సర్వధర్మజ్ఞుడైన భీష్మాచార్యుడిని ధర్మరాజడిగిన 6 ప్రశ్నలేంటి? 6 Questions of Yudhishtira to Bhishma

భక్తి! జ్ఞాన సముపార్జన! TELUGU VOICE సర్వధర్మజ్ఞుడైన భీష్మాచార్యుడిని ధర్మరాజడిగిన 6 ప్రశ్నలేంటి? “స్వ స్వరూపానుసంధానం భక్తి రిత్యభిధీయతే” అని సూత్రీకరించారు, నారద మహర్షి. దానిని బట్టి, జీవాత్మను పరమాత్మతో చేర్చటమే ‘భక్తి’ అని తెలుస్తోంది. “సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం, హృషీకేణ హృషీకేశ సేవనం భక్తి రుచ్యతే” అని నారద పంచరాత్రం లోనూ, “అన్యాభిలాషితా శూన్యం జ్ఞానకర్మాద్యనావృతం, ఆనుకూల్యేన కృష్టానుశీలనం భక్తి రుత్తమా”.. అని భక్తి రసామృత సింధువులోనూ విశదీకరింపబడి ఉంది. “మన ఇంద్రియాలన్నింటి ద్వారా, ఇంద్రియాలకు అధిపతి అయిన పరమాత్మను సేవిస్తూ ఉండడమే 'భక్తి'. జ్ఞాన కర్మాదులవైపు మనస్సు పోనీయకుండా, శ్రీ కృష్ణుని సంతృప్తి పరచడమే లక్ష్యంగా చేసే సాధన, ఉత్తమ భక్తిగా పరిగణింప బడుతుందన్నదే, వాటి తాత్పర్యం. మరి అంపశయ్యపై మృత్యు నిరీక్షణలో వున్న భీష్ముడు, భక్తి గురించీ, విష్ణు సహస్రనామం గురించి ఏం చెప్పాడు? అన్న విషయాలను తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/...