జ్ఞాన త్రిపుతీ! భగవద్గీత Bhagavad Gita Chapter 18
జ్ఞాన త్రిపుతీ! మనిషి చేసే కర్మలను ప్రేరేపించే వీటి గురించి ఏమని చెప్పబడింది? 'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (17 – 21 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 17 నుండి 21 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/yrDn7Si7oPk ] జ్ఞానము, కర్మ, మరియు కర్త.. ప్రకృతి త్రి-గుణముల పరముగా ఉండే వ్యత్యాసాలు ఏంటో చూద్దాం.. 00:49 - యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే । హత్వాఽపి స ఇమాఁల్లోకాన్న హంతి న నిబధ్యతే ।। 17 ।। కర్తృత్వ అహంకార భావమును, అంటే, చేసేది నేనే అన్న భావమును విడిచి పెట్టి, బుద్ధి మమకారాసక్తి రహితముగా ఉండే వారు, ప్రాణులను సంహరించినా సరే, వారు చంపినట్టు కాదు. వారు కర్మ బంధనములకు లోనుకారు. అయితే, శ్రీ కృష్ణుడు గత శ్లోకంలో మూఢ బుద్ధిని వివరించారు. ఇప్పుడు స్వచ్ఛమైన బుద్ధిని వివరిస్తున్నాడు. పవిత్రమైన బుద్ధి కలవారు, చేసేద...