Story of a Pious Woman | 'పుణ్యాత్మురాలు' - బేతాళ కథలు!

'పుణ్యాత్మురాలు' - బేతాళ కథలు! భర్తకు ‘మళ్ళీ పెళ్లి’ చేసిన స్త్రీ పుణ్యాత్మురాలెలా అయ్యింది? బేతాళ పంచవింశతి కథల మూలాలు, అత్యంత ప్రాచీనమైనవి. సా.శ.పూ. 1 వ శతాబ్దానికి చెందిన ఈ కథలు, తొలిసారిగా శాతవాహనుల యుగానికి చెందిన గుణాడ్యుని బృహత్కథలో, ఒక భాగంగా చోటుచేసుకున్నాయి. మొట్టమొదట పైశాచి భాషలో రాయబడిన ఈ కథలు, తరువాతి కాలంలో సంస్కృత భాషలోకి అనువదించబడ్డాయి. అయితే, పైశాచి భాషలోని బృహత్కథ మూలగ్రంధం అలభ్యం కావడంతో, సంస్కృత భాషలో అనువదించబడిన కథలే మిగిలాయి. సాక్షాత్తూ పరమేశ్వరుడే పార్వతీ మాతకు చెప్పినట్టుగా పేర్కొనే ఆ కథలు, మనలను సన్మార్గంలో నడిపించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ కథ పంచవింశతి కథలలో ఒకటాకాదా అనే విషయాన్ని పక్కనబెట్టి, కథలోని నీతిని గురించి మీరేమనుకుంటున్నారో, కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక కథ విషయానికి వస్తే, ఒక స్త్రీ తన కుంటుంబాన్ని ఎలా తీర్చుదిద్దుకున్నది? తన భర్తకు రెండవ వివాహం ఎందుకు చేసింది? అందరు అత్తలలాగానే కోడలితో కఠినంగా వ్యవహరించినా కూడా, పుణ్యాత్మురాలిగా ఆ స్త్రీమూర్తి బేతాళ కథలలో స్థానం ఎలా సంపాదించుకోగలిగింది? వంటి విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుక...