Posts

Showing posts with the label కోటి సోమవారం

నవంబర్‌ 9, 2024 "కోటి సోమవారం!"

Image
నవంబర్‌ 9, 2024 "కోటి సోమవారం!"  TELUGU VOICE కార్తీక సోమవారం లాగానే, కోటి సోమవారం అనే ఒక సోమవారం వస్తుందనుకుంటే, అది పొరపాటే... సోమవారం శివుడికి ఇష్టమైన రోజు, కోటి సోమవారాల పూజ ఫలితాన్ని ఇచ్చే విశేషమైన రోజు, 'కోటి సోమవారం'. కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రంతో కలసి వచ్చే రోజునే, కోటి సోమవారంగా పిలుస్తారు. ఈ 2024లో, కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రం నవంబర్‌ 8న ఉదయం 9.18 నిముషాలకు ప్రారంభమై, నవంబర్‌ 9న శనివారం ఉదయం 8.42 నిముషాలకు ముగుస్తుంది. శ్రవణా నక్షత్రం సూర్యోదయంతో కలిసి ఉండడం వలన, నవంబర్‌ 9ని కోటి సోమవారంగా జరుపుకోవాలని అధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. ఆ రోజు చేసే ఏ పని అయినా సరే.. దీపం, స్నానం, దానం, ఉపవాసం లాంటివి, కోటి రెట్లు అధిక ఫలాన్నిస్తాయని శాస్త్ర విదితం. 🚩 ఓం నమః శివాయ 🙏 Link: https://www.youtube.com/post/UgkxEDDejQzfu2fI7FJL2WFJZ20y8pm7HZe9