Posts

Showing posts with the label బేతాళుడు

బేతాళుడు! బేతాళుని పూర్వ జన్మ వృత్తాంతం! Past Life of Betala (Vikramarka Betala)

Image
బేతాళుడు! బేతాళుని పూర్వ జన్మ వృత్తాంతం! మనం చిన్నప్పటి నుండి చాలా కథలు విని ఉంటాము. కానీ, వాటిలో ప్రత్యేకతను సంతరించుకున్న కథలు అంటే, విక్రమార్క బేతాళ కథలు ముందు వరుసలో ఉంటాయి. ఇవి రాబోయే తరాలకు కూడా ఎంతో ప్రత్యేకమైనవి. ఎన్నో వేల సంవత్సరాల క్రితం రాసిన కథలే అయినా, అవన్నీ నేటికీ ఆచరణీయమే. విక్రమార్క – బేతాళుల గురించి, మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ, అసలు బేతాళుడు ఎవరు? సకల విద్యా పారంగతుడూ, దిక్‍దిగంతాలకూ వ్యాపించిన ఖ్యాతిని పొందినవాడూ, సుగుణ వంతుడూ అయిన విక్రమార్కుడంతటి వాడిని పరీక్షపెట్టేటంతటి శక్తి బేతాళుడికి ఎక్కడిది? విక్రమార్క-బేతాళ కథల మూలం, స్మశానమా, అరణ్యమా? బేతాళుడి గత జన్మ చరిత్ర ఏంటి? అనేటటువంటి ఉత్సుకతను కలిగించే, వ్యాస భగవానుడు రచించిన ‘భవిష్య పురాణం’లోని అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/c3qWnvxsmtI ] గోదావరీ నదీ తీరాన, ప్రతిష్టానపురానికి రాజైన విక్రమార్కుడికి ఒక భిక్షువు, రోజూ ఒక పండు లోపల రత్నాన్ని పెట్టి ఇస్తూ, ఆయన ప్రాపకం సంపాదించటానికి ప్రయత్నించేవాడు. అలా పండులో రత్నం పెట్టి ఇస్తున్నట్లు, కొన్ని ర...