బ్రాహ్మణులని ఎవరిని అంటారు? భగవద్గీత Bhagavad Gita
బ్రాహ్మణులని ఎవరిని అంటారు? శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 'భగవద్గీత' సప్తదశోధ్యాయం - శ్రద్ధా త్రయ విభాగ యోగం (13 – 16 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదహేడవ అధ్యాయం, శ్రద్ధా త్రయ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, శ్రద్ధా త్రయ విభాగ యోగములోని, 13 నుండి 16 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/w2ANVXD63co ] ఎటువంటి యజ్ఞము, తమో గుణములోనికి వస్తుందో ఇప్పుడు చూద్దాము.. 00:47 - విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణమ్ । శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే ।। 13 ।। శ్రద్ధావిశ్వాసములు లేకుండా మరియు శాస్త్ర నియమాలకు విరుద్ధంగా, ప్రసాదవితరణ చేయకుండా, మంత్రములు జపించకుండా, మరియు దక్షిణ ఇవ్వకుండా చేయబడిన యజ్ఞము, తమో గుణములో ఉన్నదని పరిగణించబడును. జీవితంలో, అనుక్షణం వ్యక్తులకు ఏ పనులు చేయాలన్న విషయంలో, ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. మన సమాజానికి, మరియు మన సంక్షేమానికి దోహదపడే మంచి పనులు ఉంటాయి. అదే సమయంలో, ఇతరులకూ మనకూ హానికరమైన త...