దానాలు – ఓంకారం! భగవద్గీత Bhagavad Gita
అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు! దానాలు – ఓంకారం! ఎటువంటి దానాన్ని రజోగుణ దానమని చెప్పాడు శ్రీకృష్ణుడు? 'భగవద్గీత' సప్తదశోధ్యాయం - శ్రద్ధా త్రయ విభాగ యోగం (21 – 24 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదహేడవ అధ్యాయం, శ్రద్ధా త్రయ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, శ్రద్ధా త్రయ విభాగ యోగములోని, 21 నుండి 24 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/GJw5wFkmEcs ] తామసిక దానముగా ఏది పరిగణించబడుతుందో ఇప్పుడు చూద్దాము.. 00:47 - యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః । దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతమ్ ।। 21 ।। కానీ, అయిష్టముగా ఇవ్వబడిన దానము, ఎదో తిరిగి వస్తుందనే ఆశతో, లేదా ప్రతిఫలము ఆశించి ఇవ్వబడిన దానము, రజో గుణములో ఉన్నదని చెప్పబడినది. అడగక ముందే ఇవ్వటమే, దానము చేయుటకు అతిశ్రేష్ఠమైన పద్దతి. అలా చేయకపోతే, ద్వితీయ శ్రేణి శ్రేష్ఠ పద్దతి ఏమిటంటే, అడిగినప్పుడు సంతోషముగా ఇవ్వటం. మూడవ స్థాయి దానం చేసే స్వభావం ...