ఈ రోజు '31-03-2023' ధర్మరాజ దశమి! Dharmaraja Dasami

ఈ రోజు '31-03-2023' ధర్మరాజ దశమి! ఈ పుణ్య దినాన్ని 'ధర్మరాజ దశమి' లేదా 'యమ ధర్మరాజ దశమి' అంటారు. ఈ రోజు, మరణానికి దేవుడయిన యమ భగవానుడికి అంకితం చేయబడింది. యమధర్మరాజు అని కూడా పిలువబడే ధర్మరాజుకు అంకితం చేసిన పూజ ఈ రోజు జరుగుతుంది. ఈ వ్రతాన్ని 10వ రోజు చైత్ర మాసం శుక్ల పక్షంలో పాటిస్తారు. ప్రాథమికంగా ఈ రోజున చేసే పూజలు, భక్తుడి నుండి మరణ భయాన్ని తొలగించే దిశగా ఉంటాయి. మరణం యొక్క రహస్యం గురించి తెలుసుకోవడానికి యమ నివాసానికి వెళ్ళిన కథ, ఉపనిషత్తులోని యువ నచికేతుల కథ, వినడం ఆనందంగా ఉంటుంది. ఉపనిషత్తులకు వేదాంతాలు అని పేరు. ఆధ్మాత్మిక జ్ఞానంలోని లోతును 'వేదాంతం' అని పిలుచుకునేంతగా ఉపనిషత్తులు భారతీయ తాత్విక చింతనను ప్రకటిస్తున్నాయి. ఉపనిషత్తులో అక్కడక్కడా కొన్ని కథలు కనిపించినా, వాటిలో సత్యకామజాబాలి, నచికేతుడి కథలకి చాలా ప్రాముఖ్యత ఉంది. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడమే జ్ఞాని లక్షణం అని సత్యకామజాబాలి చెబితే, అన్న మాటకు కట్టుబడాలి అని నచికేతుని కథ ప్రస్ఫుటం చేస్తుంది.. [ పిచ్చుకల రూపంలో ధర్మదేవతలు జాబాలికి నేర్పిన గుణపాఠం: https://youtu.be/L4UeG2rUorU ] ఇక న...