ఛత్రపతి శివాజీ జయంతి 2025 Chhatrapathi Shivaji Maharaj Jayanthi

అందరికీ 'ఛత్రపతి శివాజీ జయంతి' శుభాకాంక్షలు 💐 teluguvoice.in స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి, హిందూ మతధర్మాన్ని పరిరక్షించిన ఘనత, ఛత్రపతి శివాజీకే దక్కుతుందనడంలో అతిశయోక్తిలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి పోందిన శివాజీ రాజే భోంస్లే, 1630 ఫిబ్రవరి 19న షాహాజీ, జిజాబాయి పుణ్య దంపతులకు జన్మించాడు. శివాజీ తండ్రి, వ్యవసాయ బోస్లే కులానికి చెందిన వారు. అతను నిజాంషాహీల ప్రతినిధిగా ఉంటూ, మొఘల్ రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాల్లో పాల్గొనేవాడు. తల్లి జిజాబాయి యాదవ క్షత్రియ వంశపు ఆడ పడుచు. శివాజీకి ముందు పుట్టిన వారందరూ మృతి చెందారు. దాంతో జిజాబాయి, తాను పూజించే పార్వతీ దేవి మరోపేరైన శివై పేరును కలిపి శివాజీకి పెట్టింది. ఆమె సంరక్షణలో పెరిగిన శివాజీ, రామాయణ మహాభారతాల విశిష్టతనూ, హిందూమతం యొక్క గొప్పతనాన్నీ తెలుసుకున్నాడు. పరమత సహనం, స్త్రీలను గౌరవించడం, శివాజీకున్న గోప్ప లక్షణం. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/it7JY1jp20A ] దాదాజీ ఖాండ్ దేవ్ దగ్గర శిక్షణ తీసుకున్న శివాజీ, వీరుడిగా యుద్ద రంగంలో అడుగుపెట్టాడు. తండ్రి పరాజయాల...