దీపారాధన ఇలా చేయకపోతే ఇంట్లో దరిద్రం తాండవించడం ఖాయం! Deeparadhana Process
దీపారాధన ఎలా చేయాలి? Deeparadhana or Lighting Lamps or Diyas Importance in Telugu మన సనాతన హైందవ ధర్మంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉన్న విషయం మనకు తెలుసు. అయితే, మనలో చాలా మందికి దీపారాధన ఎలా చేయాలి? ఏ ఏ సమయాల్లో ఇవ్వాలి? దీపపు కుందిలో ఎన్ని ఒత్తులు వేయాలి? దీపాన్ని ఏ దిక్కున వెలిగించాలి? ఎటువంటి కుందులలో దీపారాధన చేయాలి? దీపారాధనకు ఏ నూనెను వాడాలి? దీపం వెలిగించినప్పుడు ఏ మంత్రం చదవాలి - అని ఎన్నో సందేహాలు ఉంటాయి. మరి ఆ సందేహాలన్నింటికీ సమాధానం తెలియాలంటే, ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దీపారాధన చేసే ముందు, దేవుడి దగ్గర ఉంచిన దీపారాధన కుందులనూ, ఇతర పాత్రలను కూడా శుభ్రం చేసుకోవాలి. ముందు రోజు దేవుడి దగ్గర పెట్టిన మలినాలన్నీ తీసేయాలి. దేవుడి దగ్గర ఉంచే దీపపు కుందులు, ఇత్తడి తో కానీ, పంచ లోహాలతో కానీ, వెండితో కానీ చేసినవే వాడాలి తప్ప, స్టీలు వంటి మరే ఇతర లోహాలూ వాడకూడదు. ఇవి కొనే స్థోమత లేని వారు, మట్టితో చేసిన దీపపు కుందులను వాడవచ్చు. ఇక దీపారాధనకు వాడే తైలాలలో ముఖ్యంగా, మంచి మేలు రకమైన నువ్వుల నూనెను కానీ, ఆవు నెయ్యినీ, లేదా కల్తీ లేని కొబ్బరి నూనెనూ ఉపయోగించా...