క్రతవే నమః Kratave Namaha
'క్రతవే నమః' - ఈ నామ జపంతో ఏం జరుగుతుంది? అది సద్గురువు శ్రీ రాఘవేంద్ర స్వామి వారు కుంభకోణం విజయం చేసిన సమయం. తంజావూరు జిల్లా మొత్తం కరవు కాటకాలతో బాధ పడుతున్నది. ఒక పుష్కరకాలంగా సకాలంలో వానలు లేక, ప్రజలంతా ఆకలి దప్పులతో కటకటలాడుతున్నారని, స్థానికులు రాఘవేంద్ర స్వామికి విన్నవించుకున్నారు. అప్పుడు తంజావూరును పాలిస్తున్న చోళ రాజు, రాఘవేంద్రస్వామి మహిమలు విని, రాఘవేంద్ర స్వామి వారిని శరణు వేడాడు. 'స్వామీ, ఒకప్పుడు ఈ చోళనాడు అన్నదాతగా ప్రసిద్ధి గాంచింది. అటువంటి సశ్యశ్యామలమైన ఈ ప్రాంతం, యిప్పుడు కరవుతో కటకటలాడి పోతున్నది. మా ప్రజలను మీరే కాపాడాలి' అని వేడుకున్నాడు. [ సద్గురువులు: https://www.youtube.com/playlist?list=PLNoNQLGbZ7gY5himzO7p9ex-FBKmdn1L- ] ఆనాటి తంజావూరు ప్రజల ప్రవర్తన, నడవడికను గమనించిన రాఘ వేంద్రస్వామి, "రాజా! భగవంతుని ప్రీత్యర్ధం, ప్రజలు నిత్యమూ ఐదు రకాల యాగాలు నిర్వర్తించాలి. వాటికి పంచ మహా యజ్ఞాలని పేరు. అవి.. 1. బ్రహ్మ యజ్ఞం... నిత్యం వేదాల నుండి ఒక భాగాన్ని పారాయణం చేయాలి. 2. దేవ యజ్ఞం... అగ్నిహోత్రం, ఔపోసన మొదలైన వైదిక కర్మలతో, దేవతలను తృప్తి ప...