త్రిగుణములు! భగవద్గీత Bhagavadgita Chapter 13
త్రిగుణములు! అసంఖ్యాకమైన జన్మల కర్మరాశి, ఆత్మకు ఏ జన్మను కలుగచేస్తుంది? 'భగవద్గీత' త్రయోదశాధ్యాయం – క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం (19 – 24 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదమూడవ అధ్యాయం, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగములోని 19 నుండి 24 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/5QM0ofLK-6I ] శరీరములోని అన్ని మార్పులూ, మరియు ప్రకృతి త్రిగుణములూ ఎలా సంభవిస్తున్నాయో, శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు.. 00:50 - ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః । మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే ।। 19 ।। ఈ ప్రకారముగా నీకు క్షేత్రము యొక్క స్వభావమునూ, జ్ఞానము యొక్క అర్థమునూ, మరియు జ్ఞాన విషయమునూ, నేను తెలియచేశాను. నా భక్తులు మాత్రమే దీనిని యధార్థముగా అర్థం చేసుకోగలరు. అలా చేసిన పిదప, వారు నా దివ్య స్వభావమునే పొందుతారు. కర్మకాండ, జ్ఞానోపాసన, అష్టాంగమూ మొదలైనవి అభ్యాసం చేసే వారు, వ...