ఖర్చులేని స్వర్గం!? Inexpensive Heaven

ఖర్చులేని స్వర్గం!? ఒక గురువు శిష్యుడితో ఇలా అన్నాడు.. “స్వర్గానికి ప్రవేశం ఉచితం.. నరకానికి వెళ్లడానికి మాత్రం బోలెడు డబ్బు ఖర్చుపెట్టాలి”.. శిష్యుడు ఆశ్చర్యపోయి, 'అదెలా?' అని అడిగాడు. [ అంత్యకాల చింతనలే మరుజన్మను నిర్ణయిస్తాయా?: https://youtu.be/y6vublgZiQ0 ] అప్పుడు గురువు.. "జూదం ఆడటానికీ, చెడు వ్యసనాలైన వ్యభిచారం, మత్తు పానీయాల సేవనం, ధూమ పానం, ఇలా పాపాలతో ప్రయాణించడానికి ఎంతో డబ్బు అవసరం.. కానీ, ప్రేమను పంచడానికీ, దైవ ప్రార్ధనకీ, సేవ చేయడానికీ డబ్బుతో పని లేదు.. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అప్పుడప్పుడు ఉపవాసం ఉండడానికి డబ్బు అవసరం లేదు.. ఎదుటి వారిని క్షమించమని అడగడం కూడా ఖర్చులేని పనే.. కరుణ, సానుభూతి, మానవత్వం చూపడానికి సంపదలు అవసరంలేదు.. దేవుడిపై నమ్మకం ఉండాలి.. మనపై మనకు, తోటి ప్రాణులపై ప్రేమ, విశ్వాసం ఉండాలి.." అని అన్నాడు. మరి గురువు చెప్పిన ప్రకారం, "డబ్బు ఖర్చు చేసి నరకానికి వెళ్ళడానికి ఇష్టపడతారా? ఉచితంగా లభించే స్వర్గ ప్రాప్తిని ఇష్టపడతారా?" ఇది ఎవరికీ వారు నిర్ణయించుకోవలసిన విషయం.. సత్సంగత్వే నిస్సంగత్వ...