, సంపదచే గర్వము, అహంకారముతో నిండి, శాస్త్ర నియమముల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా, నామమాత్రంగా, ఆడంబరంగా యజ్ఞములు చేస్తారు. సాధుపురుషులు యజ్ఞములను ఆత్మశుద్ధి కోసం, మరియు భగవంతుని ప్రీతి కోసం చేస్తారు. ఇక్కడ జరిగే అపహాస్యం ఏమిటంటే, ఆసురీ స్వభావము కల జనులు కూడా యజ్ఞములు చేస్తా...