జీవిత సత్యం - Life Facts
'జీవిత సత్యం'.. తుమ్మెద పెద్ద పెద్ద వృక్షాలకు రంధ్రాలు చేసి, అందులో జీవనం కొన సాగిస్తుంది.. చెక్కలకూ, మొద్దులకు కూడా రంధ్రాలుజేసి, అక్కడ సంతానోత్పత్తి చేసుకుంటుంది.. [ గురువై, ఇలలో జ్ఞానమై, మనలో వెలసిన దత్తుడు! ] కానీ, మకరందం కోసం తామర మీద వాలినప్పుడు, ఆ తామర రెక్కలు ముడుచుకుంటాయి.. 'అయ్యో.. నన్ను ఏదో బంధించేసింది' అని అనుకుని, ఆ తామర రెక్కల్లోనే ఇరుక్కుని చనిపోతుంది.. అయితే మహా మహా వృక్షాలకు సైతం రంధ్రాలు చేయగలిగిన దాని సామర్థ్యం, సున్నితమైన ఆ తామర రేెకులను తొలచలేదా? ఆ తామర రేకులకు రంధ్రాలు చెయ్యలేదా? గట్టిగా రెక్కలు ఆడించినా రాలిపోతాయి.. కానీ, అది దాని సామర్థ్యం మరచి పోవడం, మకరందం గ్రోలే మత్తులోనో, లేక తననేదో బంధించిందన్న భావన దాని శక్తిని బలహీన పరచిందో..! అటువంటి భావనను నమ్మడమే దాని బలహీనత.. ఆ బలహీనత తోనే తన మరణాన్ని కొనితెచ్చుకుంటుంది.. మన జీవితంలోని సమస్యలూ అంతే.. సమస్య ఎప్పుడూ బలమైనది కాదు, మన శక్తిని మనం మరచి పోవడమే దాని బలం.. మన శక్తికంటే దాన్ని బలంగా చూడడం, గుర్తించడం, నమ్మడమే దాని బలం.. "మాయ" అనేది, నీ ఆత్మ శక్తికంటే బలమైనది కాదు.. దాని బలం తామర రేక...