Posts

Showing posts with the label భూత్ మేళా

Bhoot Mela: Unique ghost fair held in India | భూత్ మేళా!

Image
భూత్ మేళా! TELUGU VOICE దేవీ నవరాత్రులలో దయ్యం పట్టిన వారు మాత్రమే వచ్చే దేవీ ధామ్ ఆలయం! మనం కొత్తగా ఒక ఊరికి వెళ్ళినప్పుడు, అదీ దేవీ నవరాత్రుల సమయం అయితే, అమ్మవారి ఆలయాలలో ఎంతో వైభవంగా ఆ తల్లి పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉండడం చూస్తుంటాము. ఆ 9 రోజులలో ఏదో ఒక రోజు దగ్గరలో ఉన్న అమ్మవారి అలయానికి వెళ్ళి, ఆ తల్లిని దర్శించుకుని, ఆమె అనుగ్రహాన్ని పొందాలని అనుకోవడం సర్వ సాధారణం. ఒకవేళ ఈ లోపు మనకు దగ్గరలో ఒక పురాతన దేవీ ఆలయం ఉందని తెలిస్తే, మన అడుగులు ఆ ఆలయం వైపుకు ఖచ్చితంగా పడతాయి. దేవీ నవరాత్రుల సమయం, అందులోనూ పురాతన అమ్మవారి ఆలయం అన్నప్పుడు, ఆలయం చుట్టూ కోలాహలం ఉండడం సహజమే.. ఎటు చూసినా జనాలు బారులు తీరి ఉండటమూ మామూలే.. మనం చెప్పుకోబోతున్న ఈ ఆలయం దగ్గర కూడా అదే విధంగా ఉంటుంది కానీ, అక్కడి వాతావరణం కాస్త వింతగా అనిపిస్తుంది. ఎన్నో అనుమానాలతో ఆలయంలోకి అడుగు పెడితే, అక్కడి జనం ముఖాలలో ఆలయ సందర్శనానికి వచ్చిన ఆనందం కనిపించకపోగా, జుట్టు విరబోసుకుని, కోపంగా చూస్తూ, ఒక విధమైన భయానక రూపాలలో ఉంటారు. అర్చకుడు అమ్మవారికి హారతి ఇవ్వడం మొదలు పెట్టగానే, గర్భగుడి బయటి జనాలందరూ బిగ్గరగా, భయంకరంగా అరుస్తూ,...