The Varna and Caste System as per Garuda Puranam | శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పిన గరుడ పురాణం ప్రకారం కులము!?
కులము!? – గరుడపురాణంలో చెప్పబడిన వర్ణాశ్రమ ధర్మాలేమిటి? శూద్రులు తపస్సు చేయడం? వేదాలు చదివి బ్రాహ్మణులవ్వడం? బ్రాహ్మణుల చేత పూజలందుకోవడం? ఈ సువిశాల విశ్వం లాగానే, ఆది తెలియనిది, అంతం లేనిది, సనాతన ధర్మం. నాలుగు వేదాలను స్థంభాలుగా చేసుకుని సుస్థిరంగా నిలబడిన సనాతన ధర్మాన్ని నిష్ఠగా పాటించే హిందువులను గెలువలేక, పాశ్చాత్య ధూర్తులు పన్నిన ఒకానొక దౌర్భాగ్యపు పన్నాగం, 'కులం'! 1947 లో పేరుకు వారు వదిలి వెళ్ళినా, Secularism పేరిట హిందువుల ముసుగులో ఇప్పటికీ వారి ప్రయత్నాన్నీ, వారసత్వాన్నీ కొనసాగిస్తూనే వున్నారు కొందరు ద్రోహులు. మరి సాక్షియత్తు శ్రీమహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పిన విషయాలను, వ్యాస మహర్షి మనకందించిన అష్టాదశ పురాణాలలో ఒకటయిన గరుడపురాణంలో, ఆ పైత్యం గురించి ఏం చెప్పబడింది? వర్ణాశ్రమ ధర్మాలేమిటి? వంటి విషయాలను తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/yF1smKwsNqo ] వర్ణమంటే కులం కాదు. పురాణ కాలంలో సమాజాన్ని నడిపించిన వర్ణానికీ, నేటి కలికాలంలో రాజకీయాలను...