Posts

Showing posts with the label కార్తీక పూర్ణిమ

ఈ రోజు '26/11/2023' కార్తీక పూర్ణిమ - అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.. Kartika Pournami

Image
  ఈ రోజు '26/11/2023' కార్తీక పూర్ణిమ - అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు..   కార్తీక పూర్ణిమను 'త్రిపుర పూర్ణిమ', 'రాస పూర్ణిమ', 'దేవ దీపావళి' అని కూడా అంటారు. ఈ రోజును మనువులలో పద్నాలుగోవాడైన భౌత్యుని పేరున భౌత్యమన్వంతరాది, ఇంద్ర సావర్ణిక మన్వంతరమని కూడా అంటారు. త్రిపురాసుర సంహారం జరిగింది కూడా ఈ రోజే. [ ముచికుందుడు ఎవరు? https://youtu.be/bVirKu3kTVI ] జ్వాలాతోరణ దర్శనంతో ఈ భూమిపై ఉండే సర్వ ప్రాణుల పాపాలూ పరిహరించబడి, సద్గతి లభిస్తుందని పురాణ వచనం. కార్తీక జ్వాలా తోరణం చేసినందు వలన, జాతిభేదం లేకుండా, మానవులకు, కీటకాదులకు, పక్షులకు, దోమలకు, జలచరాలైన చేపలకు, వృక్షాలకు కూడా పునర్జన్మ ఉండదని ఐతిహ్యం. కార్తీక పౌర్ణమి రోజున వేదవ్యాస పూజ కూడా నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున దీపోత్సవం, సర్వపాపహరం. కార్తీక పౌర్ణమి వ్రతం ఆచరించిన పురంజయుడనే రాజు తన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకుని, విష్ణు పూజతో మోక్షాన్ని పొందిన గాధ ప్రచారంలో ఉంది. కార్తీక పౌర్ణమి రోజున పితృ ప్రీతిగా వృషోత్సర్జనం చేయటం, సాలగ్రామాన్ని దానం చేయటం, ఉసిరి కాయలు దక్షిణతో దానం చేయటం వలన, వెను...